Aadi Saikumar: వరుస సినిమాలతో జోరుమీదున్న యంగ్ హీరో ఆది.. తర్వాతి సినిమా టైటిల్ ఇదే!

Updated on Jun 12, 2022 11:21 PM IST
హీరో ఆది సాయికుమార్ (Hero Aadi Saikumar)
హీరో ఆది సాయికుమార్ (Hero Aadi Saikumar)

Hero Aadi Saikumar: టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయి కుమార్ హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరస సినిమాలు చేయడంలో ఎప్పుడూ ముందే ఉంటాడు. యంగ్ హీరోలందరూ రెండు, మూడు సినిమాలను లైన్ లో పెడుతుంటే.. ఆది మాత్రం డజనువరకూ సినిమాలను లైన్ లో పెట్టాడు. ప్రస్తుతం అయితే ఆది లిస్ట్ లో అమరన్, కిరాతక, క్రేజీ ఫెల్లో, తీస్ మార్ ఖాన్, అతిథి దేవో భవ.. ఇలా పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. 

వీటిలో కొన్ని సినిమాలు ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకోగా మరికొన్ని షూటింగ్ ను జరుపుకుంటున్నాయి. ఇక ఈ సినిమాతో పాటు ఆది.. శశికాంత్ అనే డైరెక్టర్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాను ఇటీవలే ప్రారంభించగా.. ప్రస్తుతం ఇదే సినిమా శరవేగంగా షూటింగ్‌ను జరుపుకుంటోంది.  తాజాగా ఈ సినిమా టైటిల్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమాకు 'టాప్ గేర్' (Top Gear) అనే టైటిల్‌ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు.

కాగా, ఈ సినిమాలో రియా సుమన్ (Ria Suman) హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఇంకా బ్రహ్మాజీ, సత్యం రాజేష్, మైమ్ గోపి, నర్రా, శత్రు, బెనర్జీ, గిరిధర్, రేడియో మిర్చి, హేమంత్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కె.వి శ్రీధర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు గిరిధర్ మామిడిపల్లి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. హర్ష వర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు.

మరోవైపు తీస్ మార్ ఖాన్ (Teesmaar Khan) అనే సినిమా చేస్తున్నాడు ఆది. ఇటీవలే ఈ సినిమా అప్‌డేట్స్‌ను దర్శక నిర్మాతలు సోషల్ మీడియా ద్వారా  తెలియజేసారు. విజ‌న్ సినిమాస్ బ్యాన‌ర్‌పై నాగం తిరుప‌తి రెడ్డి ఈ చిత్రాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. గ్లామరస్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది.

హై యాక్షన్ వోల్టేజ్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి కళ్యాణ్ జి గోగణ దర్శకత్వం వహిస్తుండగా ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల అయ్యి మంచి ప్రేక్షకాదరణ అందుకుంది. అంచనాలకు తగ్గట్లుగా ఈ లుక్ ప్రేక్షకులను బాగా అలరించింది. 

హీరో ఆది సాయి కుమార్ (Aadi Saikumar) పవర్ ప్యాక్డ్ లుక్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలు పోషిస్తున్న సాయి కుమార్.. ఈ పోస్టర్ లో నెవర్ బిఫోర్ అనే రేంజ్ లో కనిపించి అందరినీ అలరించారు. పాయ‌ల్ రాజ్‌పుత్ పాత్ర ఇప్ప‌టి వ‌ర‌కు ఆమె చేసిన చిత్రాల‌కు భిన్నంగా, ఇది వ‌ర‌కు చూడ‌ని స‌రికొత్త క్యారెక్ట‌ర‌రైజేష‌న్‌తో అటు గ్లామ‌ర్ ప‌రంగా, ఇటు పెర్ఫామెన్స్ ప‌రంగా ఆక‌ట్టుకోనుంది.

ప్ర‌స్తుతం ఈ సినిమా చిత్రీక‌ర‌ణ గోవాలో జరుగుతుంది. హీరో, హీరోయిన్స్‌పై మంచి రొమాంటిక్ సాంగ్‌ను చిత్రీక‌రిస్తున్నారు. ఈ రోజుల్లో సినిమాల్లో రొమాన్స్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాటకు అవసరం అనిపిస్తే.. హీరోయిన్స్ కూడా బాగానే రొమాన్స్‌కు రెడీ అవుతున్నారు. 

Read More: Prathyusha Garimella : టాలీవుడ్ ఫ్యాషన్‌ డిజైనర్‌ ప్రత్యూష గరిమెళ్ళ ఆత్మహత్య .. షాక్‌లో ఇండస్ట్రీ!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!