Alluri Movie Teaser: పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో యంగ్ హీరో శ్రీ విష్ణు (Sree Vishnu).. టీజర్ అదిరిపోయింది!

Updated on Jul 04, 2022 02:58 PM IST
'అల్లూరి' (Alluri Movie) సినిమాతో ప్రదీప్ వర్మ (Pradeep Varma) దర్శకుడిగా టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నాడు
'అల్లూరి' (Alluri Movie) సినిమాతో ప్రదీప్ వర్మ (Pradeep Varma) దర్శకుడిగా టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నాడు

టాలీవుడ్ విలక్షణ నటుల్లో యంగ్ హీరో శ్రీ విష్ణు ఒకరు (Sree Vishnu). విభిన్నమైన పాత్రలతో, వైవిధ్యమైన సినిమాలు చేస్తున్న యువ నటుడిగా ఈయన సుపరిచితుడు. ఇటీవలే శ్రీవిష్ణు  మరో ఆసక్తికర చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఆయ‌న న‌టిస్తున్న తాజా చిత్రం 'అల్లూరి'. "నిజాయితీకి మారుపేరు" అనే ట్యాగ్ లై‌న్‌ని ఈ సినిమాకి ఆడ్ చేశారు మేకర్స్.

ప్రస్తుతం పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులను లైన్‌లో పెట్టిన శ్రీ విష్ణు, ఈ చిత్రం ద్వారా ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా తన అభిమానులకు కనువిందు చేయనున్నారు.. కాగా, ఇటీవలే ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ రిలీజ్ అయింది. 

'అల్లూరి' (Alluri Movie) సినిమాతో ప్రదీప్ వర్మ (Pradeep Varma) దర్శకుడిగా టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నాడు.  శ్రీ విష్ణు లుక్ చూస్తే, ఈ సినిమా కోసం తాను బాడీ కూడా చాలా సాలిడ్‌గా మార్చినట్టు అనిపిస్తోంది. ఇంకా తన మీసకట్టు, సినిమా క్యాప్షన్ అంతా చూస్తే.. ఈ సినిమాలో తన పాత్ర ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో అర్ధం అవుతుంది.

మొత్తానికి అయితే ఈ పోస్టర్ మాత్రం సినీ అభిమానుల  అంచనాలు పెంచింది. ఇక ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తుండగా, లక్కీ మీడియా వారు నిర్మాణ సారధ్యం వహిస్తున్నారు.

సోమవారం అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా ఈ సినిమా టీజ‌ర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.  81 సెకన్ల ఈ టీజర్ (Alluri Movie Teaser) లో పోలీస్ డ్రెస్‌లో శ్రీవిష్ణు ఆకట్టుకున్నాడు. ‘ఎక్క‌డి దొంగ‌ల‌క్క‌డే గ‌ప్‌చుప్.. పోలీస్ బ‌య‌ల్దేరాడురా’ అంటూ టీజ‌ర్ ప్రారంభం అయింది. 'విప్లవానికి నాంది చైతన్యం.. చైతన్యానికి పునాది నిజాయతీ..నిజాయతీకి మారుపేరు' అల్లూరి అనే డైలాగ్స్ బాగున్నాయి. 

టీజ‌ర్ మొత్తం యాక్ష‌న్ సీన్స్‌తో నిండి ఉంది. విష్ణు మొద‌టి సారిగా పోలీస్ పాత్ర‌లో దుమ్మురేపాడు. ఆ పాత్రలో డిఫ‌రెంట్‌ వేరియేష‌న్‌ను చూపించాడు. ఇక డైలాగ్ డెలివ‌రీ, పోలీస్‌గా విష్ణు హూందాత‌నం ఆక‌ట్టుకొనే విధంగా ఉంది. చివ‌ర్లో ‘అల్లూరి సీతారామ‌రాజు స‌బ్‌ఇన్స్‌పెక్ట‌ర్ ఆఫ్ పోలీస్’ అంటూ శ్రీవిష్ణు చెప్పే డైలాగ్ టీజ‌ర్‌కే హైలైట్‌గా నిలిచింది. 

ఇక, 'అల్లూరి' చిత్రాన్ని ల‌క్కీ మీడియా బ్యాన‌ర్‌పై బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తున్నాడు. కాగా కయ్యదు లోహర్ (Kayadu Lohar) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో తనికెళ్ల భరణి, సుమన్, రాజా రవీంద్ర, పృథ్వీ రాజ్, రవివర్మ, మధుసూధన్ రావు, జయవాణి తదితరులు నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ఈ సినిమాకు హ‌ర్షవ‌ర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తుండగా.. శివేంద్ర సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను కూడా ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

కాగా, టీజర్ లాంచ్‌లో భాగంగా 'విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు' పేరుతో ఈ సినిమా చేయడం సంతోషంగా ఉందని చిత్ర యూనిట్ తెలిపింది. టీజర్ రిలీజ్ కార్యక్రమంలో హీరో శ్రీ విష్ణు (Sree Vishnu) మాట్లాడుతూ.. 'అల్లూరి 125వ జయంతి రోజున తన చిత్రం టీజర్ రిలీజ్ చేయడం, ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు.

తాను అల్లూరిని చూడకపోయినా.. ఆయన పేరు పెట్టుకున్న ఈ సినిమాలో నిజాయితీగా నటించానని' చెప్పారు. కెరీర్‌లో తొలిసారిగా పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేయడం ఆనందంగా ఉందన్నారు. 

Read More: Sree Vishnu: : టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు తాజా సినిమా 'అల్లూరి'.. ఫస్ట్ లుక్ అదుర్స్!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!