Ginna: నాన్న కోసం స్నేహ గీతం పాడిన మంచు అరియానా, వివియానాలు
Ginna: మంచు విష్ణు (Vishnu Manchu) హీరోగా నటిస్తున్న సినిమా ‘జిన్నా’ నుంచి మేకర్స్ లేటెస్ట్ అప్‌డేట్ రిలీజ్ చేశారు. మంచు విష్ణు కూతుళ్లు ఓ పాటను ఆలపించారు. స్నేహంపై సాగిన పాటను అరియానా, వివియానాలు అద్భుతంగా ఆలపించారు. జిన్నా నుంచి ఇది స్నేహం అనే పాటను మేకర్స్ రిలీజ్ చేశారు. జిన్నా సినిమాలో సన్నీలియోన్, పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
నాన్న సినిమా కోసం
Ginna: మంచు విష్ణు హీరోగా నటిస్తున్న జిన్నా సినిమాను 4 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈషాన్ సూర్య దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. మంచు విష్ణు కూతుళ్లు అరియానా, వివియానా జిన్నా సినిమాలో స్నేహంపైన సాగే పాటను పాడారు. ‘ఇది స్నేహం’ అంటూ సాగిన ఆ పాటకు భాస్కర పట్ల లిరిక్స్ అందించారు. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించారు. మంచు విష్ణు కూతుళ్లు మొదటి సారి వాళ్ల నాన్న సినిమా కోసం పాట పాడారు. ఈ పాట సినిమాలో హైలెట్‌గా నిలుస్తుందట.
Ginna: మంచు మోహన్‌బాబు ఆశీస్సులతో అవ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై జిన్నా సినిమాను నిర్మిస్తున్నారు. తన మనువరాళ్లు అరియానా, వివియానాల పాట ఎంతో బాగుందంటూ మంచు మోహన్ బాబు ట్వీట్ చేశారు. మంచు లక్ష్మీ కూడా తన మేనకోడళ్లు అద్భుతంగా పాటను పాడటం గర్వంగా ఉందని.. అందరూ ఆ చిన్నారులను ఆశీర్వదించాని కోరారు.
Read More : 'మా' ప్రెసిడెంట్ అయితే, సినిమాలలో నటించకూడదని రాజ్యాంగంలో రాసి ఉందా ? : మంచు విష్ణు (Manchu Vishnu)