Sushanth : అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్‌‌కు ఎదురైన వింత ప్రశ్న.. ఆసక్తికర సమాధానమిచ్చిన యువ నటుడు !

Updated on Jun 06, 2022 04:34 PM IST
హీరో సుశాంత్ (Hero Sushant)
హీరో సుశాంత్ (Hero Sushant)

Sushanth: టాలీవుడ్‌లో 'కాళిదాసు', 'కరెంట్', 'అడ్డా' వంటి సినిమాలతో అలరించాడు హీరో సుశాంత్. నటుడు సుమంత్‌కి ఈయన కజిన్ అవుతారు.  అక్కినేని ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుశాంత్, ఇటు కథానాయకుడిగా నటిస్తూనే.. అటు ఇతర హీరోల సినిమాల్లోనూ కీ రోల్స్ ప్లే చేస్తున్నాడు. ఇటీవలే అల్లు అర్జున్ సినిమా 'అల వైకుంఠపురములో..' సహాయ నటుడిగా సుశాంత్ నటించాడు.

అదేవిధంగా రవితేజతో కలిసి ప్రస్తుతం 'రావాణాసుర' ప్రాజెక్ట్‌కు వర్క్ చేస్తున్నాడు. తాజాగా నెటిజన్లతో సుశాంత్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ముచ్చటించాడు. అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన ఎంతో కూల్‌గా సమాధానాలు ఇచ్చాడు.

ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో హీరో సుశాంత్‌కు (Sushanth)  ఓ వింత అనుభవం ఎదురయ్యింది. సోషల్ మీడియా విస్తృతం అయినప్పటి నుంచి, సెలబ్రెటీలకు.. సామాన్యులకు మధ్యనుండే  అంతరం చెరిగిపోతూ వస్తోంది. దీంతో స్టార్స్ ఎప్పటికప్పుడు సామాన్యులకు అందుబాటులో వస్తున్నారు. వారితో చిట్ చాట్‌లు నిర్వహిస్తూ, ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇదే క్రమంలో సెలబ్రిటీలు కూడా.. వాళ్ల ఇమేజ్ ఇంకాస్త పెంచుకుంటూనే, ఫాలోయింగ్‌నూ డెవలప్ చేసుకుంటున్నారు.

ఇక ఇటీవలి కాలంలో అక్కినేని యంగ్ హీరో సుశాంత్ (Sushanth) కూడా సోషల్ మీడియాలో చిట్ చాట్ చేస్తూ.. తన ఫ్యాన్స్‌కు అందుబాటులోకి వస్తున్నాడు. ఈ మధ్యకాలంలోనే, 'షూట్ యువర్ క్వశ్చన్స్' అంటూ... నెట్టింట్లో అభిమానులతో చిట్ చాట్ నిర్వహించాడు. అయితే ఈ చిట్ చాట్‌లో సుశాంత్‌కు.. ఓ షాకింగ్ ప్రశ్న ఎదురయ్యింది.

'మీరు వర్జిన్ యేనా?' అని ఓ నెటిజన్ సుశాంత్‌ను నేరుగా ప్రశ్నించాడు. దానికి సుశాంత్ కూడా కూల్‌గా.. తెలివిగా సమాధానం చెప్పాడు. 'ఓ వెలుగుతున్న దీపం' బొమ్మను ఆన్సర్‌గా చూపించాడు. 

అలాగే 'మీరు ఎక్కడ ఉన్నారు' ఎవరో  అడగ్గా.. తాను ఉండే ప్లేస్ ఫొటోను పంపించాడు సుశాంత్ . 'పెళ్లి రోజు ఎప్పుడు' అని అడగ్గా.. అనుమానం వ్యక్తం చేస్తూ ఓ సింబల్ పెట్టాడు. 'నెక్ట్స్ మూవీ' ఏది అంటే.. రవితేజ (Raviteja) 'రావాణాసుర' పోస్టర్‌ను పోస్టు చేశాడు. 'హాయ్ అన్న.. అల్లు అర్జున్‌'తో కలిసి ఎప్పుడు నటిస్తారని అడగ్గా.. అల వైకుంఠపురం పార్ట్-2 ఉందా అని అల్లు అర్జున్‌ను ట్యాగ్ చేశాడు.

ఓ నెటిజన్ మొబైల్ నంబరు అడిగితే.. 'ఇంకేంటి సంగతులు' అంటూ ఆ ప్రశ్నను దాటవేశాడు. 'రవితేజ గురించి చెప్పండి' అనగా.. అతను చాలా మంచి వ్యక్తి అని సమాధానం ఇచ్చాడు. నాగ చైతన్య, అఖిల్‌ ఇద్దరిలో ఒకరిని ఎంచుకోమని అడగ్గా.. 'ప్రశ్నే తప్పు.. అబ్బాయ్' అని రిప్లై ఇచ్చాడు. సిక్స్ ప్యాక్‌లో మిమ్మల్ని ఎప్పుడు చూస్తామంటే.. పాత్ర డిమాండ్ చేస్తే తప్పకుండా చేస్తానని అన్నాడు.

ఈ నేపథ్యంలోనే ఓ నెటిజన్ 'ఆర్ యూ వర్జిన్..?' అంటూ సంబంధంలేని ఓ ప్రశ్న అడిగాడు. సుశాంత్ కూల్‌గా 'నేను నిప్పు' అని అర్థం వచ్చేలా ఓ ఫొటో పెట్టాడు. ప్రస్తుతం ఆ నెటిజన్ అడిగిన ప్రశ్న వైరల్ అవుతోంది. అలాగే ‘మీకు మౌంటైన్స్ అంటే ఇష్టమా..? లేక బీచ్‌లా..?’ అని అడగ్గా, సుశాంత్ తాను బీచ్‌లో ఉన్న ఫొటోను షేర్ చేశాడు.

ఇక‘పెళ్లి రోజు ఎప్పుడు..?’ అనే ప్రశ్నకు 'ఆలోచిస్తున్నట్లు' ఎమోజీ పెట్టాడు సుశాంత్. ఏది ఏమైనా…నెటిజన్లకు సరదాగా ఈ అక్కినేని వారసుడు ఇచ్చిన సమాధానాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

సుమంత్(Sumanth) కొత్త సినిమా : ‘అహం రీబూట్’ ఫ‌స్ట్ లుక్‌ విడుదల

 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!