Kinnerasani Review (కిన్నెరసాని - సినిమా సమీక్ష) : ఓన్లీ ఫర్ థ్రిల్లర్ లవర్స్ !

Updated on Jun 10, 2022 05:35 PM IST
Kalyaan Dhev : కళ్యాణ్ దేవ్.. మెగాస్టార్ చిరంజీవి అల్లుడు. 'విజేత' సినిమాతో ఈయన తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత 'సూపర్ మచ్చి' అనే మరో చిత్రంలో కూడా నటించారు.
Kalyaan Dhev : కళ్యాణ్ దేవ్.. మెగాస్టార్ చిరంజీవి అల్లుడు. 'విజేత' సినిమాతో ఈయన తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత 'సూపర్ మచ్చి' అనే మరో చిత్రంలో కూడా నటించారు.

నటీనటులు - కళ్యాణ్ దేవ్, కాశీష్ ఖాన్, ఆన్ షీతల్, రవీంద్ర విజయ్, సత్య ప్రకాష్, శ్రేయ త్యాగి

సంగీతం - మహతి స్వరసాగర్

కథ - సాయితేజ, దేశరాజు

నిర్మాతలు - రజనీ తాలూరి, రవి చింతల

దర్శకత్వం - రమణతేజ

ఓటీటీ  - జీ 5 

రేటింగ్ - 3/5

Kalyaan Dhev : కళ్యాణ్ దేవ్.. మెగాస్టార్ చిరంజీవి అల్లుడు. 'విజేత' సినిమాతో ఈయన తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత 'సూపర్ మచ్చి' అనే మరో చిత్రంలో కూడా నటించారు. ఇప్పుడు 'కిన్నెరసాని' (Kinnersani) అనే చిత్రం ద్వారా మళ్లీ తెలుగు ప్రేక్షకులను పలకరిస్తున్నారు. జీ 5 ఓటీటీ ద్వారా ఈ చిత్రం విడుదలైంది. మరి ఈ సినిమా కథా, కమామీషు ఏమిటో? నటీనటులు తమ పాత్రలకు ఏ మేరకు న్యాయం చేయగలిగారో మనం కూడా తెలుసుకుందామా

కిన్నెరసాని చిత్ర కథ 

న్యాయవాదిగా మంచి పరిణితి గల వ్యక్తి వెంకట్ (కళ్యాణ్ దేవ్). ఎన్నో కేసులను తన తెలివితేటలతో ఇట్టే పరిష్కరిస్తాడు. కానీ ఇతనికీ ఓ గతం ఉంటుంది. తన కాలేజీ రోజులలో ఓ అమ్మాయితో ప్రేమలో పడతాడు. కానీ ఆమె మరణించడంతో కొన్నాళ్లు నిరాశలో గడుపుతాడు. ఆమెను హత్యను చేసినవారిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు, 

ఇదే క్రమంలో, వెంకట్ జీవితంలోకి వస్తుంది వేద (ఆన్ షీతల్). ఈమె ఓ గ్రంథాలయాన్ని నడుపుతూ ఉంటుంది. అక్కడే ఆమెకు ఓ పుస్తకం దొరుకుతుంది. ఆ పుస్తకం పేరే 'కిన్నెరసాని'. 

ఆ పుస్తకాన్ని అనుకోకుండా చదివిన ఆమె, అందులో తన జీవితానికి సంబంధించిన సంఘటనలు ఉండడం చూసి ఆశ్చర్యపోతుంది. విచిత్రమేంటంటే, వెంకట్ గతానికీ, వేదకు కూడా ఓ సంబంధం ఉంటుంది. ఇదే క్రమంలో వేదకు ఓ వ్యక్తి వల్ల ప్రాణభయం ఉందన్న సంగతి వెల్లడి అవుతుంది. 

ఇలా రకరకాల ట్విస్టులతో సినిమా నడుస్తుంది. అనుకోని సమస్యలలో చిక్కుకున్న వేదను వెంకట్ ఎలా కాపాడుతాడు? అలాగే తన ప్రియురాలి మరణానికి కారణమైన వారిపై ప్రతీకారం ఎలా తీర్చుకుంటాడో తెలుసుకోవాలంటే ఈ చిత్రం చూడాల్సిందే. 

విశ్లేషణ

పూర్తిస్థాయి థ్రిల్లర్‌గా 'కిన్నెరసాని' (Kinnerasani)  సినిమా తెరకెక్కింది. ఫస్ట్ హాఫ్ చాలా ఆసక్తికరంగా సాగుతుంది. కానీ సెకండాఫ్ విషయంలోనే దర్శకుడు కాస్త తడబడ్డాడేమో అనిపిస్తుంది. అలాగే క్లైమాక్స్ ఇంకొంచెం ఎఫెక్టివ్‌గా ఉంటే బాగుండేది.

ఈ సినిమాకి ప్రధానమైన బలం సాయితేజ, దేశరాజు అందించిన కథ, మాటలు. మర్డర్ మిస్టరీ అయినప్పటికీ కూడా, కథాబలం ఉన్న చిత్రంగానే 'కిన్నెరసాని'ని మనం చెప్పుకోవచ్చు. 

ఇక పాత్రధారుల విషయానికి వస్తే, కళ్యాణ్ దేవ్ (Kalyaan Dhev) తన గత చిత్రాలతో పోలిస్తే, బాగా ఇంప్రూవ్ అయ్యాడు. ఆయన పాత్రను దర్శకుడు కొత్తగా తీర్చిదిద్దడానికి ప్రయత్నించాడు. ఇక కళ్యాణ్ ప్రేయసి పాత్రకి కాశీష్ ఖాన్ న్యాయం చేసిందనే చెప్పవచ్చు.

వేద పాత్రలో ఆన్ షీతల్‌కు కూడా మంచి మార్కులే పడ్డాయి. అన్నింటికన్నా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది విలన్ పాత్రలో నటించిన రవీంద్ర విజయ్ గురించి. తన హావభావాలతో మంచి పెర్ఫార్మెన్స్ అందించాడు.

ట్యాగ్ లైన్ : థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వారికి మాత్రం .. ఈ "కిన్నెరసాని" ప్రత్యేకం ! 

 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!