Marriage Tips పెళ్లైన కొత్త‌లో.. -అంద‌రూ చేసే త‌ప్పులే.

Updated on May 01, 2022 06:16 PM IST
పెళ్లి బంధంపై కొంద‌రు చూపే గౌర‌వం మ‌న‌కు న‌చ్చ‌వ‌చ్చు. వారు ఇచ్చే మంచి స‌ల‌హాలు మ‌న‌కు న‌చ్చ‌వ‌చ్చు. మ‌రి కొంద‌రు పెళైన త‌ర్వాత ఇలా ఉండాలి .. అలా ఉండాలని ఇచ్చే స‌ల‌హాలు మ‌న‌కు న‌చ్చ‌క‌పోవ‌చ్చు. పెళైన త‌ర్వాత నూత‌న దంప‌తుల జీవితం సాఫీగా సాగాల‌ని అంద‌రూ కోరుకుంటారు. పెళ్లైన కొత్త‌జంట‌లు కామ‌న్ గా చేసే తప్పులు కొన్న‌నున్నాయి. అవేంటో మీరు తెలుసుకోండి.
పెళ్లి బంధంపై కొంద‌రు చూపే గౌర‌వం మ‌న‌కు న‌చ్చ‌వ‌చ్చు. వారు ఇచ్చే మంచి స‌ల‌హాలు మ‌న‌కు న‌చ్చ‌వ‌చ్చు. మ‌రి కొంద‌రు పెళైన త‌ర్వాత ఇలా ఉండాలి .. అలా ఉండాలని ఇచ్చే స‌ల‌హాలు మ‌న‌కు న‌చ్చ‌క‌పోవ‌చ్చు. పెళైన త‌ర్వాత నూత‌న దంప‌తుల జీవితం సాఫీగా సాగాల‌ని అంద‌రూ కోరుకుంటారు. పెళ్లైన కొత్త‌జంట‌లు కామ‌న్ గా చేసే తప్పులు కొన్న‌నున్నాయి. అవేంటో మీరు తెలుసుకోండి.

కొత్తగా వివాహ బంధంలోకి అడుగిడుతున్నారు అనగానే. .అందరూ ఏవో కొన్ని సూచనలిస్తుంటారు. అటువంటి వాటిలో కొన్ని మాత్రమే మంచి స‌ల‌హాలు ఉంటాయి. దాంపత్య జీవితమంటే ఇలాగే ఉండాలి? అంటూ కొందరు వ్యక్తపరిచే అభిప్రాయాలు మీకు నచ్చకపోవచ్చు. పెళైన త‌ర్వాత నూత‌న దంప‌తులు ఎవరైనా సరే, జీవితం సాఫీగా సాగాల‌నే కోరుకుంటారు. ఈ క్రమంలో అప్పుడప్పుడు అనుకోని ఇక్కట్లలో చిక్కుకుంటూ ఉంటారు. పెళ్లైన కొత్త‌ జంట‌లు సాధారణంగా చేసే తప్పులు కొన్న‌ి ఉంటాయి. అవేంటో  మనమూ తెలుసుకుందాం

1. మీ సాన్నిహిత్యంపై న‌మ్మ‌కం ఉంచాలి.

మీకు మీ భాగస్వామిపై  న‌మ్మ‌కముంటే ఎలాంటి గొడ‌వ‌లు ఉండ‌వు. ఒక‌వేళ  అనుకోకుండా గొడవ జరిగినా.. ఎవరో ఒకరు అలగడం బెటర్. అప్పుడు ఇద్ద‌రి మ‌ధ్య ఉండే సాన్నిహిత్యం వారి అల‌క‌ల‌ను తీరుస్తుంది. అప్పటి వరకూ సాగిన గొడ‌వ స‌ర‌దాగా మారిపోతుంది. ముఖ్యంగా, ఇద్ద‌రూ క‌లిసి మ‌న‌సు విప్పి మాట్లాడుకుంటే ఎలాంటి గొడ‌వ‌లు జ‌ర‌గ‌వు

2. కుటుంబ బాధ్యతలు పంచుకోవాలి.

పాత కాలంలో మ‌గ‌వారు కుటుంబ బాధ్యతను తీసుకునేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. మ‌గవారితో స‌మానంగా ఆడ‌వాళ్లు కూడా డబ్బు సంపాదిస్తున్నారు. ఉద్యోగాలు చేస్తున్నారు. తమకు అనుగుణమైన కెరీర్‌ను ఎంచుకుంటున్నారు. తమ భాగస్వామికి కూడా అండగా నిలుస్తున్నారు. అందుకే మీరు పెద్ద చ‌దువులు చ‌దివి గృహిణిగా సేవలందిస్తున్నా కూడా.. భ‌ర్త ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే తగిన తోడ్పాటును అందివ్వడానికి వెనుకాడవద్దు. 

3. ఇద్ద‌రికీ స‌మాన బాధ్య‌తే!!

అన్ని విష‌యాల్లోనూ ఇద్ద‌రికీ స‌మాన బాధ్య‌త‌లు ఉండాల్సిందే. కొన్ని అనుకోని పరిస్థితులలో, మీకు లేదా మీ భాగ‌స్వామికి ఆరోగ్యం బాలేక‌పోవ‌చ్చు. అప్పుడు ఒకరి పై మరొకరు ప్రేమాభిమానాలు కలిగి ఉండాలి. అలాగే అప్పుడప్పుడు మీ పిల్ల‌ల‌తో లేదా పెద్ద‌ల‌తో కూడా ఇబ్బందులు రావచ్చు. అలాంటప్పుడు ఇద్దరూ కూర్చొని, మాట్లాడుకొని సమస్యలను పరిష్కరించుకోవాలి. ఎలాంటి ఇబ్బందులు లేని సంసారాలు కొన్ని మాత్ర‌మే ఉంటాయని గుర్తుంచుకోండి. అందుకే ఒక‌రికొక‌రు తోడుగా, సపోర్ట్‌గా ఉండండి

పెళ్లి  అనే కొత్త బంధంలో.. అవ‌ధులు లేని ప్రేమానురాగాలే..  మీ వైవాహిక జీవితాన్ని ఆనందంగా న‌డిపిస్తాయి.

 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!