Namitha: బేబీ బంప్‌తో హీరోయిన్ నమిత ఫొటోషూట్.. వైరల్ అవుతున్న ఫొటోలు, వీడియోలు!

Updated on Jun 28, 2022 02:19 PM IST
నమిత భర్తతో కలిసి బేబీ బంప్‌ (Baby Bump) ఫొటోషూట్‌కు ఫోజులు ఇచ్చిన ఫొటోలను సైతం ఫాలోవర్స్‌, ఫ్యాన్స్‌తో పంచుకుంది.
నమిత భర్తతో కలిసి బేబీ బంప్‌ (Baby Bump) ఫొటోషూట్‌కు ఫోజులు ఇచ్చిన ఫొటోలను సైతం ఫాలోవర్స్‌, ఫ్యాన్స్‌తో పంచుకుంది.

టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు హీరోయిన్ నమిత (Namitha) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు సినీ ఇండస్ట్రీలో సూపర్ హిట్ చిత్రాలు చేసి మంచి గుర్తింపును సొంతం చేసుకున్న హీరోయిన్లలో నమిత కూడా ఒకరు. ‘సొంతం’, ‘జెమిని’, 'బిల్లా' ‘సింహా’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు నమిత. 

'సింహా' సినిమాలో "సింహం వంటి చిన్నోడు వేటకు వచ్చాడు" అన్న పాటతో మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా, ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు నమిత. టాలీవుడ్‌లో వెంకటేష్ (Venkatesh), బాలకృష్ణ, ప్రభాస్ వంటి హీరోలతో నటించి మెప్పించిన కథానాయిక నమిత.

 

సినిమాలకు దూరమైన నమిత

కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న నమిత, త్వరలో తల్లి కాబోతున్న సంగతి తెలిసిందే. తన బర్త్‌డే రోజున (మే 10) ఈ విషయాన్ని ఆమె సోషల్‌ మీడియాలో వెల్లడించారు. అంతేకాదు, ఇటీవలే నమిత సీమంతం కూడా ఘనంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా ఆమె సోషల్ మీడియాలో షేర్‌ చేశారు.

అంతేకాదు భర్తతో కలిసి బేబీ బంప్‌ (Baby Bump) ఫొటోషూట్‌కు ఫోజులిచ్చిన చిత్రాలను సైతం తన  సోషల్ మీడియా ఫాలోవర్స్‌, ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. సామాజిక మాధ్యమాలలో చాలా యాక్టివ్‌గా ఉండే నమిత, తన ఫ్యాన్స్‌కి రెగ్యులర్‌గా అప్ డేట్స్ ఇస్తుంటారు.

 

వైరల్ అవుతున్న నమిత బేబీ బంప్ చిత్రాలు

తాజాగా మరోసారి నమిత తన బేబీ బంప్ ఫొటోలతో పాటు, వీడియోలను పోస్ట్ చేశారు. ప్రస్తుతం నమిత 9 నెలల గర్భిణీ అని తెలుస్తోంది. అతి త్వరలోనే ఆమె ఓ బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఈ క్రమంలో నిండు గర్భిణిగా (Namitha Pregnency) ఉన్నా కూడా.. ఓ ఫొటోషూట్‌ నిర్వహించి, ఆమె ఆ ఫొటోలను, వీడియోలను అంతర్జాలంలో షేర్‌ చేశారు. వీటిలో నమిత ‘కమ్మింగ్‌ సూన్‌’ అంటూ చేసిన బేబీ బంప్ వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ఈ ఫోటోలు చూసిన ఆమె అభిమానులు తనకు 'శుభాకాంక్షలు ' తెలియజేయడంతో పాటు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.పలువురు అభిమానులు అయితే 'సూపర్ నమిత' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా 2017లో ప్రముఖ వ్యాపారవేత్త వీరేంద్రతో నమిత వివాహం జరిగింది. 

Read More: Alia Bhatt: తల్లి కాబోతున్న బాలీవుడ్ బ్యూటీ అలియా భట్.. స్కానింగ్ ఫొటోలు వైరల్!

 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!