Tollywood: 'అమ్మో ఆగ‌స్టు ఒక‌టో తేదీ'నా అంటున్న సినీ కార్మికులు!.. బంద్‌తోనే స‌మ‌స్య‌లు ప‌రిష్కారం - నిర్మాత‌లు

Updated on Jul 27, 2022 01:47 PM IST
Tollywood: ఆగ‌స్టు 1 తేదీ నుంచి సినిమా షూటింగ్స్ బంద్ కావ‌డంతో అగ్ర హీరోల సినిమాలు షూటింగ్‌కు బ్రేక్ ప‌డ‌నుంది. 
Tollywood: ఆగ‌స్టు 1 తేదీ నుంచి సినిమా షూటింగ్స్ బంద్ కావ‌డంతో అగ్ర హీరోల సినిమాలు షూటింగ్‌కు బ్రేక్ ప‌డ‌నుంది. 

Tollywood: తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 1 తేదీ నుంచి సినిమా చిత్రీకరణలను తాత్కాలికంగా బంద్ చేయాలని నిర్ణ‌యించింది. సినిమా రంగంలోని ప‌లు స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించనుంది. ఓటీటీలో రిలీజ్ చేసే సినిమా స‌మ‌స్య‌ల‌పై కూడా చ‌ర్చించ‌నుంది. భారీ బడ్జెట్‌ సినిమాలు థియేటర్‌లో రిలీజైన 10 వారాల తర్వాత ఓటీటీలో విడుదల చేయాలని భావిస్తుంది. అదే చిన్న బ‌డ్జెట్ సినిమాలైతే నాలుగు వారాల త‌ర్వాత ఓటీటీలో రిలీజ్‌కు అనుమ‌తి ఉంద‌ని తేల్చి చెప్పింది. ఆగ‌స్టు 1 తేదీ నుంచి సినిమా షూటింగ్స్ బంద్ కావ‌డంతో అగ్ర హీరోల సినిమాలు షూటింగ్‌కు బ్రేక్ ప‌డ‌నుంది. 

బంద్ ఎఫెక్ట్ అయ్యే సినిమాల వివ‌రాలు

  • గాడ్ ఫాద‌ర్ - చిరంజీవి (Chiranjeevi)
  • వాల్తేరు వీర‌య్య - చిరంజీవి
  • హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు - ప‌వ‌న్ క‌ల్యాణ్
  • భోళా శంక‌ర్ - చిరంజీవి
  • భవదీయుడు భగత్‌ సింగ్ - ప‌వ‌న్ క‌ల్యాణ్
  • ఎన్‌బీకే 107 - బాల‌కృష్ణ‌ 
  • ఆర్‌సీ 15 - రామ్ చ‌ర‌ణ్ (Ram Charan)
  • వార‌సుడు - విజ‌య్
  • ఖుషీ - విజ‌య్ దేవ‌ర‌కొండ‌
  • య‌శోద - స‌మంత‌
  • ఏజెంట్ - అక్కినేని అఖిల్
  • పుష్ప 2- అల్లు అర్జున్
  • ఎస్ఎస్ఎంబి 28 - మ‌హేష్ బాబు
  • ఎన్టీఆర్ 30 - ఎన్టీఆర్

నిర్మాత‌ల స‌మ‌స్య‌లు తెలుసుకోవాలి

Tollywood: సినిమా షూటింగ్‌లు ఆపేస్తేనే త‌ప్ప స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కావ‌ని నిర్మాత‌లు బ‌లంగా న‌మ్ముతున్నారు. త‌మ బాధ 24 విభాగాల‌కూ అర్థం అవ‌తుంద‌ని అంటున్నారు. ఆదాయ మార్గాలు త‌గ్గితే త‌మ వేత‌నం త‌గ్గేంచే బ‌దులుగా హీరో, ద‌ర్శకుల వేత‌నాలు త‌గ్గించాల‌ని సినీ కార్మికులు అంటున్నారు. రోజు వారి వేత‌నాల‌పై ఆధార‌ప‌డే తాము షూటింగ్‌లకు బంద్ ప్ర‌క‌టిస్తే ఎలా బ్ర‌తాక‌ల‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

Read More : Ginna: నాన్న‌ కోసం స్నేహ గీతం పాడిన మంచు అరియానా, వివియానాలు

 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!