Top 10 Small Screen Pairs: ఆలుమగలిద్దరూ నటీనటులైతే..!

Updated on Apr 30, 2022 05:16 PM IST
భార్యాభ‌ర్త‌ల అనుబంధంపై వ‌చ్చే టీవీ సీరియ‌ల్స్‌కి ఫాలోయింగ్ ఎక్కువే. అలాగే రేటింగ్ కూడా ఏ మాత్రం త‌గ్గ‌దు. సీరియ‌ల్స్‌లో వారి న‌ట‌న  చూస్తే... వీరు నిజంగా భార్యాభ‌ర్త‌లైతే బాగుండు అనుకుంటారు.
భార్యాభ‌ర్త‌ల అనుబంధంపై వ‌చ్చే టీవీ సీరియ‌ల్స్‌కి ఫాలోయింగ్ ఎక్కువే. అలాగే రేటింగ్ కూడా ఏ మాత్రం త‌గ్గ‌దు. సీరియ‌ల్స్‌లో వారి న‌ట‌న  చూస్తే... వీరు నిజంగా భార్యాభ‌ర్త‌లైతే బాగుండు అనుకుంటారు.

భార్యాభ‌ర్త‌ల అనుబంధంపై వ‌చ్చే టీవీ సీరియ‌ల్స్‌కి ఫాలోయింగ్ ఎక్కువే. అలాగే రేటింగ్ కూడా ఏ మాత్రం త‌గ్గ‌దు. సీరియ‌ల్స్‌లో వారి న‌ట‌న  చూస్తే... వీరు నిజంగా భార్యాభ‌ర్త‌లైతే బాగుండు అనుకుంటారు. సీరియ‌ల్స్‌లో  న‌టించే కొంద‌రు నిజ జీవితంలోనూ భార్యాభ‌ర్త‌లేన‌ట‌. ఆ రియ‌ల్ క‌పుల్ ఎవ‌రో చూద్దాం.

రాజీవ్ క‌న‌కాల, సుమ  (Rajeev Kanakala, Suma)

బుల్లితెర‌, వెండితెర‌.. ఏ తెరకైనా హుషారు తెప్పిస్తున్నారు సుమ క‌న‌కాల‌. వీరు చిన్న‌తెర‌ను ప్రస్తుతం స్పెషల్ షోల‌తో చిల్ చేస్తున్నారు. మేఘమాల సీరియల్‌లో సుమ‌ రాజీవ్ కనకాలతో క‌లసి న‌టించారు. ఆ ప‌రిచ‌యంతో ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమ చిగురించింది. ప్రేమ‌ పెళ్లిగా మారింది. వేయి పడగలు, మేఘమాల, జీవన రంగం, అన్వేషిత లాంటి సీరియల్స్ చేశారు సుమ క‌న‌కాల‌. ప్రస్తుతం టీవీ షోలు, మూవీ షోలకు వ్యాఖ్యాతగా చేస్తున్నారు. ఇక రాజీవ్ క‌న‌కాల సినిమాల్లో ప్ర‌త్యేక పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. 

రాజీవ్ కనకాల & సుమ, జాకీ & హరిత

జాకీ. హ‌రిత‌ (Jackie, Haritha)

బుల్లితెర న‌టులు జాకీ, హ‌రిత ఇద్ద‌రూ ఒకేసారి సీరియ‌ల్ ప్ర‌పంచంలోకి అడుగుపెట్టారు. ఇద్ద‌రూ చాలా ధారావాహికల్లో న‌టించారు.  సీరియ‌ల్స్‌లో వీరిద్ద‌రి  మ‌ధ్య  ఏర్ప‌డిన ప‌రిచ‌యం ప్రేమ‌గా మారింది. ఆ త‌ర్వాత పెళ్లి చేసుకుని ఒక‌ట‌య్యారు. రియ‌ల్, రీల్ లైఫ్‌లలో భార్య‌భ‌ర్త‌లుగా అనుబంధాన్ని కొన‌సాగిస్తున్నారు. సంఘ‌ర్ష‌ణ‌, వైదేహి, మ‌న‌సు, నీవ‌ల్లే.. నీవ‌ల్లే, కుంకుమ‌పువ్వు మొదలైన ధారావాహికలలో న‌టించారు. ప్ర‌స్తుతం సీరియ‌ల్స్‌లో హ‌రిత వేసుకుంటున్న న‌గ‌లకు భ‌లే క్రేజ్ ఉంది. అవ‌న్నీ డిజైన్ చేసేది జాకీనేన‌ట‌. 

