కమల్‌హాసన్ (Kamal Haasan) 'విక్రమ్‌' సినిమా మేకింగ్ వీడియోకి కూడా తగ్గని క్రేజ్.. వీడియో వైరల్

Updated on Jul 10, 2022 04:15 PM IST
కమల్‌హాసన్ (Kamal Haasan) 'విక్రమ్‌' సినిమా పోస్టర్
కమల్‌హాసన్ (Kamal Haasan) 'విక్రమ్‌' సినిమా పోస్టర్

లోకనాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో వచ్చిన ఫస్ట్‌ సినిమా ‘విక్రమ్’. యాక్షన్ అండ్ స్పై థ్రిల్లర్గా తెరకెక్కిన ‘విక్రమ్’ సినిమాలో మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్, విలన్‌గా విజయ్ సేతుపతి నటించారు. సినిమా చివరిలో రోలెక్స్‌ క్యారెక్టర్‌‌లో గా సూర్య గెస్ట్‌గా వచ్చి అలరించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది.

విక్రమ్‌ సినిమా విడుదలైన అన్ని భాషల్లోనూ బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ.400 కోట్లకు పైనే వసూలు చేసింది. ఇక, ఇటీవల ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌‌లో విడుదలైన ‘విక్రమ్’ సినిమా అక్కడ కూడా రికార్డులు సృష్టిస్తోంది. ఈ సందర్భంగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సినిమా మేకింగ్ వీడియో విడుదల చేసింది. ప్రస్తుతం ఆ మేకింగ్ వీడియో కూడా వైరల్ అవుతోంది. 

6 నిమిషాల వీడియో..

ఆరు నిమిషాలు ఉన్న విక్రమ్‌ మేకింగ్ వీడియో.. ఫహద్ ఫాజిల్ షాట్‌తో స్టార్ట్ అయ్యింది. యాక్షన్ సీక్వెన్స్‌లను మేకర్స్‌ తెరకెక్కించిన విధానం ఆకట్టుకుంటోంది. ఇంట్రవెల్‌లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్, పెళ్లి సీన్లతోపాటు కమల్, విజయ్ సేతుపతి ఫైట్ సీన్ మేకింగ్ వీడియోలో ఉన్నాయి. ఈ సన్నివేశాల్ని తెరపై ఎలా వర్కవుట్ చేశారనేది మేకింగ్ వీడియోలో స్పష్టంగా తెలుస్తోంది. చాలాకాలం తర్వాత కమల్‌ హాసన్‌ (Kamal Haasan) రేంజ్‌కు తగినట్టుగా విక్రమ్ సినిమా హిట్ అయ్యింది.

 Read More : కమల్‌హాసన్ (Kamal Haasan) ‘విక్రమ్‌’ మరో రికార్డు.. కలెక్షన్లలో సగం తమిళనాడు నుంచే!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!