Nayanthara : నయన్, విఘ్నేష్‌ల పెళ్లిసందడి షురూ ! మన 'దక్షిణాది బ్యూటీ' మిసెస్‌గా ఎప్పుడు కనిపిస్తారంటే ?
దక్షిణాది టాప్ హీరోయిన్ నయనతార (Nayanthara), దర్శకుడు విఘ్నేష్‌ల పెళ్లి సందడి మొదలైంది. తమిళనాడులోని మహాబలిపురంలో జూన్ 9 న నయన్, విఘ్నేష్‌ల వివాహం జరగనుంది. వీరి వివాహ వేడుక కుటుంబసభ్యులతో పాటు, కొంతమంది స్నేహితుల మధ్య జరగనుంది. ఈ రోజే విఘ్నేష్ శివన్ తన పెళ్లి వేడుకపై ప్రత్యేకంగా ప్రెస్ మీట్‌ను నిర్వహించారు. నయనతారతో తన వివాహానికి సంబంధించిన వివరాలను మీడియాకు తెలిపారు.
మొదట గుడిలో పెళ్లి చేసుకోవాలనుకున్న నయన్, విఘ్నేష్‌లు
నయనతార (Nayanthara), విఘ్నేష్‌ల పెళ్లి వివరాలను మీడియా ఎప్పటికప్పుడు అభిమానులకు తెలియజేస్తోంది. ఈ సందర్బంగా, తమకు మద్ధతుగా నిలిచిన మీడియాకు శివన్ ధన్యవాదాలు తెలిపారు. చెన్నైలోని తాజ్ క్లబ్‌లో డైరెక్టర్ విఘ్నేష్ శివన్ మీడియా సమావేశం నిర్వహించారు. నయన్‌ను తాను ఓ గుడిలో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పారు.
"ఆ ప్రాంతానికి కుటుంబసభ్యులతో వెళ్లాలంటే కష్టం. అతిథులకు సౌకర్యవంతంగా ఉండదనుకున్నాం. అందుకే పెళ్లి వేడుకను మహాబలిపురంలో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాం" అని విఘ్నేష్ తెలిపారు.
పెళ్లి వేడుక చిత్రాలను మీడియాకి ఎప్పుడు విడుదల చేస్తారనే, ప్రశ్నకు కూడా శివన్ సమాధానమిచ్చారు. జూన్ 9 తేదిన మధ్యాహ్నం తమ పెళ్లి ఫోటోలను ప్రెస్‌కు రిలీజ్ చేస్తామని తెలిపారు. అలాగే జూన్ 11 తేదిన వివాహా రిసెప్షన్ సైతం ఉంటుందన్నారు. ఆ రోజున తాము జంటగా అందరికీ పార్టీ ఇస్తామని తెలిపారు. ఇలా కాసేపు తాజ్ క్లబ్‌లో విఘ్నేష్ (Vignesh Shivan) మీడియా వారితో ముచ్చటించారు.
ఓటీటీలో పెళ్లి డాక్యుమెంటరీ
నయన్ (Nayanthara), విఘ్నేశ్‌ల పెళ్లి వేడుకను దర్శకుడు గౌతమ్ మీనన్ డైరెక్షన్‌లో చిత్రీకరించనున్నారు. ఓ డాక్యుమెంటరీగా వీరి పెళ్లిని అభిమానులకు అందించనున్నారు. వివాహా వేడుకకు సంబంధించి, ఇప్పటికే ఓ ప్రివ్యూ షూటింగ్ కూడా జరిపారు. ఈ పెళ్లి డాక్యుమెంటరీని ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం చేయనున్నారు.
నయన్, విఘ్నేష్‌ల వివాహా రిసెప్షన్‌కు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ హాజరుకానున్నారు. సీఎం స్టాలిన్‌ను కలిసి ఈ జంట తమ వివాహ ఆహ్వాన పత్రికను అందించారు. రజనీకాంత్, కమలహాసన్, చిరంజీవి, సూర్య, అజిత్, కార్తీ, విజయ్ సేతుపతి, సమంత.. ఇలా పలువురు సౌత్ సినీ సెలబ్రిటీలు నయనతార రిసెప్షన్ వేడుకకు హాజరుకానున్నారు.
Read More:తమిళనాడు సీఎంను పెళ్లికి ఆహ్వానించిన నయనతార, విఘ్నేష్