రేపు టాలీవుడ్ (Tollywood) సినిమా షూటింగ్‌లు బంద్!.. నిర్మాతల మండలి కీలక నిర్ణయం

Updated on Nov 15, 2022 05:48 PM IST
సూపర్‌స్టార్ కృష్ణ (Superstar Krishna) మృతికి సంతాప సూచకంగా రేపు సినిమా షూటింగులను ఆపేయాలని నిర్మాతలు నిర్ణయం తీసుకున్నారు
సూపర్‌స్టార్ కృష్ణ (Superstar Krishna) మృతికి సంతాప సూచకంగా రేపు సినిమా షూటింగులను ఆపేయాలని నిర్మాతలు నిర్ణయం తీసుకున్నారు

టాలీవుడ్ సూపర్‌స్టార్ కృష్ణ (79) కన్నుమూశారు. ఈ రోజు తెల్లవారుజామున 04:09 గంటలకు హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో ఆయన చనిపోయారు. కృష్ణ భౌతికకాయాన్ని నానక్‌రామ్‌గూడలోని ఆయన నివాసంలో ఉంచారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సూపర్‌స్టార్‌కు నివాళులు అర్పించారు. 

కృష్ణ (Superstar Krishna) మృతికి సంతాప సూచకంగా బుధవారం సినిమా షూటింగ్‌లను నిలిపివేయాలని నిర్మాతల మండలి నిర్ణయించింది. ఈ మేరకు కౌన్సిల్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. రేపు హైదరాబాద్‌లో మహాప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో సూపర్‌స్టార్ అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయన పార్థీవ దేహాన్ని గచ్చిబౌలి స్టేడియంలో ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. రేపు ఉదయం స్టేడియం నుంచి పద్మాలయ స్టూడియోస్‌కు భౌతికకాయాన్ని తరలిస్తారు. ఈ విషయాన్ని కృష్ణ సోదరుడు, నిర్మాత ఆదిశేషగిరి రావు తెలిపారు. పద్మాలయ స్టూడియోస్‌లో కొన్ని ఆచార కార్యక్రమాలు పూర్తయ్యాక.. మధ్యాహ్నం మహాప్రస్థానంలో అంత్యక్రియలు పూర్తి చేయనున్నట్లు ఆదిశేషగిరి రావు చెప్పారు.

కృష్ణ పార్థీవ దేహాన్ని గచ్చిబౌలి స్టేడియంలో ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు

శోకసంద్రంలో అభిమానులు

ఇకపోతే, ఆదివారం అర్ధరాత్రి కార్డియాక్ అరెస్టుకు గురైన కృష్ణను ఆయన కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని కాంటినెంటల్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం వేకువజామున ఆయన తుదిశ్వాస విడిచారు. కృష్ణ మృతితో ఆయన ఫ్యామిలీతో పాటు చిత్ర పరిశ్రమ, ఘట్టమనేని అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. 

ఆయన ఎప్పుడూ మాతోనే ఉంటారు

కాగా, కృష్ణ మృతిపై ఆయన కుటుంబ సభ్యులు కీలక ప్రకటన చేశారు. ‘కృష్ణ ఎంతో మందికి స్పూర్తిగా నిలిచిన గొప్ప మహనీయుడు. అందుకే ఆయనను మేమెంతో గొప్పగా ప్రేమిస్తాం. ఆయన లేరనే విషయం ప్రతీ రోజు మాకు విషాదాన్ని పంచుతుంది. అందుకే మేం ఆయనకు గుడ్ బై చెప్పడానికి ఇష్టపడటం లేదు. కృష్ణ ఎప్పుడూ మాతోనే ఉంటారు’ అని ఆ ప్రకటనలో ఘట్టమనేని కుటుంబ సభ్యులు తెలిపారు.

ఇది మాటలకు అందని విషాదం: చిరంజీవి

ఇక, కృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలంటూ సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. మన అల్లూరి, మన జేమ్స్ బాండ్ అయిన కృష్ణ గారి మరణం తెలుగు వారికి తీరనిలోటు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఇది మాటలకు అందని విషాదమని మెగాస్టార్ చిరంజీవి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కృష్ణ మృతితో తన గుండె ముక్కలైందని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అన్నారు. తెలుగు సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలు మాటల్లో వర్ణించలేమని చెప్పారు. కృష్ణ నిజమైన సూపర్‌స్టార్ అని బన్నీ పేర్కొన్నారు. 

Read more: Mahesh Babu: తీవ్ర విషాదంలో టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు.. ఒకే ఏడాది ముగ్గురు కుటుంబ సభ్యులను కోల్పోయి..

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!