Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో భీష్మ డైరెక్టర్ సినిమా.. రూమర్స్ పై క్లారిటీ ఇదే!

Updated on Jun 03, 2022 02:33 PM IST
మెగాస్టార్ చిరంజీవితో వెంకీ కుడుముల (Megastar Chiranjeevi with Venky Kudumula)
మెగాస్టార్ చిరంజీవితో వెంకీ కుడుముల (Megastar Chiranjeevi with Venky Kudumula)

Megastar Chiranjeevi: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇటీవల ‘ఆచార్య’ సినిమాతో అలరించిన సంగతి తెలిసిందే. అయితే, ఆచార్య సినిమా పూర్తి చేయడం కోసం చిరంజీవి చాలా టైం తీసుకున్నాడు. దీంతో ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి మెగాస్టార్ చకచకా సినిమాలు ఒప్పేసుకున్నారు. ప్రస్తుతం ఆయన ఓకే చేసిన నాలుగు సినిమాలలో దర్శకుడు వెంకీ కుడుముల సినిమా కూడా ఒకటి. యంగ్ హీరోలు నాగశౌర్య, నితిన్ లతో ఛలో,  భీష్మ వంటి చిత్రాలను తెరకెక్కించి ఘన విజయాలందుకున్నాడు. 

కాగా, ఈ యువ దర్శకుడు మెగాస్టార్‌ చిరంజీవికి పెద్ద ఫ్యాన్. ఆ అభిమానంతోనే ఓ కథ రెడీ చేసి చిరును కలవడం, ఆయన ఓకే చెప్పడం జరిగిపోయాయి. గతేడాదే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అయితే ‘ఆచార్య’ (Acharya) డిజాస్టర్ కావడంతో ఆత్మరక్షణలో పడ్డ చిరు.. తన ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయంలో అప్రమత్తం అయ్యాడు. స్క్రిప్టు ద్గగర రాజీ పడట్లేదని, ఈ క్రమంలోనే వెంకీ కుడుముల స్క్రిప్టు సంతృప్తికరంగా రాకపోవడంతో ఆ చిత్రాన్ని క్యాన్సిల్ చేస్తున్నాడని ఇటీవల జోరుగా ప్రచారం జరిగింది. దీని గురించి ఇటు చిరు సన్నిహిత వర్గాలు కానీ, వెంకీ వైపు నుంచి కానీ ఎలాంటి క్లారిటీ రాలేదు.

అయితే, వెంకీ కుడుముల (Venky Kudumula) టీం మాత్రం ఆ వార్తల్ని ఖండించింది. అదే సమయంలో ఒక హింట్ కూడా ఇచ్చింది. ఈ సినిమా స్క్రిప్ట్ ఇంకా చిరుకి వినిపించలేదట. ఒకవేళ చిరు విని ఓకే చేయకపోతే.. తర్వాతి ప్రణాళికలు వేరే ఉన్నాయంటూ చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో మళ్ళీ అనుమానాలు మొదలయ్యాయి. చిరంజీవికి స్క్రిప్ట్ నచ్చకపోతే ఆల్టర్నేట్ గా వేరే ఆప్షన్స్ ఉన్నాయని వారు అంటున్నారంటే ఒప్పుకున్నట్టే.! అందుకే మళ్ళీ ఈ ప్రాజెక్టు డౌట్ అనే కామెంట్స్ వినిపించాయి. 

మెగాస్టార్ చిరంజీవితో వెంకీ కుడుముల (Megastar Chiranjeevi with Venky Kudumula)

అయితే, తాజాగా వెంకీ కుడుముల మాత్రం ఆ ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పెట్టేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రచారాన్ని ఆయన నేరుగా ఖండించలేదు కానీ.. పరోక్షంగా ఈ రూమర్లకు చెక్ పెట్టేశాడు వెంకీ కుడుముల.  తాజాగా ‘విక్రమ్’ మూవీ ప్రమోషన్లలో భాగంగా అతను లోక నాయకుడు కమల్ హాసన్ (Kamal Hassan) ను ఇంటర్వ్యూ చేశాడు. ఈ నేపథ్యంలో వెంకీ ఇప్పటికే రెండు సినిమాలు చేశానని నెక్స్ట్ సినిమా చిరంజీవి గారితో ఓ చేస్తున్నాను అంటూ కమల్ కు తనను తాను పరిచయం చేసుకున్నాడు. కాబట్టి చిరుతో తన నెక్స్ట్ సినిమా ఫిక్స్ అని వెంకీ పరోక్షంగా కాన్ఫిడెంట్ గా చెప్పినట్టే..!

‘విక్రమ్’ దర్శకుడు లోకేష్ కనగరాజ్ (Lokesh Kanakaraj) సైతం కమల్‌కు పెద్ద ఫ్యాన్. ఒక అభిమాని అయితేనే తన హీరోను తెరపై ఎలా ప్రెజెంట్ చేయాలో తెలుస్తుందని చెబుతూ లోకేష్‌ను కొనియాడిన వెంకీ.. తాను కూడా చిరును ది బెస్ట్‌గా చూపించే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పాడు. మద్యలో కమల్ జోక్యం చేసుకుని.. కేవలం అభిమాని అయితే సరిపోదని.. తమ ఫేవరెట్ హీరో ఫిల్మోగ్రఫీ అంతా చూసి వాళ్లకు అత్యధికంగా పేరు తెచ్చిన సినిమా ఏదో చూడాలని.. చిరును బాలచందర్ ఆర్ట్ తరహా సినిమాలో అద్భుతంగా చూపించారని, అలాగే రాఘవేంద్రరావు కమర్షియల్ సినిమాల్లో గొప్పగా ప్రెజెంట్ చేశారని.. ఈ రెండు తరహా చిత్రాలను బ్యాలెన్స్ చేస్తూ చిరుతో సినిమా తీయాలని అభిప్రాయపడ్డారు. కచ్చితంగా ఆ ప్రయత్నం చేస్తానంటూ వెంకీ కుడుముల చిరుతో తన ప్రాజెక్ట్ పక్కా అనే విషయాన్ని చెప్పకనే చెప్పాడు.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!