ఉపాసన కొణిదెల (Upasana Konidela) : కోవిడ్ నుంచి కోలుకున్న రామ్ చ‌ర‌ణ్ వైఫ్

Updated on May 11, 2022 10:56 PM IST
Upasana Konidela: మెగా ఇంటి కోడ‌లు  ఉపాస‌న‌కు కోవిడ్ ఎటాక్ అయింది.  ప్ర‌స్తుతం ఉపాస‌న కోవిడ్ నుంచి కోలుకున్నారు
Upasana Konidela: మెగా ఇంటి కోడ‌లు ఉపాస‌న‌కు కోవిడ్ ఎటాక్ అయింది. ప్ర‌స్తుతం ఉపాస‌న కోవిడ్ నుంచి కోలుకున్నారు

మెగా ఇంటి కోడ‌లు ఉపాస‌న కోవిడ్ నుంచి కోలుకున్నారు. సామాజిక కార్య‌క్ర‌మాల‌తో నిత్యం బిజీగా ఉండే ఉపాస‌న‌కు కోవిడ్ ఎటాక్ అయింది. ప్ర‌స్తుతం తాను కోలుకున్నాన‌ని ఆమె ఓ ప్రకటనలో తెలిపారు.  హీరో రామ్ చ‌ర‌ణ్ వైఫ్ ఉపాస‌న కొణిద‌ల‌ (Upasana Konidela) ఈ మధ్యకాలంలో కోవిడ్ బారిన పడ్డారు. ఇదే విషయాన్ని ఆమె సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే, ప్ర‌స్తుతం త‌ను కోవిడ్ నుంచి కోలుకున్నాన‌ని.. మ‌ళ్లీ త‌న వ‌ర్క్ ప్రారంభిస్తానని ఓ పోస్టులో తెలిపారు. కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోకపోవడంతో త‌న‌కు ఇలా జ‌రిగింద‌న్నారు. ఇదే క్రమంలో త‌న‌కు ట్రీట్మెంట్ అందించిన డాక్ట‌ర్ల‌కు థాంక్స్ చెప్పారు ఉపాస‌న.

Upasana Konidela

కోవిడ్ పాజిటివ్ అని రిపోర్ట్ రావ‌డంతో తాను పూర్తిగా విశ్రాంతికే పరిమితం అయ్యానని ఉపాస‌న తెలిపారు. త‌న శరీర తత్వాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించానని అన్నారు. పారాసిట్‌మాల్, విట‌మిన్ టాబ్లెట్లు వేసుకుంటూ, కరోనా నుండి నెమ్మదిగా ఉపశమనం పొందానని ఉసాన‌స ట్వీట్ చేశారు. 

Upasana Konidela

అపోలో హాస్పిటల్స్ పనుల్లో ఎంత బిజీగా ఉన్నా కూడా, ఉపాసన మెగా ఈవెంట్లలో మెరుస్తుంటారు. అలాగే సామాజిక కార్యక్రమాల్లో కూడా ముందుంటారు. మరోవైపు, మూగజీవాల పరిరక్షణకూ పాటు పడుతుంటారు.

సోషల్ సర్విస్ కార్యక్రమాల్లో ఉసాసన కొణిద‌ల (Upasana Konidela) ఎల్లప్పుడూ ముందుంటారు. ప్ర‌జ‌ల‌కు ఆరోగ్య సంర‌క్ష‌ణ‌పై అవ‌గాహ‌న క‌ల్పించడమే తన ఎజెండాగా ఆమె పలుమార్లు పేర్కొన్నారు. ఇక కరోనా టైంలో ఆమె ఎంతో మందికి సాయం అందించారు. ప్రస్తుతం ఉపాసన దాదాపు 150 ఓల్డేజ్ హోమ్‌లకు సాయం చేస్తున్నారు. బిలియన్ హార్ట్స్ బీటింగ్ అనే ఫౌండేషన్‌తో కలిసి ఆమె ఎంతోమందికి చేయూతనిచ్చారు. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!