హిట్ 2 (Hit 2) కొత్త పోస్టర్ విడుదల: అడివి శేష్ (Adivi Sesh) సినిమాపై భారీ అంచనాలు

Updated on May 02, 2022 11:52 AM IST
హిట్.. విశ్వక్ సేన్ నటించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ఎంత పెద్ద హిట్టో మనకు తెలియంది కాదు. ఇప్పుడు అదే సినిమాకి సీక్వెల్ వస్తోంది. అడివి శేష్ ఇందులో కథానాయకుడు.
హిట్.. విశ్వక్ సేన్ నటించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ఎంత పెద్ద హిట్టో మనకు తెలియంది కాదు. ఇప్పుడు అదే సినిమాకి సీక్వెల్ వస్తోంది. అడివి శేష్ ఇందులో కథానాయకుడు.

హిట్.. విశ్వక్ సేన్ నటించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ఎంత పెద్ద హిట్టో మనకు తెలియంది కాదు. ఇప్పుడు అదే సినిమాకి సీక్వెల్ వస్తోంది. అడివి శేష్ ఇందులో కథానాయకుడు. చాలా వైవిధ్యమైన సబ్జెక్టుతో ఈ సినిమాను ఆయన తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈయన ఈ చిత్రానికి సంబంధించిన కొత్త పోస్టరును విడుదల చేశారు. ఆ విశేషాలు మీకోసం

HIT 2 సీక్వెల్‌లో టైటిల్ రోల్ పోషిస్తున్న అడివి శేష్, ఈ చిత్రం జూలై 29న విడుదలవుతుందని అధికారికంగా ప్రకటించారు. దీనికి సంబంధించిన కొత్త పోస్టర్‌ను ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ పోస్టర్‌లో శేష్ చాలా వైవిధ్యమైన గెటప్‌లో, ఫ్యూరియస్ లుక్‌లో కనిపించడం గమనార్హం. 

"ఈ హిట్ అనే 'లోకం'లో ఏదో కొత్త ప్రమాదం ముంచుకురాబోతోంది . మీ వెన్నులో భయం పుట్టించే సరికొత్త సస్పెన్స్‌కి సిద్ధంగా ఉండండి"  అంటూ ఆయన ట్వీట్ చేశారు. 

HIT: The First Case చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అన్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా ప్రీక్వెల్‌‌కు ప్రశాంతి తిపిర్నేని నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అలాగే నటుడు నాని తన వాల్ పోస్టర్ బ్యానర్ పై ఈ సినిమాను సమర్పిస్తున్నారు.

 

క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (సిఐడి)లో పనిచేస్తున్న పోలీసు అధికారి విక్రమ్ జీవితం చుట్టూ ఈ  ప్రీక్వెల్ కథాంశం తిరుగుతుంది. శైలేష్ కొలను ఈ చిత్రాన్ని దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. HIT మొదటి భాగం అనేది తప్పిపోయిన అమ్మాయి కేసును దర్యాప్తు చేస్తున్న ఓ తెలంగాణ పోలీస్ అధికారిది. దీని సీక్వెల్‌ను ఆంధ్రప్రదేశ్‌ నేటివిటీతో డిజైన్ చేశారు దర్శకులు. 

'ది సెకండ్ కేస్' అనే ట్యాగ్‌లైన్‌తో రూపొందుతున్న ఈ కొత్త చిత్రంలో మేనాక్షి చౌదరి, రావు రమేష్, భాను చందర్, పోసాని కృష్ణ మురళి, తనికెళ్ల భరణి, శ్రీకాంత్ మాగంటి, కోమలి ప్రసాద్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జాన్ స్టీవర్ట్ ఎదూరి సంగీతాన్ని అందిస్తున్నారు. 

ఇక మరొక పక్క, అడివి శేష్ కూడా తన పాన్-ఇండియన్ ఫిల్మ్ "మేజర్" విడుదల కోసం ఎదురు చూస్తున్నాడు. ఇది నవంబర్ 2008లో ముంబై టెర్రర్ దాడులలో అమరులైన సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందించిన చిత్రం. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!