Pushpa Movie: దేశవ్యాప్తంగా ఇంకా తగ్గని 'పుష్ప' మేనియా.. WWE వేదికపై అల్లు అర్జున్ డైలాగ్.. వీడియో వైరల్!

Updated on Jul 03, 2022 03:40 PM IST
అల్లు అర్జున్, రెజ్లర్‌ సౌరవ్ గుర్జార్ (Sourav Gurjar, Allu Arjun)
అల్లు అర్జున్, రెజ్లర్‌ సౌరవ్ గుర్జార్ (Sourav Gurjar, Allu Arjun)

టాలీవుడ్ లో గతేడాది డిసెంబర్‌లో విడుదలైన 'పుష్ప' (Pushpa Movie) సినిమా ఒక్కసారిగా ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీని తనవైపు తిప్పుకుంది. దేశ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. దీంతో నిర్మాతలు భారీగా గడించారు. విడుదలైన అన్ని భాషల్లోనూ రికార్డు కలెక్షన్స్ నమోదు చేసి అల్లు అర్జున్ ను పాన్ ఇండియా స్టార్ ను చేసేసింది. 

'పుష్ప' (Pushpa Movie) సినిమా వసూళ్ల విషయంలో ఎంతటి ఘన విజయాన్ని దక్కించుకుందో ఆ సినిమాలోని డైలాగ్‌ అదే స్థాయిలో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా హీరో అల్లు అర్జున్‌ (Allu Arjun) రాయలసీమ యాసలో మాట్లాడిన స్టైల్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఎర్రచందన స్మగ్లర్ గా, పక్కా మాస్ గెటప్ తో అదరగొట్టిన బన్నీ.. ఈ సినిమాలో చెప్పిన తగ్గేదేలే డైలాగ్‌ దేశవ్యాప్తంగా పాపులరై పోయింది. గెడ్డం కింద చెయ్యిపెడుతూ.. బన్నీ స్టెప్స్ ను అనుకరిస్తూ..  యూత్ ఊగిపోయారు. కేవలం తెలుగులోనే కాకుండా హిందీతో పాటు ఇతర భాషల్లో కూడా డైలాగ్‌లు తెగ ఆకట్టుకున్నాయి. 

అంతేకాదు.. రాజకీయ నాయకులు సైతం ఎన్నికల ప్రచారంలో పుష్ప డైలాగులు చెప్పడం మొదలు పెట్టారు. ఇటీవల ఓ నేపాల్‌ మహిళా క్రికెటర్ సీతా రానా వికెట్‌ తీసి పుష్ప స్టైల్‌ లో సెలబ్రేట్‌ చేసుకుంది. ప్రముఖ క్రికెటర్స్ సైతం తగ్గేదేలే అనే మ్యానరిజంతో పుష్ప పాత్రకి బోలెడంత ప్రచారం కల్పించారు. ఇప్పుడది మరో క్రీడకు కూడా పాకింది. ఈ సారి ఆ డైలాగ్  WWE వేదికపై మారుమోగింది. ‘తగ్గేదేలా’ అనే ఒక్క డైలాగ్‌ ఇండియాను ఒక్కసారిగా షేక్‌ చేసింది. 

ప్రముఖ ఇండియన్ రెజ్లర్‌ సౌరవ్ గుర్జార్ (Sourav Gurjar) WWEలో పుష్ప మేనియాతో రచ్చ చేశాడు. ప్రత్యర్థిని ఎత్తి పడేసి.. తగ్గేదేలే అంటూ పుష్ప మేనరిజం చూపించాడు. ప్రస్తుతం సౌరవ్‌ గుజ్లర్‌ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. ఈ వీడియోని ప్రస్తుతం అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ తెగ్‌ షేర్‌ చేస్తున్నారు. అంతేకాకుండా అల్లుఅర్జున్ క్రేజ్‌ రోజురోజుకీ పెరుగుతూనే ఉంది అంటూ కామెంట్‌ చేస్తున్నారు. పుష్ప క్రేజ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందో ఈషో చూస్తే అర్ధమవుతుంది. 

Read More: Allu Arjun: అల్లు అర్జున్‌తో ఫైట్ చేయ‌నున్న విజ‌య్ సేతుప‌తి!.. విక్ర‌మ్ ఫార్మూలాతో పుష్ప 2నా?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!