'భగవద్గీత సారాంశం నుంచి గీతా ఆర్ట్స్ (Geetha Arts) కు ఆ పేరు" : మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ (Allu Aravind)!

Updated on Oct 19, 2022 11:05 AM IST
గీతా ఆర్ట్స్ (Geetha Arts) బ్యానర్‌కు 'గీతా' అనే పెట్టింది.. మా నాన్న అల్లు రామలింగయ్య గారు.
గీతా ఆర్ట్స్ (Geetha Arts) బ్యానర్‌కు 'గీతా' అనే పెట్టింది.. మా నాన్న అల్లు రామలింగయ్య గారు.

గీతా ఆర్ట్స్ (Geetha Arts).. టాలీవుడ్ లో ఈ నిర్మాణ సంస్థ గురించి తెలియని వారుండరు. తెలుగు ఇండస్ట్రీలోనే ఓ అగ్ర నిర్మాణ సంస్థ. ఈ బ్యానర్ పై ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించి సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా గుర్తింపు పొందారు మెగా నిర్మాత అల్లు అరవింద్. మెగా మూవీస్ అన్నీ దాదాపు ఆ నిర్మాణ సంస్థలోనే విడుదలవుతుంటాయి. మంచి చిత్రాలను నిర్మించే సంస్థగా గీతా ఆర్ట్స్‌కు చిత్ర పరిశ్రమలో పేరుంది. 

ప్రముఖ హాస్య నటుడు అల్లు రామలింగయ్య (Allu Ramalaingaiah) కుమారుడిగా కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన అల్లు అరవింద్.. 1974లో గీతా ఆర్ట్స్ బ్యానర్ స్థాపించి నిర్మాత అయ్యారు. ఇప్పటికీ నిర్మాతగా, స్టూడియో అధినేతగా, డిస్ట్రిబ్యూటర్‌గా, ఆహా ఓటీటీ అధినేతగా అప్రతిహతంగా తన కెరీర్ కొనసాగిస్తున్నారు. నాటి నుంచి నేటి వరకు ఎందరో హీరోలకు లైఫ్ ఇచ్చింది ఈ నిర్మాణ సంస్థ. 

అయితే గీతా ఆర్ట్స్ అనే పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చిందని చాలా మందిలో డౌట్ ఉండే ఉంటుంది. ఎందుకంటే గీతా అన్న పేరుతో అల్లు ఫ్యామిలిలో ఎవ్వరు లేరు. మరి ఈ గీతా ఎవరు అన్నా కుతూహలం ఎందరికో ఉంది. అయితే తాజాగా ఈ డౌట్ పై స్వయంగా గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ (Allu Aravind) క్లారిటీ ఇచ్చాడు. 

గీతా ఆర్ట్స్ (Geetha Arts) బ్యానర్‌కు 'గీతా' అనే పెట్టింది.. మా నాన్న అల్లు రామలింగయ్య గారు. భగవద్గీతలోంచి గీత అనే పదాన్ని తీసుకొని ఈ బ్యానర్‌కు ఈ పేరు పెట్టినట్టు చెప్పారు. గీతలో చెప్పినట్టు పని చేయడమే మన వంతు. ఫలితం మన చేతిలో ఉండదు. ఇది సినిమాలకు సరిగ్గా సెట్ అవుతుంది. నిర్మాతగా మన ప్రయత్నం మనము చేయడమే.. ఫలితం ప్రేక్షక దేవుళ్ల చేతిలో ఉంటుంది. అందుకే తమ బ్యానర్‌కు గీతా ఆర్ట్స్ పేరు పెట్టినట్టు చెప్పుకొచ్చారు. 

"ప్రయత్నం మాత్రం మనది.. కానీ ఫలితం మాత్రం మనచేతిలో ఉండదు అనేది గీత చెబుతుంది. అదే చిత్ర నిర్మాతకు కూడా వర్తిస్తుంది. ఎంతో కష్టపడి సినిమాలు తీస్తారు. పెట్టుబడి పెడతారు. కానీ ఫలితం ఆడియన్స్ చేతిలో ఉంటుంది. నచ్చితే హిట్ చేస్తారు. లేదంటే ఫట్.. పెట్టిన పెట్టుబడి కూడా రాదు ఒక్కోసారి. అదృష్టం బావుంటే దానికి డబుల్ కూడా వస్తుంది" అందుకే ఆయన ఆ పేరు పెట్టారు అని అరవింద్ (Allu Aravind వివరించారు. 

Read More: అల్లు అర్జున్ (Allu Arjun), రామ్ చరణ్ (Ram Charan) కాంబోలో సినిమా ప్లానింగ్ చేస్తున్న అగ్ర నిర్మాత ఎవరంటే..!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!