వెబ్ సిరీస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న 'పోకిరి'(Pokiri) బ్యూటీ ఇలియానా (Ileana).. సినిమాల్లో అవకాశాలు లేనందుకేనా?

Updated on Sep 09, 2022 08:11 PM IST
‘ది ఫేమ్ గేమ్’ (The Fame Game) ఫేమ్.. కరిష్మా కోహ్లి (Karishma Kohli) ఇలియానా నటించబోయే వెబ్ సిరీస్ కు దర్శకుడు.
‘ది ఫేమ్ గేమ్’ (The Fame Game) ఫేమ్.. కరిష్మా కోహ్లి (Karishma Kohli) ఇలియానా నటించబోయే వెబ్ సిరీస్ కు దర్శకుడు.

పదహారేళ్ల క్రితం ‘దేవదాస్’ (Devadasu) చిత్రంతో టాలీవుడ్‌లో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది ఇలియానా (Ileana). ఆ తర్వాత సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన 'పోకిరి' సినిమాతో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. దక్షిణాదిలో చాన్నాళ్లు అగ్ర నటిగా వెలిగొందిన ఈ గోవా బ్యూటీ తర్వాత డీలా పడింది. కొత్త హీరోయిన్స్ రాకతో రేస్‌లో వెనుకబడింది. ఆ దశలో బాలీవుడ్ లో కాలు పెట్టినా అంతగా రాణించలేకపోయింది. 

అయితే, ఇలియానా (Ileana) ప్రస్తుతం టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఫేడవుట్ అయిపోయింది. యువ హీరోయిన్లతో పోటీలో వెనుకబడి అవకాశాలను తెచ్చుకోలేకపోయింది ఈ గోవా బ్యూటీ. ఈ క్రమంలో బాలీవుడ్ లో కాలు పెట్టినా పెద్దగా రాణించలేకపోయింది. అడపాదడపా చిత్రాలు చేస్తున్నా టాప్ హీరోయిన్ల జాబితాలోకి రాలేకపోతోంది ఈ ముద్దుగుమ్మ. 

ఈ నేపథ్యంలో ఇలియానా (Ileana) ఇప్పుడు డిజిటల్ ఎంట్రీ ఇవ్వనుండడం విశేషం. బాలీవుడ్ లో ఇప్పటికే చాలామంది హీరోయిన్లు వరుస సినిమాలు చేస్తూనే మరోవైపు వెబ్ సిరీసుల్లోనూ నటిస్తున్నారు. ఇప్పుడు ఇలియానా కూడా ఈ జాబితాలో చేరింది. నాయికా ప్రాధాన్యం ఉన్న వెబ్ సిరీస్‌కి ఇలియానా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  

‘ది ఫేమ్ గేమ్’ (The Fame Game) ఫేమ్.. కరిష్మా కోహ్లి (Karishma Kohli) ఇలియానా నటించబోయే వెబ్ సిరీస్ కు దర్శకుడు. అప్లాజ్ ఎంటర్ టైన్ మెంట్స్, బిబిసి స్టూడియోస్ సంయుక్తంగా ఈ సిరిస్ ను నిర్మిస్తున్నాయి. వైవిధ్యమైన కథాంశంతో ఈ సిరీస్ రూపొందబోతోంది. టైటిల్, ఇతర నటీనటుల వివరాలు త్వరలో తెలియనున్నాయి.

Read More: మహేష్ బాబు (Mahesh Babu), త్రివిక్రమ్ సినిమాపై కొత్త అప్డేట్ ?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!