వైట్ డ్రెస్ లో అందాల ప్రదర్శన చేస్తూ అదరగొట్టిన 'ఆచార్య' ఐటమ్ బ్యూటీ రెజీనా కసాండ్ర (Regina Cassandra)..!

Published on Aug 30, 2022 11:08 AM IST

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ రెజీనా కసాండ్ర (Regina Cassandra).. సుధీర్ బాబు సరసన SMS(శివ మనసులో శ్రుతి) చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకెళ్లింది.

ప్రస్తుతం రెజీనా కసాండ్ర తమిళ్, తెలుగు, కన్నడ భాషల్లో చిత్రాల్లో నటిస్తోంది. ఇన్నాళ్లు టాలీవుడ్ యంగ్ హీరోలతో కలిసి నటించిన రెజీనా..ఇటీవల టాలీవుడ్ సీనియర్ హీరో..మెగాస్టార్ చిరంజీవితోనూ (Megastar Chiranjeevi) కలిసి నర్తించింది. 

చిరంజీవి, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఆచార్య’ (Acharya)లో స్పెషల్ సాంగ్ చేసింది రెజీనా. ‘సానా కష్టం వచ్చిందే మందాకిని’ అంటూ సాగే ఈ పాటలో చిరుకు పోటీగా స్టెప్పులేసి అదరగొట్టింది రెజీనా కసాండ్ర. 

ఇదిలా ఉంటే.. తాజాగా లైట్ వైట్ కలర్‌ డ్రెస్‌ లో అదరగొట్టింది రెజీనా (Regina Cassandra). ఆ ఫొటోల్లో తన ఎద అందాలను చూపిస్తూ.. మత్తెక్కిస్తోంది ఈ బ్యూటీ. ఈ ఫొటోలు చూసి నెటిజన్లు రెజీనా ప్యాంట్ వేసుకోవడం మరిచిపోయిందా? అని కామెంట్లు చేస్తున్నారు.

కాగా, రెజీనా తాజాగా నివేదా థామస్ (Niveda Thomas) తో కలిసి నటించిన మూవీ 'శాకిని–డాకిని'. పోలీస్ అకాడమీలోకి శిక్షణ కోసం ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు యువతులు తమ చిల్లర పనులు, అల్లరితో ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నారు లాంటి ఆసక్తికరమైన అంశాలతో ఈ సినిమా తెరకెక్కింది.

అటు నివేదా గానీ, ఇటు రెజీనా గానీ చేయని ఓ కొత్త పాత్రల్లో కనిపించబోతున్నారు. సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్న శాకిని–డాకిని (Shakini Dakini) చిత్రం కొరియన్ సూపర్ హిట్ మూవీ ‘మిడ్ నైట్ రన్నర్స్’ ఆధారంగా రీమేక్ అవుతోంది.

Read More: Regina Cassandra: టాలీవుడ్ హీరోయిన్ రెజీనా కసాండ్రా తాజా సినిమా విశేషాలివే..!