Ramarao On Duty: 'రామారావు ఆన్ డ్యూటీ' ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఒకే స్టేజిపై రవితేజ, నాని (Raviteja, Nani)..!

Updated on Jul 24, 2022 06:20 PM IST
'రామారావు ఆన్ డ్యూటీ' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు న్యాచుర‌ల్ స్టార్ హీరో నాని (Hero Nani) చీఫ్ గెస్టుగా రాబోతున్నాడు.
'రామారావు ఆన్ డ్యూటీ' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు న్యాచుర‌ల్ స్టార్ హీరో నాని (Hero Nani) చీఫ్ గెస్టుగా రాబోతున్నాడు.

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా పైకి ఎదిగిన వాళ్ళలో మెగాస్టార్ చిరంజీవి ముందుంటారు. ఆ తర్వాత ఎవరైనా సరే మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja), నాచురల్ స్టార్ నాని పేర్లే చెప్పేస్తారు. ఈ హీరోలిద్దరూ ఎలాంటి సపోర్ట్ లేకుండా అసిస్టెంట్ డైరెక్టర్లుగా తమ ప్రయాణాన్ని మొదలు పెట్టి స్టార్ హీరోలుగా మారారు. అలాంటి వీరు స్టార్ హీరోలియ్యాక ఇప్పటివరకు కలిసి ఒకే స్టేజిపైన కనపడలేదు. అయితే, ఇలాంటి సెల్ఫ్ మేడ్ స్టార్ హీరోలు ఒకేసారి స్టేజిపైన కనిపిస్తే ఆ కిక్కే వేరు.

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం 'రామారావు ఆన్ డ్యూటీ' (Ramarao On Duty). దివ్యాంశ కౌశిక్, ర‌జీషా విజయన్ ఈ సినిమాలో కథానాయికలుగా న‌టిస్తున్నారు. నూతన దర్శకుడు శ‌ర‌త్ మండ‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటివకే విడుద‌లైన టీజ‌ర్‌, ట్రైల‌ర్, పాట‌ల‌కు మంచి స్పంద‌న వ‌స్తోంది. 

ఎస్ఎల్‌వీ సినిమాస్‌, ఆర్‌టీ టీమ్ వ‌ర్క్స్ బ్యాన‌ర్ల‌పై నిర్మిస్తున్న 'రామారావు ఆన్ డ్యూటీ' చిత్రానికి సామ్ సీఎస్ మ్యూజిక్ డైరెక్ట‌ర్. ఇక, ఈ మూవీ జులై 29న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. నాజ‌ర్‌, త‌నికెళ్ల‌భ‌ర‌ణి, ప‌విత్ర లోకేష్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడ్డ ఈ సినిమా కోసం రవితేజ (Ravi Teja) అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్లను మొదలు పెట్టింది. 

ఇందులో భాగంగా ఈరోజు సాయంత్రం 06:30 గంటలకు హైద‌రాబాద్‌లోని జేఆర్సీ క‌న్వెన్ష‌న్ హాల్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ (Ramarao On Duty Pre Release Event) జ‌రుగ‌నుంది. ఈ ఈవెంట్‌కు న్యాచుర‌ల్ స్టార్ హీరో నాని (Hero Nani) చీఫ్ గెస్టుగా రాబోతున్నాడు. తాజా అప్‌డేట్‌తో ఇటు మాస్ మహారాజా అభిమానుల‌తోపాటు అటు నాని ఫ్యాన్స్ కూడా ఫుల్ ఎగ్జైట్‌మెంట్‌కు లోన‌వుతున్నారు. ఈ చిత్రంతో చాలా ఏళ్ల త‌ర్వాత వేణు తొట్టెంపూడి సిల్వ‌ర్ స్క్రీన్ పై మెరవ‌బోతున్నాడు.

Read More: 'రామారావు ఆన్ డ్యూటీ' నుంచి మాస్ ట్రైలర్ వచ్చేసింది.. అదరగొట్టిన రవితేజ (Raviteja)..!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!