మాస్టారు... నా మనసును గెలిచారు.. ధనుష్​ (Dhanush) ‘సార్’ (Sir Movie) మూవీ నుంచి రిలీజైన ఫస్ట్ సింగిల్

Updated on Nov 11, 2022 10:25 AM IST
విద్యా వ్యవస్థలోని లోపాలకు సంబంధించిన నేపథ్యంలో ‘సార్’ (Sir Movie) సినిమా కథ నడుస్తుందని తెలుస్తోంది
విద్యా వ్యవస్థలోని లోపాలకు సంబంధించిన నేపథ్యంలో ‘సార్’ (Sir Movie) సినిమా కథ నడుస్తుందని తెలుస్తోంది

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush)కు తమిళంతోపాటు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. ‘రఘువరన్ బీటెక్’ సినిమా ఆయనకు టాలీవుడ్‌లో మంచి పాపులారిటీ తీసుకొచ్చింది. ఆ తర్వాత వచ్చిన చిత్రాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే వసూళ్లు, ఆదరణ పరంగా ‘రఘువరన్ బీటెక్’ స్థాయిలో మాత్రం సత్తా చాటలేకపోయాయి. అయితే ధనుష్ మాత్రం ఎప్పటికప్పుడు వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ ఆడియెన్స్ మదిలో తన స్థానాన్ని పదిలపర్చుకున్నారు.  

సినిమా సినిమాకు విలక్షణతను ప్రదర్శిస్తూ, విభిన్న పాత్రల్లో నటిస్తూ ఆడియెన్స్‌ను ఆశ్చర్యపరుస్తుంటాడు ధనుష్. అందుకే వైవిధ్యం కోరుకునే ప్రేక్షకులు ఆయన సినిమాలు చూడటానికి ఆసక్తి చూపిస్తుంటారు. తెలుగులో నటించాలని ధనుష్ ఎన్నాళ్లుగానో అనుకుంటున్నారు. ఆ సమయం వచ్చేసింది. ఇప్పుడు ఆయన ఏకంగా రెండు టాలీవుడ్ ప్రాజెక్టుల్లో యాక్ట్ చేస్తున్నారు. అందులో ఒకటి యువ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సార్’ (Sir Movie) చిత్రం. 

సెన్సిబుల్ సినిమాలు తీస్తాడనే పేరున్న సీనియర్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల మూవీకి ముందుగా ధనుష్​ ఓకే చెప్పారు. అయితే ఆ మూవీ పట్టాలెక్కేందుకు ఎక్కువ సమయం పట్టేలా ఉండటంతో వెంకీ అట్లూరి చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. చాలా వేగంగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 2వ తేదీన రిలీజుకు రెడీ అవుతోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగవంశీ–త్రివిక్రమ్ కలసి ఈ ఫిల్మ్‌ను నిర్మిస్తున్నారు. విద్యా వ్యవస్థలోని లోపాలకు సంబంధించిన నేపథ్యంలో ఈ మూవీ కథ నడుస్తుంది. 

తమిళ సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ బాణీలు సమకూర్చిన ‘సార్’ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ మూవీ నుంచి ‘మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు’ అంటూ సాగే ఫస్టు సింగిల్‌ను సినిమా యూనిట్ యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించిన ఈ పాటను శ్వేతా మోహన్ ఆలపించారు. మాస్టారు ధనుష్‌ను ఉద్దేశించి సంయుక్త పాడే ఈ సాంగ్‌కు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఈ పాట తమిళ వెర్షన్‌కు ధనుష్ సాహిత్యం సమకూర్చడం విశేషం.  

Read more: త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్న యంగ్ హీరో నాగశౌర్య (Naga Shaurya).. అమ్మాయి ఎవరంటే?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!