Singer Mano Birthday Special : పాటే అతని ప్రాణం.. 24000 కు పైగా సినీ గీతాలు పాడిన మేటి గాయకుడు మనో !

Updated on Oct 27, 2022 04:00 PM IST
గాయకుడు మనో (Mano) తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సుమారు పాతిక వేలకు పైగా పాటలు పాడారు.
గాయకుడు మనో (Mano) తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సుమారు పాతిక వేలకు పైగా పాటలు పాడారు.

టాలీవుడ్ గాయకుడు మనో పాడే గీతాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తరువాత ఎలాంటి పాటనైనా అలవోకగా.. అందరినీ ఆకట్టుకునేలా పాడగలే సత్తా ఉన్న గాయకుడు మనో (Mano). 

చిన్ననాటి నుంచే కళలపై ఎనలేని ఆసక్తిని పెంచుకున్నారు మనో. సంగీతం నేర్చుకొని పలు చోట్ల ప్రదర్శనలు ఇచ్చారు. ఆ తర్వాత  తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సుమారు పాతిక వేలకు పైగా పాటలు పాడారు. 

పాటల పాడడంతో పాటు డబ్బింగ్ కూడా చెప్పడం మనో ప్రత్యేకత. అలాగే నటుడిగా, నిర్మాతగా, సంగీత దర్శకుడిగా కూడా మనో బహుముఖ పాత్రలు పోషించారు.  38 సంవత్సరాలుగా తెలుగు సినీ సంగీత సంద్రాన.. తన స్వరాలతో అలరిస్తోన్న మనో పుట్టినరోజు సందర్శంగా పింక్ విల్లా ప్రత్యేక కథనం మీకోసం. 

గాయకుడు మనో (Mano) తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సుమారు పాతిక వేలకు పైగా పాటలు పాడారు.

బాల్యం
మనో అసలు పేరు నాగూర్ బాబు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని ఓ ముస్లిం కుటుంబంలో ఆయన జన్మించారు. తండ్రి రసూల్ ఆల్ ఇండియా రేడియోలో పనిచేసేవారు. తల్లి పేరు షహీదా. నేదునూరి కృష్ణమూర్తి దగ్గర మనో కర్ణాటక సంగీతం నేర్చుకున్నారు. గాయకుడు కాకముందే, మనో బాల నటుడిగా తెలుగు సినిమాల్లోకి అడుగుపెట్టారు. 'నీడ' అనే చిత్రంలో బాలనటుడిగా కనిపించారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా నాగూర్ బాబు పేరును మనోగా మార్చారు. 

గాయకుడు మనో (Mano) తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సుమారు పాతిక వేలకు పైగా పాటలు పాడారు.

ఇష్టమైన గాయకులు
ఘంటసాల, కిషోర్ కుమార్, మహ్మద్ రఫీ, జేసుదాసు, బాలు, జానకి, సుశీల, వాణీ జయరాం.. వీరందరూ మనోకి అభిమాన గాయకులు. వీరు పాడే పాటలంటే మనోకి చాలా ఇష్టం. పాకిస్థానీ గాయకుడు గులాం అలీ పాటలను కూడా మనో ఎంతో అభిమానిస్తారు.

మనో కుటుంబం
మనో 19 ఏళ్ల వయసులో అనగా.. 1985లో జమీలాను పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహానికి మనో గురువులు కె.చక్రవర్తి, ఎస్పీ. బాలసుబ్రహ్మణ్యం సాక్షి సంతకాలు చేశారు. మనో, జమీలా దంపతులకు ముగ్గురు పిల్లలు. కుమార్తె సోఫియా, కుమారులు షకీర్, రతేశ్. కుమారులు ఇద్దరూ హీరోలుగా తమిళ సినిమాల్లో నటిస్తున్నారు. కూతురు సోఫియా అమెరికాలో జరిగిన 'స్వరాభిషేకం' కార్యక్రమంలో పాటలు పాడారు.

