సందీప్ కిషన్ (Sundeep Kishan) తొలి పాన్ ఇండియా మూవీ 'మైఖేల్' (Michael) నుంచి రొమాంటిక్ పోస్టర్ రిలీజ్.. వైరల్!

Updated on Oct 15, 2022 03:40 PM IST
'మైఖేల్' పోస్టర్ లో దివ్యాంక కౌశిక్ ని (Divyansha Kaushik) ఒక బైక్ మీద కూర్చోబెట్టి ఆమెతో గాఢమైన లిప్ లాక్ ఇస్తూ ఉన్నట్లుగా కనిపిస్తోంది.
'మైఖేల్' పోస్టర్ లో దివ్యాంక కౌశిక్ ని (Divyansha Kaushik) ఒక బైక్ మీద కూర్చోబెట్టి ఆమెతో గాఢమైన లిప్ లాక్ ఇస్తూ ఉన్నట్లుగా కనిపిస్తోంది.

టాలీవుడ్ యువ హీరో సందీప్ కిషన్ (Sundeep Kishan) నటిస్తున్న మొదటి పాన్ ఇండియా చిత్రం 'మైఖేల్' (Michael). ఈ సినిమాలో సందీప్‌కు జోడీగా దివ్యాంశ కౌశిక్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. రంజిత్ జయకోడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోంది. ఈ సినిమాలో తమిళ స్టార్‌ హీరో విజయ్‌ సేతుపతి కీలకపాత్రలో నటిస్తున్నాడు. 

ఇక, ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా రేంజ్ లో వచ్చే ఏడాది ప్రథమార్థంలో విడుదల చేయాలని మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. 

'మైఖేల్' (Michael Movie) చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్ ఎల్ఎల్‌పి,క‌ర‌ణ్ సి ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ల‌పై పుస్కుర్‌ రామ్‌మోహ‌న్ రావు, భ‌ర‌త్ చౌద‌రీలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమిళ నటి వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్‌, వ‌రుణ్ సందేష్ (Varun Sandesh) కీల‌క‌పాత్రల్లో న‌టిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు గౌతమ్‌ వాసుదేవ మీనన్‌ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నాడు.

ఇక ఇప్పటికే విడుదలైన సందీప్‌ (Sundeep Kishan) లుక్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. ఇదిలా ఉంటే చిత్రబృందం తాజాగా మరో క్రేజీ అప్‌డేట్‌ను ప్రకటించింది. లేటెస్ట్ అప్డేట్ లో హీరోహీరోయిన్ల మధ్య స్పైసీ కిస్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇద్దరి మద్య కెమిస్ట్రీ అద్బుతంగా కనిపిస్తుండగా.. అందులో ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఈ నెల 20న విడుదల చేయనున్నట్లు తెలిపారు.

'మైఖేల్' పోస్టర్ లో దివ్యాంక కౌశిక్ ని (Divyansha Kaushik) ఒక బైక్ మీద కూర్చోబెట్టి సందీప్ కిషన్ ఆమెతో గాఢమైన లిప్ లాక్ ఇస్తూ ఉన్నట్లుగా కనిపిస్తోంది. వీరిద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరినట్లుగా ఈ పోస్టర్ ను చూస్తే అర్థమవుతోంది.

Read More: నాగ చైతన్య (Naga Chaitanya) 'NC 22' నుంచి బిగ్ అప్డేట్స్ .. ప్రియమణి సహా భారీ తారాగణం.. అధికారిక ప్రకటన!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!