Mahesh Babu: లవ్ యూ నాన్న.. ఇక నుంచి నిర్భయంగా దూసుకుపోతా.. కృష్ణ వారసత్వంపై మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్

Updated on Nov 24, 2022 06:47 PM IST
తండ్రి కృష్ణ (Superstar Krishna) వారసత్వాన్ని ఇక నుంచి ముందుకు తీసుకెళ్తానని స్టార్ హీరో మహేష్ బాబు (Mahesh Babu) చెప్పారు 
తండ్రి కృష్ణ (Superstar Krishna) వారసత్వాన్ని ఇక నుంచి ముందుకు తీసుకెళ్తానని స్టార్ హీరో మహేష్ బాబు (Mahesh Babu) చెప్పారు 

భారతదేశం గర్వించదగ్గ నటుడు, సూపర్‌స్టార్ (Superstar Krishna) కృష్ణ మరణం యావత్ సినీ లోకాన్ని కలచివేసింది. కృష్ణ తిరిగిరాని లోకాలకు వెళ్లారని తెలిసి కృష్ణ కుటుంబ సభ్యులతోపాటు ఘట్టమనేని అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. మహేష్ బాబు (Mahesh Babu) తీవ్ర దు:ఖంలో ఉన్నారు. 

ఈ ఏడాది మహేష్ ముగ్గురు ఆప్తులను కోల్పోయారు. ఒక ఏడాది కాలంలో ఆయన కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. సోదరుడు రమేశ్ బాబును కోల్పోయిన బాధ నుంచి కోలుకుంటున్న సమయంలో తల్లి ఇందిర మృతి మహేష్‌ను కలచివేసింది. ఆ బాధ నుంచి తేరుకునే లోగా తండ్రి కృష్ణ చనిపోవడంతో మహేష్ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అయినా శాస్త్ర ప్రకారం నిర్వహించాల్సిన కార్యక్రమాలను ఆయన పూర్తి చేస్తున్నారు. 

గత సోమవారం కృష్ణా నదిలో తండ్రి అస్థికలను మహేష్ బాబు నిమజ్జనం చేశారు. కృష్ణ చనిపోయినప్పటి నుంచి మీడియాతో పాటు సోషల్ మీడియాకూ దూరంగా ఉంటున్న మహేష్.. ఈ రోజు కృష్ణను ఉద్దేశిస్తూ ఎమోషనల్‌గా ఓ ట్వీట్ చేశారు. ‘మీరు జీవితాన్ని ఓ వేడుకలా గడిపారు. ఇక్కడి నుంచి అంతకంటే వేడుకగా వెళ్లారు. అది మీ గొప్పతనం. డేరింగ్, డ్యాషింగ్ మీ తత్వం.. వాటితోనే మీరు నిర్భయంగా గడపగలిగారు. నా స్ఫూర్తి, నా ధైర్యం.. అన్నీ మీతో పాటే వెళ్లిపోయినట్లు అనిపిస్తోంది. కానీ చిత్రంగా నాలో ఆ బలాన్ని ఇప్పుటికీ నేను అనుభూతి చెందుతున్నా. ఇంతకముందు ఎప్పుడూ నేను ఇలా ఫీలవ్వలేదు. మీలాగా నేను కూడా ఇప్పుడు నిర్భయంగా ఉన్నా. మీ వెలుగు నాలో ఎప్పటికీ ప్రకాశిస్తూనే ఉంటుంది. ఇక్కడి నుంచి మీ వారసత్వాన్ని నేను ముందుకు తీసుకెళ్తా. మిమ్మల్ని గర్వపడేలా చేస్తా. లవ్ యూ నాన్నా. నా సూపర్‌స్టార్’ అని మహేష్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

ఇకపోతే, మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఎస్ఎస్ఎంబీ 28 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ దాదాపుగా పూర్తి కావొచ్చిందని తెలుస్తోంది. అయితే ఇందులో హీరోయిన్‌గా నటిస్తున్న పూజా హెగ్డే కాలికి గాయమవ్వడంతో షూటింగ్ వాయిదా పడింది. అలాగే తండ్రి మరణంతో మహేష్ బాధలో ఉండటంతో ఎస్ఎస్ఎంబీ 28 షూట్ రీస్టార్ట్ అయ్యేందుకు మరింత టైమ్ పట్టేలా ఉంది. ఈ సినిమా పూర్తయిన తర్వాత దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్‌లో ఓ మూవీని చేయనున్నారు మహేష్. ఈ చిత్రంపై ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వచ్చేసిన విషయం విదితమే. 

Read more: ‘ఆదిత్య 369’ నుంచి ‘బింబిసార’ వరకు.. టాలీవుడ్‌ (Tollywood) టైమ్ ట్రావెల్ జోనర్ సినిమాలు

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!