రౌడీ హీరో కోసం 'ఉ.. అంటానని' చెబుతున్న ర‌ష్మిక మంద‌న (Rashmika Mandanna).. స‌మంత‌ను ఫాలో అవుతున్న కన్నడ భామ !

Updated on Jul 05, 2022 05:27 PM IST
ర‌ష్మిక మంద‌న  (Rashmika Mandanna) కూడా సమంత‌లా స్పెష‌ల్ సాంగ్‌లో అద‌ర‌గొట్ట‌నున్నార‌ట‌. 
ర‌ష్మిక మంద‌న (Rashmika Mandanna) కూడా సమంత‌లా స్పెష‌ల్ సాంగ్‌లో అద‌ర‌గొట్ట‌నున్నార‌ట‌. 

టాలీవుడ్‌లో ర‌ష్మిక మంద‌న (Rashmika Mandanna) కు రోజు రోజుకు ఫాలోయింగ్ పెరుగుతోంది. ఈ బ్యూటీని నేష‌న‌ల్ క్ర‌ష్ అంటూ అభిమానులు ముద్దుగా పిలుచుకుంటున్నారు. పుష్ప చిత్రంతో సౌత్‌లోనే కాకుండా, నార్త్‌లోనూ పాపుల‌ర్ న‌టిగా పేరు తెచ్చుకున్నారు ర‌ష్మిక మంద‌న. ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌రకొండ సినిమాలో ర‌ష్మిక ఐటం సాంగ్ చేస్తోందంటూ, సోష‌ల్ మీడియాలో ఓ వార్త హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

విజ‌య్‌తో ర‌ష్మిక‌
గీత గోవిందంలో విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Devarakonda) క్లాస్ హీరోగా మెప్పించాడు. ఈ చిత్రంలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు జోడిగా ర‌ష్మిక మంద‌న న‌టించారు. గీత‌ గోవిందం సినిమాతో వీరిద్ద‌రు హిట్ పెయిర్‌గా పాపుల‌ర్ అయ్యారు. డియ‌ర్ కామ్రేడ్ సినిమాలోనూ విజయ్‌, ర‌ష్మిక‌లు మ‌రో సారి జంట‌గా క‌నిపించి అల‌రించారు. 

విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం లైగ‌ర్ ప్ర‌మోష‌న్ల‌తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ప్ర‌మోష‌న్ల కోసం రౌడీ హీరో బోల్డ్ ఫోటోని పోస్ట్ చేసి అంద‌రినీ ఆశ్చ‌ర్య ప‌రిచాడు. లైగ‌ర్ సినిమాకు పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. విజ‌య్, పూరి కాంబోలో మ‌రో సినిమా తెర‌కెక్కుతోంది. ఆ సినిమాకు 'జ‌న‌గ‌ణ‌మ‌న' అనే టైటిల్‌ను ఖారారు చేశారు. 'జ‌న‌గ‌ణ‌మ‌న‌'లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు జోడిగా పూజ హెగ్డే న‌టించ‌నున్నారు.


 

ర‌ష్మిక మంద‌న  (Rashmika Mandanna) కూడా సమంత‌లా స్పెష‌ల్ సాంగ్‌లో అద‌ర‌గొట్ట‌నున్నార‌ట‌. 

స్పెష‌ల్ సాంగ్‌లో ర‌ష్మిక‌ (Rashmika Mandanna)
'జ‌న‌గ‌ణ‌మ‌న‌'లో ర‌ష్మిక మంద‌న ఓ ఐటం సాంగ్ చేయ‌నున్నార‌ట‌. విజ‌య్‌తో క‌లిసి అదిరిపోయే స్టెప్పులు వేయ‌నున్నార‌ని టాక్. పుష్ప సినిమాలో స‌మంత 'ఉ.. అంటావా మామా' పాట‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ర‌ష్మిక మంద‌న కూడా సమంత‌లా స్పెష‌ల్ సాంగ్‌లో అద‌ర‌గొట్ట‌నున్నార‌ట‌. 

యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన్‌గా వ‌స్తున్న జ‌న‌గ‌ణ‌మ‌న‌ సినిమాను  పూరి క‌నెక్ట్స్, శ్రీక‌ర స్టూడీయోస్ బ్యాన‌ర్ల‌పై నిర్మిస్తున్నారు. నిర్మాత‌లుగా చార్మీకౌర్, వంశీ పైడిప‌ల్లి, పూరి జ‌గ‌న్నాథ్‌లు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తెలుగు, హిందీ, త‌మిళ్, క‌న్న‌డ‌, మ‌లయాళంలో ఈ సినిమా 2023 ఆగ‌స్టు 3 న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.

Read More: Samantha Ruth Prabhu: పెళ్లి త‌ర్వాత జీవితం వైలెంట్‌గా ఉంటుంది -  నాగ‌చైత‌న్య‌పై స‌మంత సెటైర్లు

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!