నటించే ఆలోచన ఇక రాకపోవచ్చు..కుండబద్దలు కొట్టిన మహేష్‌బాబు (MaheshBabu) భార్య నమ్రతా శిరోద్కర్

Updated on Jun 12, 2022 11:17 PM IST
భార్య నమ్రతా శిరోద్కర్‌‌తో మహేష్‌బాబు (MaheshBabu)
భార్య నమ్రతా శిరోద్కర్‌‌తో మహేష్‌బాబు (MaheshBabu)

పెళ్లి అయిన తర్వాత సినిమాలు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించరు స్టార్ హీరోయిన్లు. చేసినా గతంలో మాదిరిగా గ్లామరస్ క్యారెక్టర్లు చేయడానికి ఇష్టపడరు. చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్టులుగా కొనసాగుతుంటారు. ఏదైనా సినిమాలో కథ, తన క్యారెక్టర్ నచ్చితే ఇంట్రెస్ట్‌ చూపిస్తారు.

మరికొందరు అయితే పెళ్లి తర్వాత కూడా హీరోయిన్‌గా కొనసాగుతారు. ఇక, మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ కూడా వెండితెరకు రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని గతంలో చాలా వార్తలు వచ్చాయి. తాజాగా ఆ వార్తలపై నమ్రత క్లారిటీ ఇచ్చారు.

1993లో మిస్‌ ఇండియా యూనివర్స్‌..

మోడల్‌గా మంచి గుర్తింపు పొందిన నమ్రతా శిరోద్కర్, ఫ్యాషన్ ఇండస్ట్రీలో పలు కిరీటాలను సొంతం చేసుకుంది కూడా. మిస్ ఇండియా యూనివర్స్‌గా 1993లో విజేతగా నిలిచింది. ఆ తర్వాత ఏషియా మిస్ ఇండియా పోటీల్లో మరో కిరీటాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి త్వరగానే వచ్చింది నమ్రత. 1998వ సంవత్సరంలో  ఓ హిందీ సినిమా ద్వారా బాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది.

మహేష్‌ తో స్పెషల్‌ బాండింగ్

నమ్రతా శిరోద్కర్.. సినిమాల్లోకి అడుగుపెట్టిన తర్వాత.. భాషతో సంబంధం లేకుండా తెలుగు, హిందీ తమిళం, మలయాళం.. ఇలా విభిన్న భాషల్లో సినిమాలు చేసింది. 2000 సంవత్సరంలో మొదటిసారి మహేష్‌బాబుతో 'వంశీ' సినిమాలో నటించింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత సక్సెస్ కాలేదు. అయితే ఆ సినిమాతో వారిద్దరి మధ్య స్పెషల్ బాండింగ్‌ ఏర్పడింది.

మిస్‌ ఇండియా కిరీటం అందుకుంటున్న నమ్రతా శిరోద్కర్

మహేష్‌తో పెళ్లి తర్వాత సినిమాలకు దూరం..

పెళ్లి తర్వాత నమ్రతా శిరోద్కర్ సినిమాలకు పూర్తిగా దూరమైంది. కేవలం మహేష్ బాబుకి సంబంధించిన ప్రాజెక్టుల విషయంలో సలహాలు ఇవ్వడమే కాకుండా.. కమర్షియల్ యాడ్స్‌లో నటించేలా జాగ్రత్తలు కూడా తీసుకుంది నమ్రత. ముంబైకు చెందిన కొన్ని ప్రముఖ కంపెనీలతో ఆమెకు మంచి పరిచయాలు ఉండడంతో, మహేష్ కూడా నేషనల్ బ్రాండింగ్ యాడ్స్ చేశాడు.

ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత

పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైన నమ్రత..ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన అనంతరం, సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నట్టు వార్తలు వచ్చాయి. ఆమె సినిమాల్లోకి వస్తోందని పలు కథనాలు కూడా ప్రచురితమయ్యాయి. క్యారెక్టర్‌‌ ఆర్టిస్టుగా ప్రాముఖ్యత ఉన్న పాత్రల్లో నటించడానికి నమ్రత ఇంట్రెస్ట్‌ చూపిస్తోందని టాక్‌ కూడా నడిచింది ఇండస్ట్రీలో.

భార్య నమ్రతా శిరోద్కర్‌‌తో మహేష్‌బాబు (MaheshBabu), సూపర్‌‌స్టార్‌‌ కృష్ణ దంపతులు

తన రీఎంట్రీపై వస్తున్న వార్తలపై నమ్రత ఇటీవల క్లారిటీ ఇచ్చింది.  తన ఫ్రెండ్‌ షాపు ఓపెనింగ్‌కు వచ్చిన నమ్రత మీడియాతో మాట్లాడింది. పలు విషయాలపై స్పందించింది. సినిమాల్లో తన రీఎంట్రీపై వస్తున్న వార్తలకు వివరణ కూడా ఇచ్చింది. ‘తనను మళ్లీ నటించమని చాలా మంది అడుగుతున్నారు. ప్రస్తుతం నా కుటుంబ బాధ్యతలతో సంతోషంగానే ఉన్నాను. అదే పనిలో బిజీగా కూడా ఉన్నాను. సినిమాల్లో నటించాలని అనుకోవడం లేదు. ఫ్యూచర్‌‌లో కూడా ఆ ఆలోచన ఉండకపోవచ్చు’ అని మహేష్‌బాబు (MaheshBabu) భార్య నమ్రత చెప్పుకొచ్చింది.

Read More: సితార పెద్ద హీరోయిన్​ అవుతుందంటున్న సూపర్ స్టార్​ మహేష్​ బాబు 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!