నిరూప‌మ్, మంజుల‌ (Nirumpam, Manjula)

డాక్ట‌ర్ బాబు అంటే చాలు అంద‌రికీ ఠ‌క్కున గుర్తుకు వ‌చ్చే పేరు నిరుపమ్. కార్తీకదీపం సీరియ‌ల్‌తో ఒక్క‌సారిగా బుల్లితెర టాప్ హీరో అయిపోయారు ఈయన. చంద్ర‌ముఖి సీరియ‌ల్‌లో మంజుల, నిరుపమ్ ఇద్ద‌రూ భార్య‌భ‌ర్త‌లుగా న‌టించారు. ఆ సీరియ‌ల్ తర్వాత నిజ‌మైన భార్యాభ‌ర్త‌లుగా మారాల‌ని ఫిక్స్ అయ్యారు. పెళ్లి చేసుకున్నారు. హిట్ల‌ర్ గారి పెళ్లాంలో ప్ర‌స్తుతం నిరూప‌మ్ న‌టిస్తుంటే...కృష్ణ‌వేణిలో మంజుల న‌టిస్తున్నారు.  

ఇంద్ర‌నీల్, మేఘనరామి (Indraneel, Meghana Rami)

చక్రవాకం సీరియల్లో నటించిన రాజేశ్ అనే నటుడు, తర్వాత ఇంద్రనీల్‌గా మారారు.  అందుకు కారణం ఆ ధారావాహికంలో తన పాత్ర పేరు ఇంద్ర‌నీల్‌ కావడమే. ఇంద్ర‌నీల్‌గా తను పాపుల‌ర్ కావడంతో, తర్వాత  అదే పేరును కొనసాగించారు. ఆ సీరియ‌ల్లో త‌న‌కు అత్త‌గా నటించిన మేఘనరామిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

నిరుపమ్ & మంజుల, ఇంద్రనీల్ & మేఘనారామి

నగేష్, ప్రీతినిగమ్ (Nagesh, Preeti Nigam)

రుతురాగాలు సీరియల్లో నటించి నగేష్ , ప్రీతినిగమ్‌లు మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ త‌ర్వాత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇస్మార్ట్ జోడీ- 2  షోలో జంట‌గా వ‌చ్చి సంద‌డి చేస్తున్నారు.

అరుణ్, బెంగుళూరు ప‌ద్మ‌ (Arun, Bengaluru Padma)

బుల్లితెర‌పై అరుణ్, బెంగుళూరు ప‌ద్మ భార్యాభ‌ర్త‌లుగా పలుమార్లు నటించారు. ప్ర‌తిఘ‌ట‌న‌, దేవ‌త సీరియ‌ల్స్ చేశారు. తర్వాత వివాహం చేసుకున్నారు. బుల్లితెర‌పై మంచి పేరు పొందిన ప‌ద్మ వెండితెర‌పై కూడా గుర్తుండిపోయే పాత్ర‌ల్లో న‌టించారు. ఎన్నోన్నో జ‌న్మ‌ల బంధం సీరియ‌ల్‌తో మ‌ళ్లీ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు బెంగుళూరు ప‌ద్మ‌.

రాజా, సుహాసిని  (Raja, Suhasini)

సినిమా నుంచి సీరియ‌ల్ వైపు వ‌చ్చి ఓ స్టార్డ‌మ్ సంపాదించుకుంది సుహాసిని. ఇద్ద‌రు అమ్మాయిలు సీరియ‌ల్‌లో న‌టించిన న‌టుడు రాజాను ప్రేమించి పెళ్లి చేసుకుంది. క‌థ‌లో ప్ర‌త్యేక‌త‌, పాత్ర‌ల్లో కొత్త‌ద‌నం ఉండే ధారావాహిక‌ల్లో ప్రస్తుతం సుహాసిని న‌టించి ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తున్నారు. అపరంజి, అష్టాచెమ్మ, గిరిజా క‌ళ్యాణం, దేవ‌త‌ సీరియ‌ల్స్‌లో న‌టించారు. 

మరీనా అబ్రహం, రోహిత్ సాహ్ని (Marina Abraham, Rohit Sahni)

అమెరికా అమ్మాయి సీరియల్ ద్వారా మరీనా అబ్రహం చిన్న‌తెర‌కు ప‌రిచ‌యం అయ్యారు. నటుడు రోహిత్ సాహ్నిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇస్మార్ట్ జోడీ- 1 షో లో క‌నిపించి ప్రేక్ష‌కుల‌ను మురిపించారు.

హరి వినయ్, ఐశ్వర్య పిస్సే (Hari Vinay, Aishwarya Pisse)

అగ్నిసాక్షి సీరియల్ ద్వారా ఐశ్వర్య పిస్సే తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రయ్యారు. న‌టుడు హ‌రి విన‌య్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. వీరిద్దరూ ఇస్మార్ట్ జోడీ 1 షోలో సంద‌డి చేశారు. 

సిద్దార్ద్, విష్ణు ప్రియ (Siddharth, Vishnu Priya)

బుల్లితెర నటుడు సిద్దార్ద్ అభిషేకం సీరియల్ ఫేమ్ విష్ణు ప్రియను ప్రేమ వివాహం చేసుకున్నారు. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!