2022లో విడుదలైన టాప్‌5 హర్రర్, థ్రిల్లర్ సినిమాలు.. ఐఎండీబీ రేటింగ్స్‌లోనూ టాప్‌!

Updated on Dec 15, 2022 08:59 PM IST
ప్రతి సంవత్సరం వలె 2022లో కూడా చాలా సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో హిట్‌, ఫ్లాప్ సినిమాలు ఉన్నా వాటిలో హర్రర్ జోనర్‌‌ సినిమాలు ప్రత్యేకం
ప్రతి సంవత్సరం వలె 2022లో కూడా చాలా సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో హిట్‌, ఫ్లాప్ సినిమాలు ఉన్నా వాటిలో హర్రర్ జోనర్‌‌ సినిమాలు ప్రత్యేకం

భయానికి భాష అవసరం లేదు.. ఒక హిట్‌ సినిమాలో నటుడు చెప్పిన డైలాగ్ ఇది. నిజమే.. హర్రర్ సినిమాలు ఏ భాషలో చూసినా భయం వేస్తుంది. డైలాగులు అర్ధం కాకపోయినా తెరపై నటీనటులు పలికించే హావభావాలు, వారికి ఎదురయ్యే సంఘటనలు మనల్ని కూడా భయపెడతాయి. కామెడీ, యాక్షన్, లవ్ ఇలా ఒక్కో జోనర్ సినిమాను ఒక్కో వర్గానికి చెందిన ప్రేక్షకుడు అభిమానిస్తాడు.

అదే హర్రర్, థ్రిల్లింగ్ జోనర్‌‌లో తెరకెక్కిన సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు చూస్తారు. టాలీవుడ్‌లో అన్ని జోనర్లలో సినిమాలు తెరకెక్కించే దర్శకులు ఉన్నప్పటికీ.. హర్రర్ సినిమాలు తీసే దర్శకులను ప్రేక్షకులు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకుంటారు.  వెండితెరపై ప్రేక్షకులను భయపెట్టిన టాప్‌10 హర్రర్, థ్రిల్లర్ సినిమాల గురించిన ప్రత్యేక కథనం పింక్‌విల్లా వ్యూయర్స్‌ కోసం ప్రత్యేకం..  

ప్రతి సంవత్సరం వలె 2022లో కూడా చాలా సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో హిట్‌, ఫ్లాప్ సినిమాలు ఉన్నా వాటిలో హర్రర్ జోనర్‌‌ సినిమాలు ప్రత్యేకం

టెర్రెస్‌ 13బి కేస్ :

2011, ఏప్రిల్ 25వ తేదీన జరిగిన విషాదకరమైన, భయంకర సంఘటన ఆధారంగా టెర్రెస్‌13బి కేస్‌ సినిమా తెరకెక్కింది. ఘటన జరిగి చాలా సంవత్సరాలు జరుగుతున్నప్పటికీ ఆ రోజు ఏం జరిగింది అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేసే వివరాలు ఇప్పటివరకు తెలియలేదు. ఏ విధమైన సాక్ష్యం కూడా లభించలేదు. వీటి ఆధారంగా సినిమాను తెరకెక్కించారు దర్శకనిర్మాత ప్రేమ్.

టెర్రెస్‌ 13బి కేస్ సినిమాకు ఐఎండీబీ 8.8 రేటింగ్ ఇచ్చింది.

ప్రతి సంవత్సరం వలె 2022లో కూడా చాలా సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో హిట్‌, ఫ్లాప్ సినిమాలు ఉన్నా వాటిలో హర్రర్ జోనర్‌‌ సినిమాలు ప్రత్యేకం

డైరెక్టర్ :

ఆశిష్‌ గాంధీ, ఐశ్వర్యా రాజ్‌ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన హర్రర్, డ్రామా థ్రిల్లర్‌‌ సినిమా డైరెక్టర్. యాక్సిడెంట్ తర్వాత ప్రముఖ డైరెక్టర్ జీవితంలో జరిగే అనుకోని సంఘటనల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకులు కార్తిక్ కృష్ణ, కిరణ్ పొన్నాడ. ఎవరికీ కనిపించని ఒక వ్యక్తి తనకు మాత్రమే కనిపిస్తుండడం అనే కాన్సెప్ట్‌ను కూడా బాగా చూపించి ప్రేక్షకులకు వినోదాన్ని పంచారు.

