The Ghost: 'ది ఘోస్ట్' షూటింగ్ పూర్తి.. నాగార్జున (Nagarjuna), సోనాల్ చౌహాన్ (Sonal) స్పెషల్ పోస్టర్ రిలీజ్!

Updated on Aug 08, 2022 08:29 PM IST
ఈ పోస్టర్ లో నాగార్జున (Nagarjuna), సోనాల్ చౌహాన్‌ (Sonal Chauhan)లు ఒక పెద్ద జీప్ దగ్గర ఇంటర్‌పోల్ అధికారులుగా కనిపిస్తున్నారు.
ఈ పోస్టర్ లో నాగార్జున (Nagarjuna), సోనాల్ చౌహాన్‌ (Sonal Chauhan)లు ఒక పెద్ద జీప్ దగ్గర ఇంటర్‌పోల్ అధికారులుగా కనిపిస్తున్నారు.

టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున (Nagarjuna), క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు (Praveen Sattaru) కాంబినేషన్‌లో రూపొందుతోన్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది ఘోస్ట్’ (The Ghost). వెంకటేశ్వర సినిమాస్, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీ లో నాగార్జున, హీరోయిన్ సోనాల్ చౌహాన్ ఇంటర్ పోల్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. 

'ది ఘోస్ట్' (The Ghost) మూవీ నుంచి విడుదలయిన ఫస్ట్ లుక్ కిల్లింగ్ మెషీన్ టీజర్ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుని సినిమాపై అంచనాలను ఏర్పరిచింది. ఇదిలా ఉంటే.. తాజాగా 'ది ఘోస్ట్' మూవీ నుంచి చిత్ర యూనిట్ ఒక అప్డేట్ ను విడుదల చేసింది. తాజాగా ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి అయినట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ వీడియోతో పాటు స్పెషల్ పోస్టర్ (The Ghost Special Poster) ను కూడా విడుదల చేసింది. చిత్ర బృందం విడుదల చేసిన ఈ పోస్టర్ లో నాగార్జున మరియు సోనాల్ చౌహాన్ ఉన్నారు.  

ఈ పోస్టర్ లో నాగార్జున, సోనాల్ చౌహాన్‌ (Sonal Chauhan)లు ఒక పెద్ద జీప్ దగ్గర ఇంటర్‌పోల్ అధికారులుగా కనిపిస్తున్నారు. ఇందులో వారి లుక్ అల్ట్రా-స్టైలిష్‌గా ఉంది. అలాగే వారి దగ్గర ఉన్న మెషీన్ గన్‌లను చూస్తుంటే భారీ యాక్షన్‌కి రెడీ అవుతున్నట్లుగా అర్థమవుతోంది. అక్టోబర్ 5న (The Ghost Release Date) భారీ స్థాయిలో రిలీజ్ కానున్న 'ది ఘోస్ట్' మూవీ తప్పకుండా అక్కినేని ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ ని కూడా ఆకట్టుకుంటుందని అంటోంది యూనిట్.

యాక్షన్ స్పై థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో గుల్ పనాగ్ (Gul Panag), అనిఖా సురేంద్రన్ (Anikha Surendran) కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఇక, ఈ చిత్రానికి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ స్పెషలిస్ట్ మార్క్ కె. రాబిన్ (Mark K Robin) సంగీతం అందిస్తున్నారు. 

Read More: The Ghost : 'ది ఘోస్ట్' మూవీ గ్లింప్స్ రిలీజ్ & కత్తులతో నాగార్జున వేట.. మీకోసమే ఈ టాప్ 5 ఆసక్తికర విషయాలు

Advertisement
Credits: Twitter

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!