Naga Chaitanya: నాగచైతన్య నిజంగా జెంటిల్ మెన్.. రాశీ ఖన్నా ప్రశంసలు.. ఇంతకీ ఏం జరిగిందంటే?
Naga Chaitanya: సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత అక్కినేని నాగచైతన్య వరుస చిత్రాలతో బిజీ అవుతున్నారు. చైతు పూర్తిగా తన వర్క్ ఫై ఫోకస్ పెట్టాడు. కాగా, చైతు చివరగా లవ్ స్టోరీ, బంగార్రాజు చిత్రాలతో విజయాలు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇకపై కూడా విజయ పరంపర కొనసాగించాలని చూస్తున్నారు.
ప్రస్తుతం నాగ చైతన్య నటిస్తున్న తాజా చిత్రం 'థాంక్యూ'. మనం ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చైతు నటిస్తున్న చిత్రం ఇది. ఈ మూవీలో చైతూకి జోడిగా రాశీ ఖన్నా నటిస్తోంది. ఈ సినిమాని జూలై 8 న విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు ప్రకటించారు కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాని జూలై 22 కి వాయిదా వేశారు.
ఈ క్రమంలోనే వచ్చే నెల రెండవ వారం నుంచి ప్రమోషన్ కార్యక్రమాలను మొదలు పెట్టనున్నారు. ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా వీరిద్దరు ప్రమోషన్ షూట్ కోసం సిద్ధమవుతున్న నేపథ్యంలో రాశిఖన్నా (Raashi Khanna) నాగచైతన్య మధ్య ఒక ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. ఈ విషయాన్ని హీరోయిన్ రాశి కన్నా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు నాగచైతన్య జెంటిల్ మెన్ అంటూ ఆయన పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
అసలు ఇంతకీ ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ప్రమోషన్స్ షూట్ (Thankyou Movie Promotions) లో భాగంగా ఫోటో షూట్ చేస్తున్నారు. రాశి ఖన్నా నాలుగు అంగుళాలు పొడవు ఉండే హీల్స్ ధరించింది. దీనితో షూట్ లో రాశి చై కంటే కొంచెం పొడవుగా కనిపిస్తోంది. నాగ చైతన్య హైట్ ని మ్యాచ్ చేసేందుకు రాశి ఖన్నా కొంచెం బెండ్ అవుతూ ఇబ్బంది పడుతూ కనిపించింది. దీనితో చైతు 'నువ్వు నార్మల్ గానే ఉండు.. బెండ్ కావాల్సిన అవసరం లేదు' అనూ రాశి ఖన్నాకి చెప్పాడు. ఈ వీడియో రాశి ఖన్నా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. నాగ చైతన్య నిజమైన జెంటిల్ మాన్ అని ప్రశంసలు కురిపించింది.
దీంతో నాగ చైతన్య అభిమానులు ఈ వీడియోని వైరల్ చేస్తున్నారు. ఎంతోమంది దట్ ఈజ్ నాగచైతన్య అంటూ ఆయన వ్యక్తిత్వం పై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా, "ఊహలు గుసగుసలాడే" సినిమాతో ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం అయిన హాట్ బ్యూటీ రాశిఖన్నా ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉంది.
ఈమధ్యనే "వెంకీ మామ" సినిమాలో కనిపించిన ఈ భామ తాజాగా ఇప్పుడు గోపీచంద్ సరసన "పక్కా కమర్షియల్" (Pakka Commercial Movie) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.