టాలీవుడ్ ప్రముఖ నటులు, దర్శకుల మధ్య శర్వానంద్ 'ఒకే ఒక జీవితం' (Oke Oka Jeevitham) స్పెషల్ స్క్రీనింగ్..!
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ (Sharwanand) నటించిన తాజాగా నటించిన సినిమా 'ఒకే ఒక జీవితం' (Oke Oka Jeevitham). ఈ మూవీలో శర్వానంద్ సరసన రీతు వర్మ హీరోయిన్ గా నటించింది. ఇందులో అక్కినేని అమల ఓ కీలక పాత్రలో కనిపించనుండగా, ప్రియదర్శి, వెన్నెల కిషోర్, నాజర్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ నేపథ్యంలో 'ఒకే ఒక జీవితం' సినిమా రూపొందింది. ఇక, ఈ మూవీ ని యువ దర్శకుడు శ్రీకార్తిక్ తెరకెక్కించారు. సైన్స్ ఫిక్షన్ జానర్ లో సాగే కథగా తెరకెక్కిన ఈ మూవీ హార్ట్ టచింగ్ మదర్ సెంటిమెంట్ తో రూపొందింది.
ఇదిలా ఉంటే.. మంగళవారం రాత్రి హైదరాబాద్‌లోని ఏఎంబీ సినిమాస్‌లో ఏర్పాటు చేసిన సెలబ్రిటీ ప్రీమియర్ షోకి (Oke Oka Jeevitham Celebrity Premier Show) కింగ్ అక్కినేని నాగార్జున, అఖిల్, టాలీవుడ్ ప్రముఖ దర్శకులు దేవా కట్టా, హను రాఘవపూడి, చందూ మొండేటి, మేర్లపాక గాంధీ, వశిష్ఠ్, వెంకీ కుడుముల, వెంకీ అట్లూరి తదితరులు హాజరయ్యారు.
మరోవైపు.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas), మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), రానా దగ్గుబాటి (Rana) కోసం కూడా 'ఒకే ఒక జీవితం' సినిమా స్పెషల్ షో వేయాలని కూడా శర్వానంద్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
సెప్టెంబర్ 9 వ తేదీన విడుదల కాబోయే ఒకే ఒక జీవితం సినిమాతో అయినా శర్వానంద్ (Sharwanand) మంచి విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకొని తిరిగి ఫామ్ లోకి వస్తాడేమో చూడాలి. మరోవైపు ఈ సినిమా రీతూ వర్మకు (Ritu Varma) కూడా ఈ మధ్య కాలంలో చెప్పుకోదగ్గ విజయాలు లేవు. మరి ఈ సినిమాతో ఈ ముద్దు గుమ్మ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు 'ఒకే ఒక జీవితం' సినిమాను నిర్మించారు. ఇందులో తమిళ హీరో కార్తీ (Hero Karthi) ఒక పాటను పాడటం విశేషం. ఈ చిత్రానికి జేక్స్ బిజాయ్ సంగీతం అందించగా.. సిరివెన్నెల సీతారామశాస్త్రి, కృష్ణకాంత్, కృష్ణచైతన్య సాహిత్యం అందించారు. తెలుగులో తరుణ్ భాస్కర్ డైలాగులు రాశారు.
Read More: ఫెయిల్యూర్స్ నాకు నేర్పిన పాఠాలు అన్నీ ఇన్నీ కావు : శర్వానంద్ (Sharwanand)