కమల్‌హాసన్ (Kamal Haasan) ‘విక్రమ్‌’ మరో రికార్డు.. కలెక్షన్లలో సగం తమిళనాడు నుంచే!

Updated on Jun 21, 2022 05:33 PM IST
విక్రమ్ సినిమాలో కమల్‌ హాసన్, సూర్య
విక్రమ్ సినిమాలో కమల్‌ హాసన్, సూర్య

యూనివ‌ర్సల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్ (Kamal Haasan) హీరోగా నటించిన సినిమా 'విక్రమ్'. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్‌ క‌న‌గ‌రాజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం జూన్ 3న ప్రపంచ‌వ్యాప్తంగా తెలుగు, త‌మిళంతోపాటు వివిధ భాష‌ల్లో విడుద‌లైంది. విడుదలైన అన్ని సెంటర్లలో కూడా రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా మరో రికార్డును నెలకొల్పింది 'విక్రమ్' సినిమా.  అలాగే  ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మ‌రో వార్త నెట్టింట్లో వైరల్ అవుతోంది.

'విక్రమ్' సినిమా రిలీజైనప్పటి నుంచి ఇప్పటివరకు, ఒక్క చెన్నై సిటీలోనే రూ.15 కోట్లు వసూలు చేసిందట. చెన్నైలో ఇప్పటివ‌ర‌కు అత్యధిక గ్రాస్ సాధించిన సినిమాగా 'విక్రమ్' నిలిచింద‌ని కోలీవుడ్ వర్గాల టాక్‌. తెలుగులో కూడా విక్రమ్ డిస్ట్రిబ్యూట‌ర్లకు మంచి లాభాలనే తెచ్చిపెడుతోంది. తెలుగులో ఈ సినిమాను నితిన్ సొంత నిర్మాణ సంస్థ శ్రేష్ఠ్‌ మూవీస్‌ రిలీజ్‌ చేసింది.

కమల్‌ హాసన్  (Kamal Haasan) విక్రమ్‌ సినిమా పోస్టర్

బాహుబలి కలెక్షన్లు దాటి..

కాగా, తాజాగా 'బాహుబ‌లి 2' తమిళ వెర్షన్‌ రికార్డును బ్రేక్ చేసింది 'విక్రమ్' సినిమా. ఇక, ఈ సినిమా జూలై 8వ తేదీన ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంద‌ని తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకట‌న రావాల్సి ఉంది. యాక్షన్ థ్రిల్లర్‌‌గా తెరకెక్కిన 'విక్రమ్‌' సినిమాను రాజ్‌కమల్‌ ఫిలింస్ ఇంటర్నేషనల్, మహేందరన్‌ సంయుక్తంగా నిర్మించారు.

చాలా సంవత్సరాల తర్వాత కమల్‌హాసన్‌ (Kamal Haasan)  'విక్రమ్' సినిమాతో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ సాధించారు. గ్యాంగ్‌స్టర్‌ వార్‌‌ నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమాలో కమల్‌తోపాటు విజయ్‌ సేతుపతి, ఫహద్‌ ఫాజిల్‌ కీలక పాత్రలు పోషించారు. ఇక, అతిథి పాత్రలో కనిపించిన స్టార్ హీరో సూర్య ‘రోలెక్స్‌’గా అదరగొట్టేశారు. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. విడుదలైన 16 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లు రాబట్టింది.

ఈ మొత్తం కలెక్షన్స్‌లో సగం అనగా రూ.150 కోట్లు కేవలం తమిళనాడు నుంచే వచ్చాయని ఇండస్ట్రీ టాక్. దీంతో ఇప్పటివరకూ ఆ రాష్ట్రంలో ఉన్న ‘బాహుబలి-2’ కలెక్షన్స్‌ రికార్డుని ‘విక్రమ్‌’ బద్దలు కొట్టింది. రానున్న రోజుల్లో ఈ సినిమా మరిన్ని రికార్డులు సృష్టించే అవకాశం ఉంది.

Read More : అప్పుడు నా మాట ఎవరూ నమ్మలేదంటున్న కమల్‌హాసన్ (Kamal Haasan).. రూ. 300 కోట్ల సంపాదనపై కామెంట్స్ !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!