డైరెక్టర్ సినిమాకు ఐఎండీబీ 8.8 రేటింగ్ ఇచ్చింది.

ప్రతి సంవత్సరం వలె 2022లో కూడా చాలా సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో హిట్‌, ఫ్లాప్ సినిమాలు ఉన్నా వాటిలో హర్రర్ జోనర్‌‌ సినిమాలు ప్రత్యేకం

గీత :

హెబ్బా పటేల్, సునీల్, సప్తగిరి ప్రధాన పాత్రలతో తెరకెక్కిన సినిమా గీత. విశ్వ ఆర్‌‌ రావు దర్శకత్వం వహించిన ఈ సినిమా హర్రర్, డ్రామా, యాక్షన్‌ జోనర్‌‌లో తెరకెక్కింది. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన మూగ అమ్మాయిగా నటించారు హెబ్బా పటేల్. మెడికల్ మాఫియా కారణంగా ప్రాణాలు కోల్పోతున్న అనాథ పిల్లల కథను థ్రిల్లింగ్‌గా తెరకెక్కించారు దర్శకుడు విశ్వ.

గీత సినిమాకు ఐఎండీబీ 8.7 రేటింగ్ ఇచ్చింది.

ప్రతి సంవత్సరం వలె 2022లో కూడా చాలా సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో హిట్‌, ఫ్లాప్ సినిమాలు ఉన్నా వాటిలో హర్రర్ జోనర్‌‌ సినిమాలు ప్రత్యేకం

పద్మశ్రీ :

జ్యోతి, కిషోర్‌‌ కుమార్, పట్నాయక్ ప్రధాన పాత్రలు పోషించిన క్రైమ్‌, హర్రర్, థ్రిల్లర్ పద్మశ్రీ. ఉపాథి కోసం హైదరాబాద్‌కు వచ్చిన నలుగురు యువకులు.. యువతి ఆత్మహత్య చేసుకున్న హాస్టర్ గదిలోకి దిగుతారు. ఆ తర్వాత వాళ్లు ఎదుర్కొన్న పరిణామాలు ఏంటి అనేది పద్మశ్రీ కథ. పిల్లలను భర్తను ఒకేసారి కోల్పోయిన పద్మశ్రీ ఆ బాధతో సూసైడ్ చేసుకుంటుంది.

పద్మశ్రీ సినిమాకు ఐఎండీబీ 8.3 రేటింగ్ ఇచ్చింది.

ప్రతి సంవత్సరం వలె 2022లో కూడా చాలా సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో హిట్‌, ఫ్లాప్ సినిమాలు ఉన్నా వాటిలో హర్రర్ జోనర్‌‌ సినిమాలు ప్రత్యేకం

మసూద :

తిరువీర్, కావ్య కల్యాణ్ రామ్‌, సంగీత ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా మసూద. 2022 నవంబర్‌‌లో విడుదలైన ఈ సినిమా హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. 17 ఏళ్ల అమ్మాయి ప్రవర్తనలో విపరీతమైన మార్పు కనిపించడంతో ఆందోళన చెందిన తల్లి పక్కింటి అబ్బాయిని సహాయం కోరుతుంది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ప్రేక్షకులకు వినోదంతోపాటు భయాన్ని కూడా కలుగజేస్తాయి.

మసూద సినిమాకు ఐఎండీబీ (ఇంటర్నెట్‌ మూవీ డేటాబేస్) 7.8  రేటింగ్ ఇచ్చింది.

Read More : మొదటి సినిమా టైటిల్‌తో పాపులర్ అయిన టాలీవుడ్ టాప్‌10 సెలబ్రిటీలు

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!