కరణ్‌ జోహార్ బర్త్‌ డే పార్టీలో బ్లాక్ డ్రెస్‌లో మెరిసిన శ్రీవల్లి రష్మికా మందాన (Rashmika Mandanna), విజయ్‌ దేవరకొండ

Updated on May 26, 2022 08:00 PM IST
రష్మికా మందాన, కరణ్‌ జోహార్, విజయ్ దేవరకొండ
రష్మికా మందాన, కరణ్‌ జోహార్, విజయ్ దేవరకొండ

బాలీవుడ్‌ నిర్మాత కరణ్‌ జోహార్‌ మే 25న 50వ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన సెలబ్రిటీలకు గ్రాండ్‌ పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీకి బాలీవుడ్‌కు చెందిన స్టార్‌ హీరోహీరోయిన్లు షారుక్‌ ఖాన్‌ కుటుంబంతో హాజరయ్యారు. కొత్త జంటలు కత్రీనా కైఫ్‌–విక్కీ కౌశల్‌, రణ్‌బీర్‌– అఆలియా భట్‌ కూడా పార్టీలో సందడి చేశారు. 

కృతిక్‌ రోషన్‌, ఆమిర్‌ ఖాన్‌, గౌరీ ఖాన్‌ తదితరులు పార్టీకి హాజరు కాగా.. సౌత్‌ నుంచి డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌, చార్మీ కౌర్‌, విజయ్‌ దేవరకొండ, రష్మికా మందాన (Rashmika Mandanna), రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, తమన్నా వెళ్లారు. ఇక, ఈ పార్టీలో రష్మిక బ్లాక్‌ డ్రెస్‌లో మెరిసిపోయింది. బ్లాక్‌ డ్రెస్‌లో రెడ్‌ కార్పెట్‌పై రష్మిక నడుస్తున్న ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఫోటోల్లో రష్మిక స్టన్నింగ్‌ లుక్‌కు ఆమె ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. అలాగే ఈ పార్టీకి విజయ్‌ దేవరకొండ కూడా బ్లాక్‌డ్రెస్‌లోనే వెళ్లాడు.

కన్నడ సినిమా కిరిక్‌ పార్టీతో సినిమాల్లోకి వచ్చిన రష్మిక ‘ఛలో’ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత గీతా గోవిందం, భీష్మ, డియర్‌ కామ్రేడ్‌, పుష్ప సినిమాలతో సక్సెస్‌ అందుకుంది. తక్కువ కాలంలోనే టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగిన రష్మిక హిందీలో కూడా నటిస్తోంది. ఇప్పటికే హిందీలో రెండు సినిమాలు చేసిన రష్మిక రణ్‌బీర్‌ కపూర్‌ సరసన ‘యానిమల్‌’లో నటిస్తోంది. తెలుగులో అల్లు అర్జున్‌ ‘పుష్ప 2’ మూవీతో పాటు తమిళ హీరో విజయ్‌తో రష్మిక (Rashmika Mandanna) ఓ సినిమా చేస్తోంది.

బ్లాక్‌ డ్రెస్‌లో రష్మికా మందాన

బ్లాక్‌ డ్రెస్‌లో రష్మికా మందాన

బ్లాక్‌ డ్రెస్‌లో రష్మికా మందాన

బ్లాక్‌ డ్రెస్‌లో విజయ్‌ దేవరకొండ

బ్లాక్‌ డ్రెస్‌లో విజయ్‌ దేవరకొండ

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!