సూపర్ స్టార్ మహేష్ బాబు బ్లాక్ బస్టర్ మూవీ 'మహర్షి' (Maharshi) నటుడు గురు స్వామి (Guru Swamy) ఇకలేరు..!

Updated on Sep 10, 2022 06:37 PM IST
గురుస్వామికి ‘మహర్షి’ (Maharshi Movie) లోని రైతు పాత్ర మంచి పేరు తీసుకువచ్చింది. ప్రేక్షకుల్లో గుర్తింపును సాధించి పెట్టింది.
గురుస్వామికి ‘మహర్షి’ (Maharshi Movie) లోని రైతు పాత్ర మంచి పేరు తీసుకువచ్చింది. ప్రేక్షకుల్లో గుర్తింపును సాధించి పెట్టింది.

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) హీరోగా తెరకెక్కిన 'మహర్షి' (Maharshi) సినిమాలో రైతుగా నటించిన గురు స్వామి ఇక లేరు. ఆ మూవీలో గురుస్వామి రైతు పాత్రలో అద్భుతంగా నటించారు. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేసిన.. ‘మహర్షి’ సినిమాను కీ టర్న్ చేసే రోల్‌లో మెప్పించారు గురుస్వామి. న‌టుడు గురుస్వామి. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. పరిస్థితులు విషమించడంతో నిన్న తుదిశ్వాస విడిచారు. 

గురుస్వామికి ‘మహర్షి’ (Maharshi Movie) లోని రైతు పాత్ర మంచి పేరు తీసుకువచ్చింది. ప్రేక్షకుల్లో గుర్తింపును సాధించి పెట్టింది. ఈ రోల్‌లోకి ఆయన పరకాయ ప్రవేశం చేసి అందరి చేత కంటతడి పెట్టించారు. ఆ సినిమాలో మహేష్‌తో మాట్లాడుతూ.. ‘ఒక్కసారి ఈ మ‌ట్టిలో కాలుపెడితే ఆ భూదేవి త‌ల్లే లాగేసుకుంట‌ది.. రా’ అంటూ అనే మాటలు ఓ రేంజ్‌లో హైని తెస్తాయి. ఆ ఒక్క డైలాగ్‌తో ఆయన మన మనస్సులో ఓ గట్టి ముద్రను వేస్తారు.

కాగా, గురుస్వామి స్వస్థలం కర్నూలు జిల్లా వెల్దుర్తి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాని వదిలి నాటక రంగంలోకి వచ్చారు. అటు నుంచి షార్ట్ ఫిల్మ్స్‌లో అరంగేట్రం చేశారు. 'ఆయుష్మాన్ భవ' (Ayushman Bhava) అనే లఘు చిత్రాన్ని చూసి మహర్షి దర్శక నిర్మాతలు అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలోనే ఇలా కళా రంగంలోకి వచ్చారు గురు స్వామి. 

అయితే, గురు స్వామి తన స్నేహితుల ద్వారా నాటక రంగంలోకి రావడం, అటు నుంచి లఘు చిత్రాల్లో నటించడం వరకు వచ్చింది. ఆ తరువాత మహర్షి సినిమా ఛాన్స్ వచ్చింది. 'మహర్షి' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో (Maharshi Pre Release Event) గురు స్వామి చెప్పిన మాటలు అందరినీ ఎమోషనల్ అయ్యేలా చేశాయి. 

ఇదిలా ఉంటే.. గురు స్వామి (Guru Swamy) 'మహర్షి' అనంతరం కూడా పలు సినిమాల్లో నటించారు. ‘వకీల్ సాబ్’, ‘A1 ఎక్స్‌ప్రెస్’ తదితర చిత్రాల్లో ఆయన నటించారు. మరోవైపు ఆయన మృతి పట్ల పలువురు సినీ ఇండస్ట్రీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Read More: మహేష్ బాబు (Mahesh Babu), త్రివిక్రమ్ సినిమాపై కొత్త అప్డేట్ ?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!