'ఆదిపురుష్' టీజర్ (Adipurush Teaser) టీవీలు, మొబైల్స్‌లో చూసి ఓ అభిప్రాయానికి రావొద్దు : ప్రభాస్ (Prabhas)

Published on Oct 08, 2022 07:05 PM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటించిన ‘ఆదిపురుష్’ (Adipurush) సినిమా టీజర్ ఇటీవలే యూట్యూబ్‌లో విడుదలై నంబర్ వన్‌గా ట్రెండ్ అవుతోంది. అయితే, ఈ టీజర్‌పై మిశ్రమ స్పందనలు వచ్చినప్పటికీ వ్యూస్, లైకుల పరంగా మాత్రం దూసుకెళ్తోంది. ఈ టీజర్‌‌ విడుదలైన 24గంటల్లోనే 101 మిలియన్ వ్యూస్‌ను సాధించి రికార్డు సృష్టించడం ద్వారా ఇండియాలోనే నంబర్‌‌ 1 టీజర్‌‌గా నిలిచింది.

అయితే, రికార్డులు ఎలా ఉన్నప్పటికీ.. 'ఆదిపురుష్' టీజర్‌పై (Adipurush Teaser) సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయి. టీజర్ కార్టూన్ వీడియోలా ఉందని.. తమిళ సూపర్ స్టార్ గతంలో నటించిన ‘కొచ్చాడియాన్’ను ఇది గుర్తు చేస్తోందని నెట్టింట్లో కామెంట్లు వస్తున్నాయి. అదే సమయంలో హిందూ వర్గాలు కూడా టీజర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అన్ని వైపుల నుంచి నెగటివిటీ వస్తుండటంతో ‘ఆదిపురుష్’ టీమ్ అలర్ట్ అయ్యింది. 

టీవీలు, మొబైల్స్‌లో 'ఆదిపురుష్' టీజర్ చూసి ఓ అభిప్రాయానికి రావొద్దని చిత్ర దర్శకుడు ఓం రౌత్ (Om Raut) కోరుతున్నారు. ఇది త్రీడి మోషన్ కాప్చర్ టెక్నాలజీతో తెరకెక్కించిన సినిమా అని ఆయన స్పష్టం చేస్తున్నారు. బిగ్ స్క్రీన్స్‌లో ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని పంచడానికి రూపొందించిన చిత్రమని వివరిస్తున్నారు. 

ఈ క్రమంలో బిగ్ స్క్రీన్స్‌లో టీజర్ ఎలా ఉంటుందో చూడాలంటూ ‘ఆదిపురుష్’ (Adipurush)  మేకర్స్ స్పెషల్ ఈవెంట్ నిర్వహించారు. గురువారం హైదరాబాద్‌లో చిత్ర ప్రముఖులతోపాటు విలేకరులకు త్రీడీ కళ్లజోళ్లు ఇచ్చి టీజర్‌ను ప్రదర్శించారు. ఫ్యాన్స్ కోసం శుక్రవారం 60 త్రీడీ థియేటర్స్‌లో టీజర్‌ను ప్రదర్శించనున్నామని పేర్కొన్నారు. ‘ఫ్యాన్స్ ఈ త్రీడీ టీజర్ (Adipurush 3D Teaser) చూసి మాకు రివ్యూ చెప్పాలి. మీ అభిప్రాయం మాకు చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది మీ కోసం తీసిన సినిమా. థియేటర్స్‌లో టీజర్ చూడండి. మీ అభిప్రాయం చెప్పండి. మీకు నచ్చుతుందని భావిస్తున్నాను‘ అని ప్రభాస్ అన్నారు.

Read More: ప్రభాస్ (Prabhas) ‘ఆదిపురుష్’ (Adipurush) లో హనుమంతుడిగా నటించిన 'దేవ‌ద‌త్త' ఎవరో తెలుసా..?