అనుదీప్ కెవి (Anudeep KV)-శివ కార్తికేయన్ కాంబోలో 'ప్రిన్స్' (Prince).. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా ట్రైలర్

Updated on Oct 09, 2022 09:33 PM IST
నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) సోషల్ మీడియా వేదికగా 'ప్రిన్స్' సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు.
నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) సోషల్ మీడియా వేదికగా 'ప్రిన్స్' సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు.

'జాతిరత్నాలు' ఫేమ్ అనుదీప్ కెవి దర్శకత్వంలో కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ (Sivakarthikeyan) నటిస్తున్న తెలుగు,తమిళ ద్విభాషా చిత్రం 'ప్రిన్స్' (Prince). ఈ చిత్రంలో ఉక్రెయిన్ భామ మరియా ర్యాబోషప్క హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ సినిమా ద్వారా ఆమె తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అవుతోంది. 

దీపావళి సందర్భంగా ఈ నెల 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) సోషల్ మీడియా వేదికగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు.

'కులం, మతం కోసం ఇంకా కొట్టుకుంటున్నారేంట్రా.. మ‌నంద‌రికీ ఒక‌టే ర‌క్తం రా' అని సత్యరాజ్ (Satya Raj) చెప్పే సంభాషణతో ప్రారంభమైన ట్రైలర్ ఆసక్తిగా మారింది. ‘ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనే దాన్ని నేను సరిగ్గా పాటించాను. అందుకే బ్రిటిష్ అమ్మాయిని ప్రేమించాను.’, ‘ఇలాంటి సంఘటనలు ఇంతకు ముందు చాలా జరిగాయి. కానీ ఇదే మొదటిసారి.’ అంటూ అనుదీప్ మార్కు డైలాగులతో ప్రిన్స్ ట్రైలర్‌ను (Prince Trailer) నింపేశారు.

ఒక భారతీయ కుర్రాడు, వేరే దేశానికి చెందిన అమ్మాయిని ప్రేమించడం వల్ల జరిగే సమస్యలను ఈ సినిమాలో ఫన్నీగా చూపించారు. శివ కార్తికేయన్ (Sivakarthikeyan), మరియా ర్యాబోషప్క ఇద్దరూ ఒక పాఠశాలలో టీచర్లుగా పనిచేస్తుంటారు. శివకార్తికేయన్ తండ్రిగా సత్యరాజ్ ఈ సినిమాలో సంఘసంస్కర్త గా నటించారు. అనుదీప్ కెవి (Anudeep KV) విభిన్నమైన రొమాంటిక్ కామెడీ ను ఎంచుకొని దానిని తనదైన శైలిలో వివరించాడు. ఆయనకు ఇది రెండో చిత్రం కావడం విశేషం.

కాగా, ఈ సినిమాను (Prince Movie) శ్రీ వెంకటేశ్వర సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. శాంతి టాకీస్ నిర్మాణ భాగస్వామిగా ఉంది. నారాయణ్ దాస్ కె. నారంగ్, సురేష్ బాబు, పుస్కూర్ రామ్ మోహన్ రావు ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరించారు.

Read More: లోకనాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) నటించిన ‘విక్రమ్’ (Vikram) సినిమాకు అరుదైన అవకాశం..!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!