నాగార్జున (Nagarjuna) హీరోగా నటిస్తున్న ‘ది ఘోస్ట్‌’ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

Updated on Aug 18, 2022 03:27 PM IST
అక్కినేని నాగార్జున (Nagarjuna) హీరోగా నటిస్తున్న ది ఘోస్ట్ సినిమా నుంచి అప్‌డేట్‌ వీడియో రిలీజ్ అయ్యింది
అక్కినేని నాగార్జున (Nagarjuna) హీరోగా నటిస్తున్న ది ఘోస్ట్ సినిమా నుంచి అప్‌డేట్‌ వీడియో రిలీజ్ అయ్యింది

అక్కినేని నాగార్జున (Nagarjuna) నటిస్తున్న కొత్త సినిమా ది ఘోస్ట్. ఈ సినిమాపై నాగ్ అభిమానులకు భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ది ఘోస్ట్‌ సినిమా పోస్టర్‌‌పై రాసిన పదాలపైనా ఆసక్తి రేకెత్తించారు మేకర్స్. అందులో రాసిన పదాల అర్ధం ఏమిటో తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఆ పదాలకు అర్ధం ఏమిటనే దానిపై క్లారిటీ ఇచ్చింది చిత్ర యూనిట్.

‘తమ హగనే’ (Tama Hagane) ఈ పదం ది ఘోస్ట్‌ సినిమా పోస్టర్‌‌పై రాసి ఉంది. గత కొన్ని రోజులుగా సినీ ప్రియులు, ముఖ్యంగా అక్కినేని అభిమానుల్ని వెంటాడుతోన్న ప్రశ్న ఇది. వినడానికి కొత్తగా ఉన్న ఈ పదానికి అర్థం ఏమిటి? నాగార్జునకు దీనికి ఉన్న సంబంధం ఏమిటి? అని అందరూ చర్చించుకొంటున్నారు. ఈ నేపథ్యంలో అభిమానులందరి ప్రశ్నలకు ఒక్క వీడియోతో ‘ది ఘోస్ట్‌’ చిత్ర బృందం సమాధానమిచ్చింది. ‘తమ హగనే’ అంటే అర్థమేమిటో చెప్పేసింది.

 నాగార్జున ప్రధాన పాత్రలో నటిస్తోన్న‘ది ఘోస్ట్‌’ సినిమా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటోంది. ప్రవీణ్‌ సత్తారు దర్శకుడు. ఈ సినిమాలో నాగార్జున ఇంటర్‌పోల్‌ ఆఫీసర్‌ విక్రమ్‌గా కనిపించనున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ చిత్రం అక్టోబర్‌ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

అక్కినేని నాగార్జున (Nagarjuna) హీరోగా నటిస్తున్న ది ఘోస్ట్ సినిమా నుంచి అప్‌డేట్‌ వీడియో రిలీజ్ అయ్యింది

అర్ధం తెలుపుతూ వీడియో..

ఈ నేపథ్యంలో ‘ది ఘోస్ట్‌’ ట్రైలర్‌ రిలీజ్‌ని తెలియజేస్తూ ఇటీవల చిత్రబృందం.. ‘తమ హగనే’ అనే పదానికి అర్థమేమిటో తెలుసుకోండి అంటూ టీజ్‌ చేసింది. అప్పటి నుంచి నెటిజన్లందరూ ఆ పదానికి సరైన సమాధానం కనిపెట్టే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే గురువారం ఉదయం ‘తమ హగనే’ అంటే ‘విలువైన ఉక్కు’ అని అర్థం చెబుతూ ‘ది ఘోస్ట్‌’ టీమ్‌ ఒక వీడియో షేర్‌ చేసింది.

ఈ వీడియోలో నాగ్‌ ఉన్న ప్రదేశాన్ని కనిపెట్టి.. ఆయనను పట్టుకోవడానికి అండర్‌వరల్డ్‌ మొత్తం అక్కడికి చేరుకున్నట్లు చూపించారు. శత్రువులు పంపిన వ్యక్తులు తనపై దాడి చేయనున్నారని తెలుసుకున్న నాగ్‌ (Nagarjuna).. తన వద్ద ఉన్న  ఉక్కుతో కత్తిని సిద్ధం చేసి యుద్ధానికి సై అన్నట్లు కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆగస్టు 25న ‘ది ఘోస్ట్‌’ ట్రైలర్‌ విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

Read More : The Ghost Movie: అక్కినేని నాగార్జున 'ది ఘోస్ట్' మూవీ గ్లింప్స్ రిలీజ్.. పాల్గొన్న నాగార్జున, చిత్ర యూనిట్!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!