ఎన్టీఆర్‌‌ (NTR) కోసం ఉప్పెన డైరెక్టర్‌‌ బుచ్చిబాబుకు వెయిటింగ్ తప్పదా?.. రెండు సినిమాలను ప్రకటించిన తారక్

Updated on May 24, 2022 10:22 AM IST
ప్రశాంత్‌ నీల్‌ డైరెక్షన్‌లో రానున్న ఎన్టీఆర్‌‌ సినిమా ఫస్ట్‌ లుక్
ప్రశాంత్‌ నీల్‌ డైరెక్షన్‌లో రానున్న ఎన్టీఆర్‌‌ సినిమా ఫస్ట్‌ లుక్

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా తర్వాత ఎన్టీఆర్‌ (NTR) చేయబోయే తదుపరి సినిమాలపై ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది. తారక్‌ పుట్టినరోజు సందర్భంగా కొరటాల శివ, ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో వరుసగా సినిమాలు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటనలు కూడా వచ్చేశాయి. అయితే, బుచ్చిబాబు దర్శకత్వంలోనూ తారక్‌ ఒక సినిమా చేయబోతున్నాడని గతంలో టాక్‌ వినిపించింది. పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన కూడా వస్తుందని ఉంటుందని అందరూ అనుకున్నారు. అయితే బుచ్చిబాబు డైరెక్షన్‌లో వచ్చే సినిమాకు సంబంధించిన ప్రకటన ఏదీ ప్రస్తుతానికి విడుదల కాలేదు.

మొదటి సినిమా ‘ఉప్పెన’తోనే ఘన విజయాన్ని తన అకౌంట్‌లో వేసుకున్నాడు డైరెక్టర్ బుచ్చిబాబు. ఇటీవల ఎన్టీఆర్‌‌కు ఒక కథ వినిపించారని, స్పోర్ట్స్‌ డ్రామాగా ఆ సినిమా తెరకెక్కనుందని ఇండస్ట్రీలో వర్గాల్లో టాక్‌ కూడా నడిచింది. అయితే తాజాగా వచ్చిన  ప్రకటనలు చూస్తే బుచ్చిబాబు డైరెక్షన్‌లో తారక్‌ నటించబోయే సినిమా ఇప్పట్లో లేనట్టేనని తెలుస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కే ఎన్టీఆర్‌ 30వ సినిమా జులై నుంచి సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ ఏడాది చివరి నాటికి షూటింగ్‌ పూర్తయ్యే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. కొరటాల శివ సినిమా పూర్తయిన తర్వాత ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించే సినిమాలో ఎన్టీఆర్‌ నటించనున్నాడు.

ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా ద‌ర్శకుడు ప్రశాంత్ నీల్ అభిమానుల‌కు బిగ్ స‌ర్‌‌ప్రైజ్ ఇచ్చాడు. ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో రానున్న ఎన్టీఆర్ 31 సినిమా ఫ‌స్ట్ లుక్‌ను ప్రశాంత్ నీల్ రివీల్ చేశాడు. పక్కా మాస్ లుక్‌తో సీరియ‌స్ యాక్షన్‌ సీన్‌లో ఎన్టీఆర్ క‌నిపించాడు.  యాక్షన్ సినిమాల ప‌వ‌ర్ ఏంటో కేజీఎఫ్‌తో నిరూపించాడు ప్రశాంత్. ప్రస్తుతం ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న స‌లార్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న ప్రశాంత్‌ ఎన్టీఆర్‌‌కు బ‌ర్త్ డే గిప్ట్ ఇచ్చాడు. ఎన్టీఆర్ 31 సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్టర్ అదిరిపోయింటున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. 

ఎన్టీఆర్ (NTR) ఉగ్రరూపంలో ఉన్న లుక్, డైలాగ్స్ సినిమాపై అంచనాలను వేరే లెవెల్‌కు తీసుకెళ్లేలా ఉన్నాయి. ర‌క్తంతో త‌డిచిన నేల‌ను గుర్తుపెట్టుకోండి.. అంతేగానీ అత‌ని నేల‌ను, అత‌ని పాల‌న‌.. అత‌ని నెత్తురును కాదంటూ ప్రశాంత్ నీల్ ప‌వ‌ర్‌పుల్ డైలాగులు పేల్చారు. ఎన్టీఆర్‌తో చెప్పించ‌బోయే డైలాగుల‌ను కూడా రివీల్ చేశారు. ఎన్టీఆర్ 31 సినిమాను మైత్రీ మూవీ మేక‌ర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్‌ క‌లిసి నిర్మిస్తున్నాయి. ఏప్రిల్ 2023లో ఈ సినిమా షూటింగ్ మొద‌లుకానుంది.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!