ఈ సినిమా చూశాక మా అమ్మ గుర్తుకొచ్చింది : 'ఒకే ఒక జీవితం' చిత్రం పై నాగార్జున కామెంట్ !

Updated on Sep 08, 2022 06:25 PM IST
'ఒకే ఒక జీవితం' సినిమాలో శర్వానంద్ (Sharwanand) కథానాయకుడిగా నటించగా, రీతూ వర్మ కథానాయికగా నటించారు.
'ఒకే ఒక జీవితం' సినిమాలో శర్వానంద్ (Sharwanand) కథానాయకుడిగా నటించగా, రీతూ వర్మ కథానాయికగా నటించారు.

శర్వానంద్ (Sharwanand), రీతూ వర్మ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా 'ఒకే ఒక జీవితం'. ఈ సినిమాలో అమల అక్కినేని కథానాయకుడి తల్లి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 9వ తేదిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలో సినీరంగానికి చెందిన పలువురు సెలబ్రిటీలకు ఈ రోజే ఈ సినిమా ప్రీమియర్ షో వేశారు.

భావోద్వేగానికి లోనైన నాగార్జున

ఈ ప్రీమియర్ షోను వీక్షించిన అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) తన అభిప్రాయాలను మీడియాతో పంచుకున్నారు. "ఈ సినిమాలో అనేక భావోద్వేగాలు ఉన్నాయి. చాలా మంచి సినిమా. బ్యూటీఫుల్ ఫిల్మ్ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో తల్లి సెంటిమెంట్ మన గుండెలను పిండేస్తుంది. మంచి ఎమోషనల్ కనెక్ట్ ఉన్న చిత్రమిది. అందరూ ఈ సినిమాని తప్పకుండా చూడాలి. నేను కూడా ఈ సినిమా చూశాక, ఓసారి మా అమ్మగారిని తలుచుకున్నాను" అని తెలిపారు. 

శ్రీ కార్తిక్ దర్శకత్వం వహించిన 'ఒకే ఒక జీవితం' (Oke Oka Jeevitham) సినిమాకి తరుణ్ భాస్కర్ సంభాషణలు అందించారు. అలాగే ఎస్ ఆర్ ప్రభు నిర్మాతగా వ్యవహరించారు. తెలుగు, తమిళ భాషలలో ఈ చిత్రం తెరకెక్కింది. సుజిత్ సారంగ్ కెమెరా వర్క్ అందించిన ఈ చిత్రానికి, జేక్స్ బిజాయ్ సంగీతాన్ని అందించారు. 

కరోనా వల్ల సినిమా వాయిదా

ఈ సినిమా షూటింగ్ నవంబర్ 2020 నెలలోనే ముగిసింది. అయితే కోవిడ్ కారణంగా, సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఈ సినిమాలోని అమ్మ సెంటిమెంట్ సాంగ్‌ను స్వర్గీయ సిరివెన్నెల సీతారామశాస్త్రి రాయడం విశేషం. ఈ పాటను సిద్ శ్రీరామ్ పాడారు. 

2012 సంవత్సరంలో విడుదలైన "మిస్టర్ నూకయ్య" చిత్రంలోని "ఒకే ఒక జీవితం" పాట ఎంత పెద్ద హిట్ అయిందో తెలియంది కాదు. ఆ పాటనే టైటిల్‌గా తీసుకొని, ఈ సినిమాని తెరకెక్కించారు. 

డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ "ఒకే ఒక జీవితం" (Oke Oka Jeevitham) సినిమాని నిర్మించింది. నాజర్, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, అలీ, మధునందన్, రవి రాఘవేంద్ర ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించారు. సెంటిమెంట్‌తో సాగే సైన్స్ ఫిక్షన్ డ్రామాగా ఈ సినిమాను మనం చెప్పుకోవచ్చు.

Read More: టాలీవుడ్ ప్రముఖ నటులు, దర్శకుల మధ్య శర్వానంద్ 'ఒకే ఒక జీవితం' (Oke Oka Jeevitham) స్పెషల్ స్క్రీనింగ్..!

 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!