Vikrant Rona Pre Release Event: 'సుదీప్‌ కన్నడ అబ్బాయి కాదు. మన తెలుగువాడే'.. అక్కినేని నాగార్జున (Nagarjuna)!

Updated on Jul 27, 2022 01:41 PM IST
'విక్రాంత్‌ రోణ' (Vikrant Rona) ప్రీ రిలీజ్ వేడుకను మంగళవారం హైదరాబాద్ లో నిర్వహించగా.. అక్కినేని నాగార్జున ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 
'విక్రాంత్‌ రోణ' (Vikrant Rona) ప్రీ రిలీజ్ వేడుకను మంగళవారం హైదరాబాద్ లో నిర్వహించగా.. అక్కినేని నాగార్జున ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

Vikrant Rona Pre Release Event: శాండల్ వుడ్ బాద్ షా కిచ్చా సుదీప్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన హీరోగా నటించిన పాన్‌ ఇండియా చిత్రం 'విక్రాంత్‌ రోణ'. అనూప్‌ భండారి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 28న హిందీతోపాటు దక్షిణాది భాషల్లోనూ విడుదల కానుంది.

ఈ సినిమా విడుదల తేది దగ్గర పడటంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ (Vikrant Rona Promotions) కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను మంగళ వారం హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యకరమానికి అక్కినేని నాగార్జున ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

'విక్రాంత్‌ రోణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగార్జున (Akkineni Nagarjuna) మాట్లాడుతూ..  "సుదీప్‌ కన్నడ అబ్బాయి కాదు. మన తెలుగువాడే. ఎప్పుడూ హైదరాబాద్‌ లోనే ఉంటాడు. భారతీయ సినీ ప్రేక్షకులందరికీ సుదీప్‌ తెలుసు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ చిత్రాల్లో నటించి మెప్పించాడు. ఇక, ఇప్పుడు 'విక్రాంత్‌ రోణ'తో ఒకేసారి అన్ని భాషల వారిని పలకరించడానికి రాబోతున్నాడు" అని అన్నారు. 

ఇక, "ఇప్పటివరకూ ఆయా చిత్రాలకు సంబంధించిన పెద్ద పెద్ద పోస్టర్లను అన్నపూర్ణ స్టూడియోస్‌లో పెడుతుంటాం. ఈ క్రమంలో ఇటీవల.. 'బాహుబలి', 'ఆర్‌ఆర్‌ఆర్‌' (RRR) సినిమాల పోస్టర్లు పెట్టాం. ట్రైలర్‌ చూసినప్పుడే 'విక్రాంత్‌ రోణ' (Vikrant Rona) కూడా ఆ జాబితాలో చేరుతుందనిపించింది. ఇతర చిత్ర పరిశ్రమల ప్రేక్షకుల గురించి నాకు తెలియదుగానీ సినిమా నచ్చితే చాలు తెలుగు ప్రేక్షకులు దాన్ని ఓ స్థాయిలో నిలబెడతారు. ఈ చిత్రం సూపర్‌ హిట్‌ అవ్వాలి" అని నాగార్జున ఆకాంక్షించారు.

హీరో కిచ్చా సుదీప్‌ (Kiccha Sudeepa) మాట్లాడుతూ.. తాను టీవీలో చూసిన తొలి తెలుగు సినిమా 'రాముడు భీముడు', ఆ తర్వాత థియేటర్‌లో చూసిన తొలి చిత్రం నాగార్జున-ఆర్జీవీ కాంబోలో వచ్చిన 'శివ' సినిమా అని చెప్పారు. తనకు భాష రాకపోయినా రెండు రోజుల్లో మూడు సార్లు చూశానని వెల్లడించారు సుదీప్‌. సైకిల్‌ చైన్‌తో మరొకరిని కొట్టొచ్చు అనే విషయం అప్పటి వరకు నాకు తెలియదు. అప్పటినుంచి దాన్నొక స్టయిల్‌గా వాడుకున్నాం.

అప్పట్లో బ్యాగ్‌లో సైకిల్‌ చైన్‌ పెట్టుకుని తిరిగే వాళ్లం అని చెప్పారు. అలాంటి నాగ్‌ సర్‌తో ఇప్పుడు స్టేజ్‌ని పంచుకోవడం ఆనందంగా ఉందని, ఒక్క ఫోన్‌ కాల్‌తో ఆయన వచ్చేందుకు రావడం చాలా హ్యాపీగా ఉందని అన్నారు. 

Read More: కిచ్చా సుదీప్ (Sudeepa) హీరోగా విక్రాంత్ రోణ.. జోరుగా ప్రమోషన్లు.. హాజరైన నాగార్జున!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!