నాగార్జున(Nagarjuna) నటించిన ది ఘోస్ట్ ట్రైలర్ రివ్యూ.. యాక్షన్​తో అదరగొట్టిన కింగ్

Updated on Aug 26, 2022 06:54 PM IST
నాగార్జున(Nagarjuna) , ప్రవీణ్ సత్తారు క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ది ఘోస్ట్'.
నాగార్జున(Nagarjuna) , ప్రవీణ్ సత్తారు క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ది ఘోస్ట్'.

 నాగార్జున(Nagarjuna) హీరోగా నటిస్తున్న యాక్షన్ మూవీ ది ఘోస్ట్. ఈ సినిమా ట్రైలర్​ని మహేష్ బాబు రిలీజ్ చేశారు. నాగార్జున, ప్రవీణ్ సత్తారు క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ది ఘోస్ట్'. మునుపెన్నడూ చూడని పాత్రలో పవర్ ఫుల్ ఇంటర్‌పోల్ ఆఫీసర్‌ గా ఈ చిత్రంలో నాగార్జున కనిపించబోతున్నారు. ఇప్పటివరకు విడుదలైన 2 ప్రోమోలు - ది కిల్లింగ్ మెషిన్, తమహగనే ప్రేక్షకులని మెస్మరైజ్ చేశాయి. ఇప్పుడు ఆ అంచనాలని రెట్టింపు చేస్తూ థియేట్రికల్ ట్రైలర్‌ విడుదలైంది. మహేష్ బాబు 'ది ఘోస్ట్' ట్రైలర్‌ను విడుదల చేసి, టీమ్‌కు బెస్ట్ విషెష్ తెలిపాడు.

ట్రైలర్ ప్రధాన పాత్రలని పరిచయం చేయడంతో పాటు కథాంశంపై క్యురియాసిటీని పెంచింది. ఇంటర్‌పోల్ ఆఫీసర్ విక్రమ్ (నాగార్జున) గ్యాంగ్‌స్టర్ల నుండి ముప్పు ఉన్న తన చెల్లలు, మేనకోడలను సంరక్షిస్తానని తండ్రికి మాట ఇస్తాడు. కథాంశం, కథనం రెండూ ఆసక్తికరంగా ఉన్నాయి.

నాగార్జున(Nagarjuna) , ప్రవీణ్ సత్తారు క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ది ఘోస్ట్'.

ఏజెంట్​ విక్రమ్​గా నాగ్​..

ఫ్యామిలీ డ్రామా, ఎమోషనల్ కనెక్ట్ తో సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు ఆకట్టుకునేలా ఉంది. ప్రవీణ్ సత్తారు అందరినీ ఆకర్షించే అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉండేలా చూసుకున్నాడని ట్రైలర్ చూస్తే అర్ధమౌతుంది. కొన్ని థ్రిల్లింగ్ సన్నివేశాలతో అతని స్టైలిష్ టేకింగ్ ప్రత్యేక ఆకర్షణ.

ఏజెంట్ విక్రమ్‌గా నాగార్జున తన ఫెర్ఫార్మెన్స్ తో అదరగొట్టారు. ఆయన లుక్ బాగుంది. నాగార్జున సబార్డినేట్‌గా కనిపించిన సోనాల్ చౌహాన్ గ్లామర్ విందు పంచింది. నాగార్జున సోదరిగా గుల్ పనాగ్ నటిస్తుండగా, మేనకోడలుగా అనిఖా సురేంద్రన్ కనిపించింది. ట్రైలర్‌లో ది ఘోస్ట్ తన ప్రధాన ఆయుధం తమహగనే వాడినట్లు చూపించారు.

ట్రైలర్ లో ప్రతి బిట్ గ్రిప్పింగ్, యాక్షన్-ప్యాక్డ్ గా మునుపెన్నడూ చూడని విధంగా కనిపిస్తుంది. ఒక సీరియస్ మిషన్‌లో వున్న నాగార్జున పలికిన డైలాగ్స్ కూడా పవర్ ఫుల్ గా ఉన్నాయి. మార్క్ కె రాబిన్ సంగీతం హైలెట్ గా నిలిచింది. నాగార్జున(Nagarjuna) నటించిన ఈ సినిమా అక్టోబర్ 5న థియేటర్లలోకి రానుంది.

Read More : 'లైగర్' థియేటర్లలో నాగార్జున (Nagarjuna) 'ది ఘోస్ట్' సినిమా ట్రైలర్ హంగామా..నాగ్ ఈజ్ బ్యాక్ అంటున్న అభిమానులు!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!