Samantha Ruth Prabhu : సమంత బాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు? తొలి చిత్రం హీరో ఎవరు ?

Updated on Jun 07, 2022 03:29 PM IST
ఉత్తరాది భామలు అందరూ టాలీవుడ్ సినిమాల‌కు క్యూ క‌డుతున్నారు. స‌మంత (Samantha) మాత్రం అందుకు భిన్నంగా బాలీవుడ్ స్టార్‌డ‌మ్ కోసం గ‌ట్టిగానే ట్రై చేస్తున్నారు. 
ఉత్తరాది భామలు అందరూ టాలీవుడ్ సినిమాల‌కు క్యూ క‌డుతున్నారు. స‌మంత (Samantha) మాత్రం అందుకు భిన్నంగా బాలీవుడ్ స్టార్‌డ‌మ్ కోసం గ‌ట్టిగానే ట్రై చేస్తున్నారు. 

టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా స‌మంత (Samantha) హిట్ సినిమాల‌తో చెల‌రేగిపోతున్నారు. ఇదే క్రమంలో తమిళ, కన్నడ భాష చిత్రాలలో కూడా ఈ బ్యూటీ తనదైన శైలిలో రాణిస్తున్నారు . ప్రస్తుతం ఈమె బాలీవుడ్‌లో కూడా నటించే అవకాశం ఉందని టాక్. హిందీ చిత్ర పరిశ్రమలో  ఫుల్ బిజీ అయ్యేందుకు స‌మంత రెడీ అవుతున్నారని వార్తలు వస్తున్నాయి. 

అందుకే, ఈమె వ‌రుసగా బాలీవుడ్ సినిమాల‌కు సైన్ చేస్తున్నారని అంటున్నారు. ప్రస్తుతం, బాలీవుడ్ స్టార్ న‌టులంతా టాలీవుడ్ సినిమాల‌ వైపు క్యూ క‌డుతుంటే.. స‌మంత మాత్రం అందుకు భిన్నంగా బాలీవుడ్‌ స్టార్‌డ‌మ్ కోసం గ‌ట్టిగానే ట్రై చేస్తున్నారు. 

తెలుగులో వరుసగా సినిమాలు చేస్తున్న సమంత

ప్ర‌స్తుతం స‌మంత (Samantha) విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో క‌లిసి 'ఖుషీ' సినిమాలో న‌టిస్తున్నారు. 'ఖుషీ' శివ నిర్మాణ ద‌ర్శ‌క‌త్వంలో విడుద‌ల కానుంది. అలాగే మ‌రో రెండు తెలుగు సినిమాలు కూడా ఆమె లిస్టులో ఉన్నాయి.

శాకుంతలం, య‌శోద సినిమాల‌తో స‌మంత ప్రేక్ష‌కుల ముందుకు త్వ‌ర‌లో రానున్నారు. ఇక హిందీ సినిమాల విష‌యానికి వ‌స్తే, వ‌రుణ్ ధావ‌న్‌తో క‌లిసి ఓ వెబ్ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ముంబైకి మ‌కాం మార్చేందుకు ట్రై చేస్తున్న స‌మంత, వ‌రుసగా హిందీ సినిమాల ఆఫ‌ర్ల‌కు ఓకే చెప్తున్నారు. 

రణ్‌వీర్‌తో సమంత ఫోటో సంగతేంటి ?

ఇటీవలే బాలీవుడ్ హీరో ర‌ణ్ వీర్ సింగ్ (Ranveer Singh) తో క‌లిసి స‌మంత ఓ ఫోటో షేర్ చేశారు. 'ర‌ణ్‌వీర్  ఈజ్ ది స్వీటెస్ట్ యాక్ట‌ర్' అంటూ సామ్ ఆయనకు కితాబునిచ్చారు. దీంతో వీరిద్ద‌రూ క‌లిసి ఓ సినిమా చేస్తున్నారంటూ.. అందుకే స‌మంత ఫోటోలు చేశారంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.

అయితే,  బీ టౌన్ మాత్రం, ఇది ఓ యాడ్‌కు సంబంధించిన ఫోటో అంటూ తెలపడం గమనార్హం. స‌మంత సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. తన జీవితానికి సంబంధించిన, ప్ర‌తీ విష‌యాన్ని అభిమానుల‌తో పంచుకుంటారు. కనుక, స‌మంత (Samantha) బాలీవుడ్‌కు వెళితే ఆ విష‌యాన్ని త‌మ‌కు చెప్పే వెళ‌తారంటూ అభిమానులు ఓ రేంజ్‌లో రిప్లై ఇస్తున్నారు. 

Read More: పీకాక్ మ్యాగ‌జైన్ కు హాట్ గా పోజులిస్తున్న (Samantha) స‌మంత‌.. ఫొటోలు వైర‌ల్ !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!