ఎక్స్‌ట్రా జబర్దస్త్ (Extra Jabardasth) : పుష్ప డైలాగ్‌తో రెచ్చిపోయిన ఫైమా.. ప్రోమో వైర‌ల్

Updated on Apr 28, 2022 04:42 PM IST
జబర్దస్త్ ఫైమా & బుల్లెట్ భాస్కర్
జబర్దస్త్ ఫైమా & బుల్లెట్ భాస్కర్

బుల్లితెరపై ప్రసారమవుతున్న కామెడీ షోల‌లో జ‌బర్ద‌స్త్‌కు ఎప్పుడూ ప్ర‌ధాన స్థానం ఉంటుంది. ప‌లు ఛానెళ్లో ఎన్ని షోలు వ‌చ్చినా.. కొన్ని ఏళ్లుగా జ‌బ‌ర్ద‌స్త్‌ను జ‌నాలు విశేషంగా ఆద‌రిస్తున్నారు. వారంలో ప్రతి గురువారం, శుక్ర‌వారం.. జ‌బ‌ర్ద‌స్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్  (Extra Jabardasth) పేరుతో రెండు ఎపిసోడ్‌లు ప్ర‌సార‌మ‌వుతుంటాయి. తాజాగా ఎక్స్‌ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలయింది.

అందులో టీమ్ లీడ‌ర్‌గా ఉన్న బుల్లెట్ భాస్క‌ర్ ప్రదర్శించిన స్కిట్ హిలేరియ‌స్‌గా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఆ టీమ్‌లో మొద‌ట్లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా ఉన్న ఫైమా, త‌న పంచుల‌తో అంచెలంచెలుగా ఎదిగి ప్ర‌స్తుతం ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోంది. 

ఇక‌, తాజాగా విడుద‌ల చేసిన ఈ ప్రోమోలో సైతం పుష్ప సినిమాలో ఫేమ‌స్ అయిన డైలాగ్‌తో ఆమె అద‌ర‌గొట్టింది. స్కిట్‌లో భాగంగా క‌ట్నంగా రూ.లక్ష తీసుకొచ్చిన ఇల్లాలి పాత్ర‌లో అద‌ర‌గొట్టింది.

స్కిట్‌లోని అంద‌రు స‌భ్యుల చెంప‌లు వాయిస్తూ ఫ‌న్ జ‌న‌రేట్ చేసింది. ముఖ్యంగా వ‌ర్ష‌, ఇమ్మాన్యుయేల్, భాస్క‌ర్‌ను కొడుతూ ఆమె చెప్పిన డైలాగులు హిలేరియ‌స్‌గా ఉన్నాయి. మొత్తానికి ఫైమా ఈ స్కిట్‌లో త‌న‌దైన కామెడీతో అంద‌రినీ క‌డుపుబ్బా న‌వ్వించింది. మరి, మనం కూడా బుల్లెట్ భాస్క‌ర్ టీమ్ చేసిన పూర్తి స్కిట్‌ను చూడాలంటే శుక్ర‌వారం వేచిచూడాల్సిందే. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!