బాలీవుడ్ లో సత్యదేవ్ (Satyadev) ఎంట్రీ అదిరిపోయిందిగా.. 'రామ్ సేతు' (Ram Setu) లో నటనతో ఆకట్టుకున్న యంగ్ హీరో!

Updated on Oct 27, 2022 04:02 PM IST
అభిషేక్ శ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వహించిన 'రామ్ సేతు' చిత్రంతో సత్యదేవ్‌ (SatyaDev) బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు.
అభిషేక్ శ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వహించిన 'రామ్ సేతు' చిత్రంతో సత్యదేవ్‌ (SatyaDev) బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు.

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ (Satyadev) గత కొన్నేళ్లుగా వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో బిజీగా ఉన్నాడు. సత్యదేవ్ ఓ వైపు హీరోగా నటిస్తూనే… తనకు నచ్చిన పాత్రలు వచ్చినప్పుడు ఇతర హీరోల సినిమాల్లో సైతం కీలక పాత్రలు పోషిస్తూ నటుడిగా తనకు హద్దులు లేవని నిరూపిస్తున్నాడు. 

సత్యదేవ్ ఏ సినిమా చేసినా.. అతడి నటన గురించి తప్పకుండా ప్రశంసలు వస్తాయి. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా ఆయన నటనను అందరూ కొనియాడతారు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ 'గాడ్ ఫాదర్' (GodFather) లో సత్యదేవ్ తన డ్రీమ్ రోల్ చేసి అందరినీ మెప్పించాడు.
  
ఇదిలా ఉంటే.. తాజాగా బాలీవుడ్ లో సత్యదేవ్ నటించిన సినిమా ఒకటి రిలీజ్ అయ్యింది. అదే… రామ్ సేతు (Ram Setu). అక్షయ్ కుమార్ (Akshay Kumar) కథానాయకుడిగా నటించిన సినిమా ఇది. అభిషేక్ శ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ చిత్రంతో సత్యదేవ్‌ (Satya Dev) బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నుస్ర‌త్ బ‌రూచా, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఫీ మేల్ లీడ్‌ రోల్స్‌ లో నటించారు. 

తాజాగా బాలీవుడ్ లో సత్యదేవ్ నటించిన సినిమా ఒకటి రిలీజ్ అయ్యింది. అదే… రామ్ సేతు (Ram Setu).

హిందుత్వ కధలకు, పురాణ, ఇతిహాస నేపథ్య చిత్రాలకు డిమాండ్ పెరిగిన సందర్భంగా 'రామ్ సేతు' (Ram Setu) కూడా మంచి విజయాన్ని సాధిస్తుందని, బాలీవుడ్ లో సత్యదేవ్ కెరియర్ కి టర్నింగ్ పాయింట్ అవుతుందని ఆశించారు. అయితే దీపావళికి విడుదలైన ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. అక్షయ్ కుమార్ ఇమేజ్, హిందూ సెంటిమెంట్ ఏమీ ఈ సినిమాని కాపాడలేకపోయాయి.

'రామ్ సేతు' (Ram Setu) చిత్రంలో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించగా, సత్యదేవ్ ఫుల్ లెంగ్త్ కీలక పాత్రలో నటించారు. అయితే, సత్యదేవ్ పాత్రకి మంచి ప్రశంసలు వస్తున్నాయి. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ సత్యదేవ్ సూపర్ అనే అంటున్నారు. ఫుల్ లెంగ్త్‌లో సాగే అక్షయ్ కుమార్ పాత్ర కంటే సత్యదేవ్ క్యారెక్టర్, అతడి నటనే బాగుందని అంటున్నారు. సినిమా డల్ గా ఉండటంతో హిందీలో ఈ యంగ్ హీరో అవకాశాలకు ఆటంకం కలిగిస్తోందని చెప్పవచ్చు.

Read More: Godfather: ‘ఇంతకంటే ఏం చెప్పను’.. సత్యదేవ్ (Satya Dev) ఎమోషన్ పోస్ట్ వైరల్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!