ఓవర్సీస్‌లోనూ దూసుకుపోతున్న ‘ఒకే ఒక జీవితం’ (Oke Oka Jeevitham).. యూఎస్ లో భారీగా బాక్సాఫీస్ కలెక్షన్స్..!

Updated on Sep 13, 2022 02:39 PM IST
ఇండియాలోనే కాకుండా అటు ఓవర్సీస్‌లో కూడా ‘ఒకే ఒక జీవితం’ బాక్సాఫీస్ (Oke Oka Jeevitham Collections) వద్ద మంచి వసూళ్లను సాధిస్తోంది.
ఇండియాలోనే కాకుండా అటు ఓవర్సీస్‌లో కూడా ‘ఒకే ఒక జీవితం’ బాక్సాఫీస్ (Oke Oka Jeevitham Collections) వద్ద మంచి వసూళ్లను సాధిస్తోంది.

తెలుగు ఫ్యామిలీ ఆడియెన్స్ లలో మంచి క్రేజ్ ఉన్న యంగ్ హీరో శర్వానంద్ (Sharwanand).  ఆయన హీరోగా నూతన దర్శకుడు శ్రీ‌కార్తీక్ (Shree Karthick) ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన మూవీ ‘ఒకే ఒక జీవితం’ (Oke Oka Jeevitham). డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఎస్ ఆర్ ప్ర‌కాశ్ బాబు, ఎస్ ఆర్ ప్ర‌భు ఈ సినిమాను నిర్మించారు.

హీరో శర్వానంద్ కు జంటగా రీతూ వర్మ (Ritu Varma) నటించగా, సీనియర్ హీరోయిన్ అమల ఒక కీలక పాత్రలో నటించారు.  తెలుగు, తమిళ భాషలలో తెరకెక్కిన 'ఒకే ఒక జీవితం' మూవీ సెప్టెంబర్ 9వ తేదీన రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. త‌ల్లీకొడుకుల రిలేష‌న్‌, టైం ట్రావెల్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ మూవీలో అక్కినేని అమ‌ల శ‌ర్వానంద్ త‌ల్లిపాత్ర‌లో న‌టించారు. 

అయితే, వరుసగా ఫ్లాప్స్ ను మూటగట్టుకుంటున్నశర్వానంద్ (Sharwanand) కు ఈ చిత్రం మంచి ఫలితాన్ని అందించింది. తొలిరోజే పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. ఎలాంటి బజ్ క్రియేట్ చేయకుండానే చిత్రం సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. బాక్సాఫీస్ వద్ద కూడా ‘ఒకే ఒక జీవితం’ వసూళ్లను రాబడుతోంది.

'ఒకే ఒక జీవితం' మూవీ పోస్టర్ (Oke Oka Jeevitham Movie Poster)

ఇండియాలోనే కాకుండా అటు ఓవర్సీస్‌లో కూడా బాక్సాఫీస్ (Oke Oka Jeevitham Collections) వద్ద మంచి వసూళ్లను సాధిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ మూడురోజులకు  9.10 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టగా, యూఎస్ఏ లో భారీ కలెక్షన్స్ రాబడుతుంది. అక్కడ ఆదివారం ముగిసేనాటికి రూ.2,38,67,190 (3 ల‌క్ష‌ల డాల‌ర్లు) వ‌సూళ్లు చేసిన‌ట్టు ట్రేడ్ స‌ర్కిల్ టాక్‌. మౌత్ టాక్ బాగుండ‌టంతో రానున్న రోజుల్లో క‌లెక్ష‌న్లు మ‌రింత పెరిగే అవకాశ‌మున్న‌ట్టు అభిప్రాయ‌ప‌డుతున్నారు ట్రేడ్ పండితులు. 

తొలి రోజు తక్కువ స్క్రీన్లలోనే విడుదలై పాజిటివ్ టాక్ రావడంతో క్రమక్రమంగా స్క్రీన్ల సంఖ్య కూడా పెరుగుతోంది. మరెవైపు కలెక్షన్లు కూడా వస్తున్నాయి. (Boxoffice Collections) రాబోయే రోజుల్లో కూడా 'ఒకే ఒక జీవితం' చిత్రం పాజిటివ్ మౌత్ టాక్‌తో మరింత దూసుకుపోతుందని మేకర్స్ భావిస్తున్నారు.

సైన్స్‌ ఫిక్ష‌న్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ చిత్రానికి  తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) డైలాగ్స్ రాశారు. ఇక, ఈ సినిమాకు జేక్స్ బిజోయ్ సంగీత దర్శకుడుగా వ్యవహరించారు. తమిళంలో 'కణం' పేరుతో ఏకకాలంలో ఈ సినిమాను విడుదల చేశారు.

Read More: ఈ సినిమా చూశాక మా అమ్మ గుర్తుకొచ్చింది : 'ఒకే ఒక జీవితం' చిత్రం పై నాగార్జున కామెంట్ !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!