బిందు మాధవి (Bindu Madhavi) : ఈమె లెక్కే వేరు.. బిగ్ బాస్ టైటిల్ గెలిచిన తొలి మహిళగా సత్తా చాటేసింది !

Updated on May 24, 2022 10:20 AM IST
ఈసారి బిగ్ బాస్ నాన్ స్టాప్ ఫైనల్ రౌండ్‌లో బిందు మాధవి, అఖిల్ సార్థక్‌, యాంకర్ శివ, అరియానా గ్లోరి, మిత్రా శర్మలు టాప్‌ 5 లో నిలవగా.. అందులో బిందు మాధవి ఒక్కరే తన సత్తా చాటారు. విజేతగా నిలిచారు. 
ఈసారి బిగ్ బాస్ నాన్ స్టాప్ ఫైనల్ రౌండ్‌లో బిందు మాధవి, అఖిల్ సార్థక్‌, యాంకర్ శివ, అరియానా గ్లోరి, మిత్రా శర్మలు టాప్‌ 5 లో నిలవగా.. అందులో బిందు మాధవి ఒక్కరే తన సత్తా చాటారు. విజేతగా నిలిచారు. 

ఎట్టకేలకు చాలామంది అనుకున్నదే నిజమైంది. ‘బిగ్‌ బాస్‌ నాన్‌స్టాప్‌ తెలుగు’ (Bigg Boss Non Stop Telugu) మొదటి సీజన్‌ టైటిల్ విజేతగా సినీ నటి బిందు మాధవి (Bindu Madhavi) ట్రోఫీని అందుకున్నారు. అలాగే రూ. 40 లక్షల ప్రైజ్ మనీని కూడా సొంతం చేసుకున్నారు. ఎన్నో ఆశలతో బరిలోకి దిగిన నటుడు అఖిల్‌ సార్థక్‌‌ ఈసారి కూడా రన్నర్‌‌గానే నిలిచారు. బిగ్ బాస్ సీజన్ 4 లో కూడా అఖిల్ రన్నరప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అదే సీజన్ 4 లో అభిజిత్ విజేతగా నిలిచాడు. 

అన్నింటి కంటే చిత్రమైన విషయం ఏమిటంటే..  ‘బిగ్‌బాస్‌’ రియాలిటీ షోకు సంబంధించి ఇప్పటివరకు ఒక్కసారి కూడా మహిళా కంటెస్టెంట్‌ టైటిల్ విజేతగా నిలవలేదు. ఈ సంప్రదాయాన్ని బ్రేక్ చేస్తూ, బిందు మాధవి ఈసారి అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేశారు. బిందు మాధవి గతంలో తమిళ్ బిగ్ బాస్‌లో కూడా తనదైన శైలిలో రాణించారు. మదనపల్లిలో జన్మించిన బిందు మాధవికి తెలుగులో ఆవకాయ బిర్యానీ, బంపర్ ఆఫర్, ప్రతి రోజు, పిల్ల జమిందార్, రామరామ కృష్ణ కృష్ణ, ఓం శాంతి లాంటి సినిమాలు కథానాయికగా ఆమెకు మంచి పేరు తీసుకొచ్చాయి. 

ఈసారి బిగ్ బాస్ నాన్ స్టాప్ ఫైనల్ రౌండ్‌లో బిందు మాధవి, అఖిల్ సార్థక్‌, యాంకర్ శివ, అరియానా గ్లోరి, మిత్రా శర్మలు టాప్‌ 5 లో నిలవగా.. అందులో బిందు మాధవి ఒక్కరే తన సత్తా చాటారు. విజేతగా నిలిచారు. 

 

 

గ్రాండ్ ఫినాలేలో దర్శకుడు అనిల్‌ రావిపూడితో పాటు, హీరో కమ్ కమెడియన్ సునీల్  కార్యక్రమాన్ని మొత్తం దగ్గరుండి నడిపించారు. అలాగే ఎఫ్ 3 సినిమా ప్రమోషన్ కూడా చేశారు. వీరిద్దరూ క్యాష్‌తో నింపిన సూట్‌కేసును డయ్యర్స్ మీదకు తీసుకొచ్చారు. విజేత ట్రోఫీని పక్కన పెట్టి.. రూ. 10 లక్షలు కలిగిన సూట్ కేస్‌ను తీసుకొని టాప్ 5 సభ్యులలో ఎవరైనా ఇంటిని విడిచి వెళ్లిపోవచ్చని తెలిపారు. 

ఈ సూట్ కేసును తీసుకునేందుకు అరియానా, యాంకర్ శివ పోటీపడ్డారు. కానీ తనకు ఆ డబ్బు చాలా అవసరం అంటూ, తన సొంత ఇంటి కలను నెరవేర్చుకోవడానికి ఆ డబ్బు ఉపయోగపడుతుందంటూ అరియానా రూ.10లక్షలు ఉన్న సూట్‌ కేసును తీసుకున్నారు. 

ఇటీవలే ప్రారంభమైన బిగ్ బాస్ నాన్ స్టాప్ అనే కొత్త ఫార్మాట్‌ షోలో మొత్తం 18 మంది పోటీదారులు పార్టిసిపేట్ చేశారు. అజయ్‌ కుమార్‌, అఖిల్‌ సార్థక్‌, బిందుమాధవి, హమీద, మహేశ్ విట్టా, ముమైత్‌ ఖాన్‌, తేజస్విని, శ్రీ రాపాక, అరియానా, యాంకర్ శివ, స్రవంతి చొక్కారపు, ఆర్జే చైతు, అనిల్‌ రాథోడ్‌, మిత్రా శర్మ, బాబా భాస్కర్‌, నటరాజ్‌ మాస్టర్‌, అషు రెడ్డి, సరయు హౌస్ మేట్స్‌గా బిగ్ బాస్ ఇంటిలోకి వెళ్లారు. ఈ కొత్త రకం బిగ్ బాస్ షోలో మొదటి సీజన్ 84 రోజుల పాటు నిరాటంకంగా సాగడం గమనార్హం. 

Advertisement
Credits: Disney Hotstar (Twitter)

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!