Sita Ramam Teaser: 'యుద్ధం రాసిన ఈ ప్రేమకథలో ఇద్దరు ప్రేమికులు'.. 'సీతారామం' టీజర్!

Updated on Jun 26, 2022 03:05 PM IST
'సీతారామం' మూవీ పోస్టర్స్ (Sita Ramam Movie Posters)
'సీతారామం' మూవీ పోస్టర్స్ (Sita Ramam Movie Posters)

Sita Ramam Teaser: దుల్కర్ సల్మాన్.. తెలుగు వారికి ఈ పేరును ప్రత్యేకంగా ఇప్పుడు పరిచయం చేయాల్సిన అక్కర లేదు. కీర్తి సురేష్ 'మ‌హాన‌టి' సినిమాతో టాలీవుడ్ లోకి ఆరంగేట్రం చేసిన దుల్కార్ స‌ల్మాన్.. హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో రెండ‌వ తెలుగు సినిమా చేస్తున్నాడు. తాజాగా దుల్కర్ సీతారామంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. 

‘అందాల రాక్షసి’ సినిమాతో దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే మంచి విజయాన్ని అందుకున్నాడు (Hanu Raghavapudi) హను రాఘవపూడి. ‘కృష్ణగాడి వీర ప్రేమగాధ’ సినిమాతో మరో విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత ‘లై’ సినిమా తెరకెక్కించాడు. నాలుగో సినిమా ‘పడి పడి లేచే మనసు’. ఇప్పుడు తాజాగా ‘సీతారామం’ అంటున్నాడు హను రాఘవపూడి. 

దుల్కర్ సల్మాన్ (Dulquer Salman), మృణాల్ ఠాకూర్ జంటగా ఈ 'సీతారామం' అనే రొమాంటిక్ వార్ మూవీ తెరకెక్కుతోంది. టైటిట్ అనౌన్స్‌మెంట్ ద‌గ్గ‌రి నుంచి పాజిటివ్ వైబ్స్ మూట‌గ‌ట్టుకున్న ఈ సినిమా నుంచి తాజాగా ఓ టీజ‌ర్ వ‌చ్చింది. ఎవ్వ‌రూ లేని రామ్ అనే ఓ ఒంట‌రి ఐనికుడు, అత‌ని ప‌డే సీత అనే అమ్మాయి చుట్టూ ఓ అంద‌మైన ప్రేమ‌క‌థ‌గా ఈ సినిమా సాగ‌నున్న‌ట్టు టీజ‌ర్ ని బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది. క‌నుల విందుగా ఉన్న దృశ్యాలు మ‌న‌సుల్ని క‌ట్టిప‌డేసే ఆ డైలాగులు వింటే ఎవ‌రైనా ఫిదా అవ్వాల్సిందే.

1965 బ్యాక్ డ్రాప్ తో రోహిణి వాయిస్‌ ఓవర్‌ తో టీజర్ ప్రారంభమౌతుంది. సైనికుడు రామ్ గురించి చెబుతుంది. కుటుంబం ఉండదు. తన సహోద్యోగులతో సమయాన్ని ఆస్వాదిస్తూ ఉంటాడు. ఇంతలో సడెన్ గా లెటర్ అందుకుంటాడు. అది సీతా మహాలక్ష్మి అనే అమ్మాయి రాసిన లెటర్. అందులో ఆమె, తనను తాను రామ్ భార్యగా చెప్పుకుంటుంది. దీంతో రామ్, ఓ అందమైన ప్రపంచంలోకి అడుగుపెడతాడు. ఇక టీజర్ లో హీరోయిన్ మృణాల్ ను (Mrunal Thakur) అందంగా ప్రజెంట్ చేశారు.

కాగా.. అశ్వినీదత్ (Producer Ashwini Dutt), ప్రియాంక దత్ నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ తాజాగా విడుదలైంది. యుద్ధం రాసిన ఈ ప్రేమకథలో ఇద్దరు ప్రేమికులు, తమ అందమైన ప్రపంచంలో ఆస్వాదిస్తున్నట్టు టీజర్ లో చూపించారు. హను రాఘవపూడి ఇలాంటి సన్నివేశాలు తీయడంలో స్పెషలిస్ట్. ఆయన చేసిన మ్యాజిక్ టీజర్ లో స్పష్టంగా కనిపిస్తోంది. వైజయంతి మూవీస్ స్వప్న మూవీస్ బ్యానర్ పై నిర్మాత మవుతుంది ఈ సినిమాను ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానున్నది. తెలుగు తమిళం, మలయాళం భాషల్లో ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. కాశ్మీర్ అందాలు, ఆహ్లాకరమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్.. ఇవన్నీ సినిమాపై అంచనాల్ని పెంచేస్తున్నాయి. 

Read More: My Dear Bootham: కొత్త అవతారంలో ప్రభుదేవా.. 'మై డియర్ భూతం' ఫస్ట్ లుక్ పోస్టర్!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!