హాలీవుడ్‌ నుండి ఐకాన్ స్టార్​ అల్లు అర్జున్‌(Allu Arjun)కి క్రేజీ ఆఫర్.. బన్నీని కలిసిన దర్శకుడు!

Updated on Aug 26, 2022 06:11 PM IST
పుష్పతో పాన్​ఇండియా స్టార్​గా ఎదిగిన అల్లు అర్జున్​(Allu Arjun)కు మరో క్రేజీ ఆఫర్​ వచ్చిందని టాక్​
పుష్పతో పాన్​ఇండియా స్టార్​గా ఎదిగిన అల్లు అర్జున్​(Allu Arjun)కు మరో క్రేజీ ఆఫర్​ వచ్చిందని టాక్​

 ‘పుష్ప’తో పాన్​ఇండియా స్టార్​గా  ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి సొంతం చేసుకున్నారు ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ (Allu Arjun)‌. ఇందులో ఆయన నటనకు ప్రేక్షకులే కాదు దర్శక నిర్మాతలూ ఫిదా అయ్యారు. దీంతో ఆయనతో సినిమాలు చేసేందుకు చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారు. ఇదిలా ఉండగా.. తాజా సమాచారం ప్రకారం బన్నీకి హాలీవుడ్‌ నుంచి ఓ క్రేజీ ఆఫర్‌ వచ్చినట్లు తెలుస్తోంది.

‘పుష్ప’లో ఆయన నటనకు మనసు పారేసుకున్న హాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు.. బన్నీతో ఎలాగైనా సినిమా చేయాలని నిర్ణయించుకున్నారట. అందుకోసం బన్నీకి సరిపోయేలా తన కథలో ఓ పవర్‌ఫుల్‌ రోల్‌ని కూడా క్రియేట్‌ చేశారట. ఈ క్రమంలోనే ఇటీవల బన్నీ న్యూయార్క్‌ పర్యటనకు వచ్చారని తెలుసుకుని మరీ.. ఆయన్ని ప్రత్యేకంగా కలిసి.. తన సినిమా గురించి చర్చించారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే, ఈ వార్తలకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

పుష్పతో పాన్​ఇండియా స్టార్​గా ఎదిగిన అల్లు అర్జున్​(Allu Arjun)కు మరో క్రేజీ ఆఫర్​ వచ్చిందని టాక్​

‘పుష్ప 2’ పైనే దృష్టిపెట్టిన బన్ని..

బన్నీ ప్రస్తుతం ‘పుష్ప - 2’పైనే దృష్టి పెట్టారు. సుకుమార్‌ దర్శకత్వంలో ఇది తెరకెక్కనుంది. మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై రూపుదిద్దుకుంటోన్న ఈసినిమా పూజా కార్యక్రమం ఇటీవల హైదరాబాద్‌లో వేడుకగా జరిగింది. వచ్చే నెల నుంచి ఈ సినిమా రెగ్యులర్‌ షూట్‌ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కిన ‘పుష్ప.. ది రైజ్‌’కు కొనసాగింపుగా ఇది సిద్ధం కానుంది. పుష్పరాజ్‌ (అల్లు అర్జున్‌) - భన్వర్‌ సింగ్‌ శెకావత్‌కు (ఫహద్‌ ఫాజిల్‌) మధ్య వైరాన్ని ఇందులో చూపించనున్నారు. ఈ సినిమా తర్వాత బన్నీ హాలివుడ్​లో అడుగుపెడతారని టాలీవుడ్​ టాక్​. అల్లుఅర్జున్(Allu Arjun) హాలివుడ్​ ఎంట్రీపై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Read More: Allu Arjun : అల్లు అర్జున్ మరో రికార్డ్ బ్రేక్ చేశాడు .. ట్విట్టర్‌‌లో 7 మిలియన్ల ఫాలోవర్లు !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!