తన మొదటి హీరోయిన్‌ను కలుసుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun).. ఫోటోలు వైరల్

Updated on Aug 22, 2022 09:48 PM IST
న్యూయార్క్‌లో అల్లు అర్జున్ (Allu Arjun), అదితి అగర్వాల్ తీసుకున్న ఫోటో
న్యూయార్క్‌లో అల్లు అర్జున్ (Allu Arjun), అదితి అగర్వాల్ తీసుకున్న ఫోటో

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్న నటుడు ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun). కొత్త కథలు, వైవిధ్యభరిత పాత్రలతో ప్రేక్షకులకు చేరువయ్యారు బన్నీ. ప్రస్తుతం పుష్ప2 సినిమాను తెరకెక్కించే పనిలో ఉన్నారు. తాజాగా పుష్ప2 సినిమా షూటింగ్ పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి.

'సరైనోడు', 'అల వైకుంఠపురంలో', 'పుష్ప' వంటి చిత్రాల్లో తనదైన నటనతో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్‌ న్యూయార్క్‌లో హాలీ డేను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ హాలీడేలో ఐకాన్ స్టార్ అనుకోని అతిథిని కలుసుకున్నారు.
 

అల్లు అర్జున్ (Allu Arjun), అదితి అగర్వాల్ నటించిన గంగోత్రి సినిమా పోస్టర్

మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ..

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన ‘గంగోత్రి’ సినిమాతో ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చారు అల్లు అర్జున్. ఈ సినిమాలో అదితి ఆగర్వాల్ హీరోయిన్‌గా నటించారు. 19 ఏళ్ల తర్వాత న్యూయార్క్‌లో ఆమెను కలుసుకున్నారు బన్నీ. అందుకు సంబంధించిన ఫొటోలను అదితి అగర్వాల్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

ఆనాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆ పిక్‌కు క్యాప్షన్ ఇచ్చారు అదితి. ‘ప్రియమైన అల్లు అర్జున్.. నా ఫస్ట్ కో స్టార్. బిగ్గెస్ట్ సూపర్‌స్టార్. గంగోత్రి రోజులు గుర్తుకు వస్తున్నాయి’ అని అదితి అగర్వాల్ పేర్కొన్నారు.

ప్రస్తుతం అదితి తన కుటుంబంతో కలిసి న్యూయార్క్‌లో నివసిస్తున్నారు. ఇక కెరీర్ విషయానికి వస్తే.. అల్లు అర్జున్ ‘పుష్ప’ లో నటించారు. ఈ సినిమా తర్వాత బన్నీ ఏ సినిమా మొదలు పెట్టలేదు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కింది పుష్ప సినిమా. రష్మికా మందాన హీరోయిన్‌గా నటించారు. పాన్ ఇండియా సినిమాగా రూపొందిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. దీంతో అల్లు అర్జున్ (Allu Arjun).   ‘పుష్ప-2’ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.  

Read More : SIIMA Awards 2022: 'సైమా' అవార్డుల‌కు అత్య‌ధిక విభాగాల్లో పోటీ ప‌డుతున్న తెలుగు సినిమాలు

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!