హీరో య‌శ్ (Yash) లైఫ్ స్టైల్ అదుర్స్.. నెట్టింట్లో వైరల్ అవుతున్న కొన్ని ఆసక్తికరమైన విషయాలు

Updated on Apr 29, 2022 06:33 PM IST
కేజీఎఫ్ సినిమాల‌తో  హీరో య‌శ్(Yash) లైఫ్ మొత్తం మారిపోయింది. యశ్ ఎలాంటి ఇంట్లో ఉంటున్నాడు.. ఏ కార్లు వాడుతున్నారో నెట్‌లో అభిమానులు తెగ సెర్చ్ చేస్తున్నారు. 
కేజీఎఫ్ సినిమాల‌తో  హీరో య‌శ్(Yash) లైఫ్ మొత్తం మారిపోయింది. యశ్ ఎలాంటి ఇంట్లో ఉంటున్నాడు.. ఏ కార్లు వాడుతున్నారో నెట్‌లో అభిమానులు తెగ సెర్చ్ చేస్తున్నారు. 

యశ్.. ఈ హీరో తన కెరీర్ ప్రారంభించింది కన్నడ సినిమాతో అయినా, కేజీఎఫ్ అందించిన హిట్‌తో ఇండియాలోనే పేరొందిన నటుడిగా కితాబునందుకున్నాడు. ఈయన ఇటీవలే నటించిన కేజీఎఫ్ 2 చిత్రం కూడా బాలీవుడ్ బాక్సాఫీసును షేక్ చేసింది. ఒక రకంగా చెప్పాలంటే,కేజీఎఫ్ సినిమాల‌తో  హీరో య‌శ్ (Yash) జీవితం మొత్తం మారిపోయింది. ఈ క్రమంలో ఆయన వ్యక్తిగత జీవితం పై కూడా అభిమానులకు ఆసక్తి అనేది ఏర్పడింది.  యశ్ ఎలాంటి ఇంట్లో ఉంటున్నాడు.. ఎలాంటి కార్లు వాడుతున్నారో ఆయన అభిమానులు అంతర్జాలంలో తెగ సెర్చ్ చేస్తున్నారు. 

సీరియల్స్‌తో తన న‌ట‌న స్టార్ట్ చేసి, సినిమా స్టార్ హీరోగా ఎదిగారు య‌శ్ (Yash). కేజీఎఫ్ సినిమాలు య‌శ్ లైఫ్ స్టైల్‌నే మార్చేశాయి. కేజీఎఫ్ 2 సినిమాకు య‌శ్ 30 కోట్ల రూపాయ‌ల రెమ్యున‌రేష‌న్ తీసుకున్నారు. కేజీఎఫ్ 2 క‌లెక్ష‌న్ల రికార్డుల‌తో య‌శ్ రెమ్యున‌రేష‌న్  ఇంకెంత పెరుగుతుందోన‌ని సినీ విశ్లేషకులు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. 

ప్ర‌స్తుతం య‌శ్ (Yash) బెంగుళూరులో ఉంటున్నారు. బెంగ‌ళూరులో ఈయనకు ఓ డూప్లెక్స్ హౌస్ ఉంది. ఫ్యామిలీతో క‌లిసి య‌శ్ అక్క‌డే ఉంటున్నారు. య‌శ్ వాడే ఖరీదైన కార్లను చూస్తే అవాక్క‌వాల్సిందే. 80 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ ఆడీ క్యూ7, రూ. 70 ల‌క్ష‌ల బిఎండ‌బ్యూ 520డి, రూ.85 ల‌క్ష‌ల మెర్సిడెస్  బెంజ్‌, స్పోర్ట్స్  కారుతో పాటు రేంజ్ రోవ‌ర్ కార్లు య‌శ్‌కు ఉన్నాయి. 

కేజీఎఫ్ ముందు య‌శ్.. కేజీఎఫ్ త‌ర్వాత య‌శ్ అని ఇప్పుడు మనం చెప్పుకోవాలి. ఆయన రియల్ లైఫ్‌లో చాలా తేడా వ‌చ్చేసింది. సీరియ‌ల్ నుంచి పాన్ ఇండియా స్టార్ వరకు ఆయన ఎదిగారంటే, ఆ మాత్రం మార్పు వ‌స్తుందిగా. విలాస‌వంత‌మైన కార్లు, బంగ్లాలు య‌శ్ సొంతం. య‌శ్ (Yash) ఎన్నో బ్రాండ్ల‌కు ప్ర‌చార క‌ర్త‌గా ఉన్నారు. ఒక్కో యాడ్ చేసినందుకు దాదాపు కోటి రూపాయ‌లు రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్నారు.

య‌శ్‌కు ఎంతైనా రెమ్యున‌రేష‌న్ ఇచ్చి సినిమాలు ప్రొడ్యూస్ చేయాలని, బ‌డా నిర్మాత‌లు సైతం వెయిట్ చేస్తున్నారు. య‌శ్‌తో త‌మ బ్రాండ్ల యాడ్లు చేస్తే బిజినెస్ సూప‌ర్‌గా సాగుతుంద‌ని, కార్పొరేట్ కంపెనీలు కూడా ప్లాన్ చేస్తున్నాయి. ఏదేమైనా, కేజీఎఫ్ సినిమాతో య‌శ్‌ (Yash) కు మంచి పాపులారిటీ వ‌చ్చేసింది. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!