గాయకుడు మనో (Mano) తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సుమారు పాతిక వేలకు పైగా పాటలు పాడారు.

మనోకు స్పూర్తి ఘంటసాల
ఘంటసాల (Ghantasala) పాటలు వింటూ మనో పెరిగారు. ముఖ్యంగా ఘంటసాల పాడిన శివశంకరి, రసికరాజా, మది శారదాదేవి వంటి పాటలను తన కచేరీలలో పాడి పేరు సంపాదించుకున్నారు మనో. తనలాంటి వారు గాయకులుగా పేరు తెచ్చుకునేందుకు ఘంటసాల గారి పాటలే కారణమని మనో తరచూ చెబుతుంటారు.

బాలసుబ్రహ్మణ్యంతో అనుబంధం
ఎస్పీ బాలుతో (S. P. Balasubrahmanyam) మనో (Mano)కు ప్రత్యేక అనుబంధం ఉంది. ఇళయరాజా ద్వారా సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టిన మనో.. బాలుతో కలిసి అనేక పాటలు పాడారు. తన కెరీర్‌లో బాలు సపోర్ట్ కూడా చాలా ఉందని మనో పలు ఇంటర్వ్యూలలో చెబుతుంటారు. వీరిద్దరూ దేశ విదేశాల్లో ఎన్నో స్టేజ్ ప్రోగ్రామ్‌లు, మ్యూజిక్ షోలు చేశారు.  
 
గాయకుడు మనో (Mano) తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సుమారు పాతిక వేలకు పైగా పాటలు పాడారు.

తెలుగులో ఎన్నో హిట్ సాంగ్స్
కిల్లర్ సినిమాలోని 'ప్రియా.. ప్రియతమా', శివలోని 'సరసాలు చాలు చాలు శ్రీవారు', నిర్ణయం చిత్రంలోని 'మిల మిల మెరిసిన తార', ప్రేమికుడులోకి 'ముక్కాలా ముక్కాబ్బులా', పెళ్లి చేసుకుందాం సినిమాలోని 'ఓ లైలా లైలా', ముత్తు సినిమాలోని 'తిల్లానా తిల్లానా', కొదమ సింహంలో 'పిల్లో జాబిల్లో', దళపతిలో 'ముద్దబంతి'  పాటలు మనో ఆలపించినవే. 

మనో (Mano) అన్ని భాషల్లో కలిపి 24,742 పాటలు పాడారు. గాయకుడిగానే కాకుండా సంగీత దర్శకుడిగా కూడా ఎన్నో సినిమాలకు స్వరాలు సమకూర్చారు. అలాగే నటుడిగా వెండితెరపై ప్రేక్షకులకు వినోదం పంచారు. అంతేకాకుండా నిర్మాతగా కూడా సినిమాలను నిర్మించారు. 

గాయకుడు మనో (Mano) తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సుమారు పాతిక వేలకు పైగా పాటలు పాడారు.

బుల్లితెరపై పాటల షోలతో పాటు కామెడీ షోలలో కూడా మనో న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. మనో ముస్లిం మతానికి చెందిన వారైనా.. హిందూ మతమన్నా, ఆచారాలన్నా గౌరవిస్తారు. తిరుమల శ్రీవారిని తరచూ దర్శించుకుంటారు. హిందూ పండుగలను కూడా మనో జరుపుకోవడం విశేషం. 

Read More: రాజమౌళి (rajamouli ss) సత్తా ఏంటో ఆ ఒక్క సినిమాతో అర్థమైంది: సంగీత దిగ్గజం ఏఆర్ రెహ్మాన్ (A.R.Rahman)

గాయకుడు మనో (Mano) తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సుమారు పాతిక వేలకు పైగా పాటలు పాడారు.

మనో భవిష్యత్తులో మరిన్ని అద్భుతమైన గీతాలతో.. తెలుగు శ్రోతలను అలరించాలని మనం కూడా ఆశిద్దాం. హ్యాపీ బర్త్ డే మనో.
పింక్ విల్లా.
 
Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!