Love Language: ప్రేమ భాష‌లు...!

Updated on May 01, 2022 06:28 PM IST
మీరు ప్రేమించే వారిపై ఇష్టాన్ని ఎలా చెప్పాలో తెలియ‌డం లేదా? ఏం చేస్తే ప్రేమ క‌లుగుతుంది? అయితే  ప్రేమ‌కు భాష‌లున్నాయ‌ని .. వాటితో ప్రేమను చెప్పొంచ్చంటున్నారు డాక్ట‌ర్ గ్యారీ చాప్‌మన్. ఆ ప్రేమ భాష‌లేంటో తెలుసుకుందాం.
మీరు ప్రేమించే వారిపై ఇష్టాన్ని ఎలా చెప్పాలో తెలియ‌డం లేదా? ఏం చేస్తే ప్రేమ క‌లుగుతుంది? అయితే  ప్రేమ‌కు భాష‌లున్నాయ‌ని .. వాటితో ప్రేమను చెప్పొంచ్చంటున్నారు డాక్ట‌ర్ గ్యారీ చాప్‌మన్. ఆ ప్రేమ భాష‌లేంటో తెలుసుకుందాం.

మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నారా? వారికి మీ ప్రేమను గూర్చి ఎలా తెలపాలో తెలియ‌డం లేదా? అయితే అసలు ప్రేమనేది ఎలా పుడుతుందో తెలుసుకోండి?   ప్రేమ‌ను వ్యక్తపరచడానికి కూడా ఎన్నో భాష‌లుంటాయి. మీ ప్రేమను వ్యక్తపరచడానికి వీటిని సాధనాలుగా వాడండి అంటున్నారు ప్రముఖ మానసిక శాస్త్రవేత్త డాక్ట‌ర్ గ్యారీ చాప్‌మన్. ఆ ప్రేమ భాష‌లేంటో మనమూ తెలుసుకుందాం.

1. ప్రేమ ప‌దాలు (Lovely Words)

ప్రేమించిన వారితో ఆప్యాయంగా మాట్లాడాలి. వారిని ప్ర‌శంసించేందుకు అందమైన ప‌దాల‌ను వాడాలి. వీటినే ప్రేమ ప‌దాలంటారు.  స్ఫూర్తిదాయకమైన మాట‌లు, ఎవరిలోనైనా తప్పకుండా ప్రేరణను నింపుతాయి. పైగా అవ‌న్నీ ప్రేమ భావ‌నను గురించి తెలిపే ప‌దాలు కావాలి. ప్రేమించే వారిని మెచ్చుకోవ‌డ‌మంటే, వారిని సంతోషపెట్ట‌డ‌మే. 

2. ప్రేమ బ‌హుమ‌తి (Lovely Gifts)

ప్రేమ‌ను తెలిపేందుకు ఏదైనా బ‌హుమ‌తి ఇవ్వ‌డం కూడా ప్రేమ భాష‌లో భాగ‌మే.

విలువైన‌ది ఇస్తున్నారా లేదా గుర్తుండిపోయే బ‌హుమ‌తిని ఇస్తున్నారా అనేది మీ ఇష్టం. తమ ప్రేమను తెలిపేందుకు ప్ర‌య‌త్నించే వారు, ప్రేమించే వారితో మాట్లాడే అవ‌కాశం రోజూ ఉండాల‌నుకుంటారు. 

3. ప్రేమ సేవ‌లు (Lovely Service)

మీరు మాట్లాడే ప్రేమ మాట‌లు, మీ భాగ‌స్వామి భారాన్ని త‌గ్గించేలా ఉండాలి. ప్రేమ‌గా సేవ‌లను అందిస్తే వారిపై శ్ర‌ధ్ధ తీసుకుంటున్నార‌ని అనుకుంటారు. ఇచ్చిన మాట త‌ప్ప‌డం, బ‌ద్ద‌క‌స్తులుగా ఉండ‌టం వంటి ల‌క్ష‌ణాలు మిమ్మల్ని చుల‌క‌న చేస్తాయి.

4. ప్రేమ‌గా తాక‌డం (Lovely Touch)

ప్రేమించే వారిని ట‌చ్ చేస్తూ ఉండ‌టం కూడా ఓ ప్రేమ భాషే. చేతులు ప‌ట్టుకోవ‌డం, త‌నకు తాకుతూ ప‌క్క‌న కూర్చోవ‌డం, ముద్దు పెట్టుకోవ‌డం .... ఇవ‌న్నీ ప్రేమ సంకేతాలే. ప్రేమించిన వారి శ‌రీరాన్ని తాక‌డం వ‌ల్ల వారిలో ప్రేమానుభూతి క‌ల‌గవ‌చ్చు. అది విడ‌దీయ‌రాని బంధంగా మార‌వ‌చ్చు. 

5. విలువైన స‌మ‌యం (Lovely Time)

మీ కోసం గ‌డిపే స‌మ‌యాన్ని విలువైన‌దిగా భావిస్తే అది ప్రేమ‌ను తెల‌ప‌డ‌మే. వారితో ఎంత స‌మ‌యాన్ని గ‌డుపుతున్నారన్న దాని క‌న్నా.. వారితో ఎలా గ‌డుపుతున్నార‌నేది ముఖ్యం. 

ప్రేమ‌ను తెలిపేందుకు, మీ మాట‌లే కీల‌కం. మీతో గ‌డిపే కాలం, మాట‌లు న‌చ్చితే.. మీ భాగ‌స్వామి కూడా ప్రేమ భాష‌ను తెలుపుతుంది. మీరు ప్రేమించే వారు మిమ్మల్ని ప‌ట్టించుకోవ‌డం లేదా? అయితే ఫీల్ అవ‌్వకండి.  మీరూ ప్రేమ భాష‌ను నేర్చుకోవడానికి ప్రయత్నించండి. 



 

Advertisement
Credits: Instagram

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!